NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

డీజీపీ సవాంగ్ గారూ… నిజం చెబుతున్నారా – నిజం ఒప్పుకున్నారా?

గత కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పనితీరుపై వరుసగా వస్తున్న విమర్శలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎట్టకేలకు స్పందించారు. ఒకరిద్దరు చేస్తున్న పనులకు పోలీసు వ్యవస్థ మొత్తానికి చెడ్డపేరు వస్తోందని చెప్పిన ఆయన డిపార్ట్మెంట్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న భావన ప్రజల్లో కలిగిందన్నారు. మరి దానికి కారణాలు.. మన వారు తీసుకోబోయే యాక్షన్ ఎలా ఉన్నాయో మీరే చూడండి.

 

DGP Gautam Sawang responds over interstate travels, says same ...

చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారు?

దళితులపై దాడులు, అధికార పార్టీ నేతల కోసం డిపార్ట్మెంట్ వారిని బలి చేస్తున్నారన్న ఆరోపణలు పోటెత్తడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎట్టకేలకు స్పందించాల్సి వచ్చింది. అయితే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారన్న భావన ప్రజల్లో కలిగింది అన్న ఆయన అనుకోని సంఘటనలు కూడా పోలీసులకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి అని చెప్పడం గమనార్హం. డిజిపి స్థాయిలో ఉన్న వ్యక్తి…. కొన్ని అనుకోని సంఘటనలను డీల్ చేయలేని పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఆ భావన ఉండటం తప్పు అనడం ఎంతవరకు సమంజసమని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు. పోలీసులు అంటే అనుకోకుండా వచ్చే సంఘటనలను నిలువరించడానికి శిక్షణ పొందిన వారై ఉంటారని తమ నమ్మకమని…. అది మానేసి పవర్ ఉన్నవారికి అనుకూలంగా వ్యవహరించడం, వత్తాసు పలకడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు

ముందు జాగ్రత్త ఎక్కడ డీజీపి సాబ్?

ఇకపోతే సవాంగ్ మాట్లాడుతూ…. మార్పు రావాలి అంటే కచ్చితంగా కఠినంగా ఉండక తప్పదని హెచ్చరించారు. పోలీసులు తప్పు చేస్తే న్యాయపరంగానే కాకుండా శాఖా పరంగా కూడా కఠిన చర్యలు ఉంటాయని ప్రకటించారు. వచ్చే మూడు నెలలు పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ప్రకటించడం విశేషం. వరుసగా పోలీసుల తిరు వివాదాస్పదం అవుతుండడంతో.. ఇప్పటికైనా మార్పు తీసుకొని రావడం పెద్ద కష్టం కాదు అన్నారు. నేరుగా గౌతమ్ సవాంగ్ పలువురు పోలీసులు ఇసుక, మద్యం రవాణా వంటి అంశాల్లో కొన్ని ప్రలోభాలకు లోనవుతున్నారని వెల్లడించడం సంచలనమైంది. తొందరపడి కేసుల్లో పోలీసులు ఇరుక్కుంటున్నారని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద న్యూస్. ఇన్ని తెలిసి కూడా వివాదాలు చెలరేగి రచ్చ రచ్చ అయి…. పోలీసుల పరువు పోయే వరకు అత్యున్నత స్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని మీడియా వారు కూడా ప్రశ్నిస్తున్నారు

తప్పు వాళ్లు చేస్తే.. బాధ మీకెందుకు?

ఇంకా సవాంగ్ మాట్లాడుతూ…. ఇప్పటివరకు వరకు ఇసుక, మద్యం కేసుల్లో 53 మంది పోలీసు సిబ్బందిపై కేసులు నమోదు చేశామని చెప్పాడు. పోలీసుల పైన కేసులు పెట్టడం బాధగా ఉన్నాతప్ప లేదని అన్నారు. అసలు తప్పు చేసిన వాడు పోలీస్ అయితే ఏంటి?పోకిరి అయితే ఏమిటి? ఎవరు చేసినా తప్పు తప్పే. ఇంకా బాధ్యత కలిగిన పోస్టులో ఉంది చేస్తె అది ఇంకా పెద్ద తప్పు అవుతుందే తప్ప దానికి బాధ పడడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం జరిపిన సమీక్షలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని ఆయన అన్నారు. మన పోలీసులపై చర్యలు తీసుకోవడం బాధ అనిపిస్తుందని.. కానీ తప్పడం లేదని పదేపదే చెప్పడం చూస్తుంటే ఇలాంటి మనస్తత్వం పై అధికారులకు ఉన్నందువల్లే వారు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఇక అధికార పార్టీ మెప్పు కోసం పోలీసుల వ్యవహరించడం డిపార్ట్మెంట్ కి వల్ల చెడ్డపేరు వస్తుందని బహిరంగ రహస్యమని గౌతమ్ సవాంగ్ చివరికి ఒప్పుకున్నారు. ఇక ఈ విషయంలో అత్యున్నత స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ఘటనలు ఇలాగే జరుగుతూ ఉంటాయి తప్ప తగ్గేది లేదు అన్నది నిపుణుల అభిప్రాయం

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju