NewsOrbit
Featured బిగ్ స్టోరీ

Dhulipalla Narendra Arrest: పాడి గాడిలో పడినట్టే..!! జగన్ ప్లాన్ అమల్లోకి వచ్చినట్టేనా..!?

Telugu Desam Party: Crises Started Cadre in Deep Trouble

Dhulipalla Narendra Arrest: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రని పోలీసులు అరెస్టు చేశారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై సెక్షన్ 408, 409, 418, 420, 45, 471, 120బీ కింద కేసులు నమోదు చేశారు. నాన్ బెయిల్ కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇవేమి చిన్న కేసులు కాదు, ఇదేం చిన్న వ్యవహారం కాదు. రాష్ట్రంలో పాడిని గాడిలో పెట్టె క్రమంలో సీఎం జగన్ అమలు చేస్తున్న ప్లాన్ ఇది అనుకోవచ్చు..! రాష్ట్రంలో కీలక పాలడెయిరీలు చాల వరకు టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. వాటిలో అనేక అక్రమాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. అందుకే వీటిని నిగ్గు తేల్చే ఒక మహత్తర ప్లాన్ ఇప్పుడు జగన్ మదిలో ఉంది..! అందులో భాగమే నరేంద్ర అరెస్టు కావచ్చు..!!

Dhulipalla Narendra Arrest: CM Jagan Secret Plan in Milk Arrests
Dhulipalla Narendra Arrest CM Jagan Secret Plan in Milk Arrests

Dhulipalla Narendra Arrest: జవాబుదారీ లేకుండా.. ఇష్టారాజ్యంగా..!!

ఒంగోలు డెయిరీ, చిత్తూరు డెయిరీ.., మదనపల్లి డెయిరీ.., సంగం డెయిరీ.. కృష్ణా డెయిరీ… ఇవన్నీ ఒకప్పుడు ప్రభుత్వమే నడిపించేది. ప్రభుత్వ కంపెనీలుగా ఉండేవి. కానీ కాలక్రమేణా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కోటీ కంపెనీ చట్టంలోకి మార్చుకున్నారు. అంటే ప్రభుత్వానికి హక్కు లేదు. పూర్తిగా ప్రైవేట్ బాడీ ఉంటుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా ఉంటాయి. పాలను సేకరించుకోవడం, బిల్లులు చెల్లించడం.., డెయిరీ నడిపించడం, ధరలు నిర్ణయించడం మొత్తం ఈ డెయిరీ బోర్డు ఇష్టం. ఇలా చేసే ఒంగోలు డెయిరీ మొత్తాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. అప్పటి చైర్మన్ చల్లా శ్రీనివాసరావు రూ. 80 కోట్ల వరకు అక్రమాలకూ పాల్పడ్డారు. లాభాల్లో ఉన్న డెయిరీని నష్టాల్లోకి నెట్టారు. ఇప్పుడు ఈ డెయిరీని అమూల్ కి అప్పగించారు.

Dhulipalla Narendra Arrest: CM Jagan Secret Plan in Milk Arrests
Dhulipalla Narendra Arrest CM Jagan Secret Plan in Milk Arrests

సంగం డెయిరీపై ఎప్పటి నుండో కన్ను..!!

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిన తర్వాత డెయిరీల్లో అక్రమాలు పెరిగాయి. జవాబు దారీ లేదు. అడిగేవారు లేరు. ఆడిట్ కూడా వాళ్ళ ఇష్టమే. అందుకే జగన్ సీఎం అయ్యాక ఈ డెయిరీల అక్రమాలు ఒక్కోటీ విప్పుతున్నారు. ఒక్కో డెయిరీని నెమ్మదిగా అమూల్ కి అప్పగిస్తున్నారు. అమూల్ ద్వారా రైతులకు అదనంగా నగదు ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సంగంలో అక్రమాల భారతం పట్టినట్టు చెప్పుకోవచ్చు. “ఒక ప్రైవేట్ కంపెనీ చట్టంలో ఉన్న డెయిరీలో అక్రమాలు జరిగితే.., రైతులకు నష్టం జరిగితే.. రైతులు ఫిర్యాదు చేస్తే ముందుగా విచారణకు ఆదేశించారు. అవినీతి జరిగినట్టు ధృవీకరించి.. ఆ పై ఆ డెయిరీలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తే డెయిరీ చైర్మన్ ని అరెస్టు చేయచ్చు. ఇప్పుడు అదే జరిగింది. ఇక ఈ పాడి రైతులు అమూల్ డెయిరీలకు పాలు పోస్తారనేది జగన్ ఆలోచన కావచ్చు. దీని పర్యాసావాసనాలు ఎలా ఉంటాయనేది చూడాలి..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju