NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

సీఎం గారూ.., చూస్తున్నారా దారుణాలు..!? ఈ మకిలి కడుక్కోవాల్సింది మీరే..!!

ఎక్కడో అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే ఇంటికి ప్రస్తుత ఎమ్మెల్యే కత్తి పట్టుకుని వెళ్లొచ్చు..! అది వారి మధ్య తరతరాల గొడవ కావచ్చు గాక..!! కానీ @
ఎక్కడో కడప జిల్లా పొద్దుటూరులో ఒక చేనేత వర్గీయుడిని స్థానిక ఎమ్మెల్యే మనుషులు ఎవరో కొట్టి చంపేయొచ్చు..! అది అక్కడి రాజకీయ వివాదం కావచ్చు గాక..! కానీ @
ఎక్కడో విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీ రాముడి విగ్రహం తల తీసేసి పక్కనున్న కోనేటిలో పడేసేయొచ్చు..! అది అక్కడ ఎవడో తుంటరి వాడు చేసే వెధవ పని కావచ్చు గాక..! కానీ @


డాక్టర్ సుధాకర్ అనే సగం పిచ్చోడిని నడిరోడ్డుపై షర్టు లేకుండా చేసి అరెస్టు చేసినా.. అంతర్వేది రథం కాల్చేసినా.., ఏదైనా కావచ్చు..! కానీ @ ఇది నీ రాష్ట్రం, నీ రాజ్యం, నీ పరిపాలన..!! చట్టం ఎక్కడుంది..? శాంతి భద్రతలు ఎక్కడున్నాయి..? సోషల్ మీడియా.., రాజకీయ చైతన్యం ఇంత చురుకుగా ఉన్న ఈ రోజుల్లో కూడా గుడ్డిగా అధికార పార్టీ లోపాలు, తప్పులు కనిపిస్తుంటే ఎవరూ ఏమి మాట్లాడకుండా..? ఎవరూ ఏమి అనకుండా..? చివరికి నిన్ను నిందించకుండా ఎందుకు ఉంటారు..? జగనూ చూస్తున్నావా..!? ఇది నీ రాజ్యమే, నీ రాష్ట్రమే..!!

Nandam Subbaiah

మంచి తీసుకుని చెడు వదిలేస్తావా..!?

జగనన్న ఇళ్ల పట్టాలు.., జగనన్న తోడు.., జగనన్న విద్యాకానుక.., జగనన్న విద్యాదీవెన.., జగనన్న చేనేత నేస్తం.. ఇలా ప్రతీ పథకానికి జగనన్న అని నామాన్ని తగిలించుకోవడం తప్పు కాదు. అంటే గ్రామ స్థాయిలో.., క్షేత్రస్థాయిలో అంతిమ లబ్ధిదారుడికి కూడా ఇది “మా సీఎం జగన్” ఇచ్చిన కానుక అని తెలియాలి. అందుకే పథకాలను ఆ పేర్లు, ఆ ఫోటోలు. ఇది ఏమాత్రం తప్పు కాదు..! కాకపోతే ఇదే తరహాలో చెడు కూడా ఆలోచించాలిగా..! రాష్ట్రంలో ప్రతీ ఊరిలో, ప్రతీ ఇంటిలో నీ ప్రభుత్వ మంచి అందుతున్నప్పుడు…, రాష్ట్రంలో ఏం జరిగినా.. ఎక్కడ ఏ నరుకుళ్లు.., దేవుడి విగ్రహాల ధ్వంసాలు.., దాడులు జరిగినా అది కూడా జగన్ బాధ్యతే అవుతుందిగా. మంచి మాత్రమే కాదు, చెడు కూడా సీఎం ఖాతాలోనే వేయాలి, ప్రజలు కూడా వేస్తారు. అందుకే నీ రాజ్యంలో ఈ ఘోరాలు చూసి, అప్రమత్తం కాకపోతే నువ్వు ఇస్తున్న “సంక్షేమ ఆనందాలు ఆవిరిలో కలిసిపోయి.. ఈ ఘోరాలు తలదన్నేస్తాయి.., ఈ దారుణాలు ఆవహిస్తాయి”

ప్రతిపక్షాన్ని తట్టి లేపుతున్నట్టుగా..!!

ప్రతిపక్షం పడుకుంది. దాన్ని శాశ్వతంగా పడుకునేలా చేయొచ్చు. ఆ అవకాశం ఓటర్లు జగన్ కి ఇచ్చారు. కానీ ఆ పడుకున్న ప్రతిపక్షాన్ని నిద్రలేపి పోరాటాలకు ఉసిగొల్పుతున్నది అధికార పక్ష నాయకులే. వారికి పని కల్పిస్తున్నది ఈ వైసీపీ ఎమ్మెల్యేలే. ఈ ప్రభుత్వ వైఫల్యాలే. అక్కడున్నది చంద్రబాబు.., అతని డాబు మీడియా. చీమని చాప అంతగా చేసి చూపించగల దిట్టలు. అటువంటి వారిని ప్రత్యర్థులుగా పెట్టుకుని కూడా ఈ దారుణాలు ఎలా జరగనిస్తున్నట్టు..? అప్పుడెప్పుడో ఆరు నెలల కిందట జరిగిన ఆలయం దాడి ఘటనలో మొదటి సారి జరిగిన ఘటనలో నిందితున్ని పట్టుకుని.., గట్టిగా శిక్షిస్తే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలా జరిగేవి కాదు. నేడు విజయనగరం ఘటన మామూలుది కాదు. ఇక్కడ బీజేపీ చేవలేక.., తొత్తులా ఉంది కాబట్టి పర్వాలేదు.. లేకపోతే విజయనగరం జిల్లా రామతీర్ధం ఘటన ఇప్పటికే జాతీయస్థాయిలో మార్మోగేది. ఆ రిపబ్లిక్ టీవీ కూడా లైవ్ లో చూపించేది. ఈ ఘటనలు ఏవైనా.., నీ నాయకులే చేస్తున్నా వారికి సంతోషాన్ని ఇస్తున్నా… వీటి దుష్ఫలితాలు అనుభవించాల్సింది నువ్వే జగనూ..! ఇది నీ రాజ్యం, ఇది నీ రాష్ట్రం, వీళ్ళు నీ జనం..!!

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N