NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

పోలీసులు ఎక్కడివారక్కడే : గప్ చుప్ కొన్ని రోజులు !!

 

 

కొన్ని రోజులు మరికొన్ని రోజులు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఎక్కడివారు అక్కడే ఉండాలి. ఎవరికీ బదిలీలు ఉండవు. వేరే ప్రాంతాలకు డిప్యూటేషన్స్ ఉండవు. మరో విభాగాలకు మార్చేది అసలు ఉండదు. కేవలం పనిష్మెంట్ తప్ప, పనిష్మెంట్ తాలూకా బదిలీలు ఉండవు. ఇదేంటి అనుకుంటున్నారా? పోలీసులకు కొత్త పథకం అనుకోకండి. ఇది డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశం. ఎదుకంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పొలిసు శాఖ పరంగా ఇబ్బందులు రాకూడదని పోలీస్ బాస్ ముందు జాగ్రత్తల్లో భాగంగా తర్వాత ఇబ్బందులు రాకూడదనే తలంపుతో కానిస్టేబుల్ క్యాడర్ నుంచి అడిషన్ ఎస్పీ క్యాడర్ వరకు ఎలాంటి బదిలీలు వద్దని ఆర్డర్ వేశారు. ఇది వెంటనే అమలు కావాలని చెప్పడమే కాకుండా, కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.

జిల్లాలు ఎప్పటి లోగ ?

కొత్త జిల్లాల ఏర్పాటు, వాటి విభజన, దాని ప్రకటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హడావుడి స్పష్టత లేదు. పార్లమెంట్ నియోజక వర్గాలనే ఎంపిక చేస్తారా అనే దానిపై ఎలాంటివో సమాచారం లేదు. 26 నియోజకవర్గాలు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్న, స్థానిక పరిస్థితులను అంచనా వేయాలి . ఇప్పటికే మదనపల్లి, మార్టూరు వంటి చోట్ల జిల్లాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుంది అనేది నాయకులకే అంతు పట్టడం లేదు. అయితే డిజిపి ప్రస్తుత ఆర్డర్ చూస్తే మాత్రం త్వరలోనే జిల్లాల ప్రకటన అధికారికంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఉన్న ప్రచారం మేరకు జనవరి ఒకటి న నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ముఖ్యమంత్రి ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. జనవరి 26 న జిల్లాల ప్రకటన వస్తుంది అని మొదట భావించినా ఆ రోజు అధికార ఘనం జెండా పండుగలో ఉండే అవకాశం ఉంటుంది అని కొత్త సంవత్సర రోజు ప్రజలకు కొత్త వార్త చెప్పవచ్చని తలంపుతో ఆ రోజు ప్రకట రావొచ్చని నేతలు భావిస్తున్నారు.

పోలీసుల హడావుడి ఎందుకు?

కొత్త జిల్లాల ఏర్పాటులో పోలీసుల పాత్ర ఏమి లేకున్నా జిల్లాలకు విభజన సమయంలో వారి పంపకం విషయం, సర్దుబాట్లు కీలకం అవుతాయి. ప్రస్తుతం ఒక్కో జిల్లా రెండుగా మారె అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ సిబ్బంది నియామకం, వారి స్థానాల విషయంలో ఇబ్బంది రాకూడదు. జిల్లాకు అవసరం అయ్యే సిబ్బంది ఒక దగ్గర తక్కువగా మరో దగ్గర ఎక్కువగా ఉన్నా ఇబ్బందులు వస్తాయి. ఇక పోలీసుల ఎంపికలు రేంజ్ ల వారి ఖాళీలను బట్టి ఉంటాయి. కానిస్టేబుల్ గ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక సంస్థ ప్రకటన ఇచ్చే సమయంలోనే ఖాళీలను చూసి రేంజ్ ల వారీగా ఖాళీలను ప్రకటిస్తారు. పోలీస్ రేంజ్ నుంచి బయటకు వచ్చి పని చేయడం సిఐ స్థాయి వరకు అధికారులకు ఉండదు. రాష్ట్రంలో విశాఖ రేంజి పరిధిలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉంటే, ఏలూరు రేంజ్ పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలు వస్తాయి. గుంటూరు రేంజ్ లోకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ రేంజిలోకి చిత్తూర్, కడప, కర్నూల్, అనంతపురం ఉంటాయి. డిఎస్పీ స్థాయి వారిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఐతే రోస్టర్, పదోన్నతుల విషయంలో, జిల్లాల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు పరిపాలన పరంగా, సిబ్బంది లేమి ఉండకూడదు అని .. ఆయా జిల్లాల ఏర్పాటు ప్రకట వచ్చిన వరకు ఎవర్ని బదిలీ చేయొద్దు అనేది డిజిపి ఆర్డర్ లోని అసలు విషయం.

 

author avatar
Special Bureau

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju