NewsOrbit
బిగ్ స్టోరీ

ఈటవుట్… హెల్పవుట్… ఎంత తింటే అంత ఫ్రీ…

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని పెద్దలు ఊరకే అనలేదు… అవును ప్రతి సంక్షోభాన్ని మరో అవకాశంగా మలచుకోవాలని మనవుడు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు… ప్రపంచానికి గుణపాఠం చెప్పేందుకు కరోనా వచ్చిందో… చైనా వాడు ప్రపంచాన్ని దున్నేసేందుకు కరోనా తెచ్చాడో తెలియదు కానీ… ఇప్పుడు కరోనా ప్రపంచం ముందు ఎన్నో సంక్షోభాలు… సవాళ్లు… అవకాశాలను అందిస్తోంది. ఏడు నెలలకు కంటి మీద కునుకు లేకుండా సాగుతున్న కరోనా కల్లోలంతో ఇప్పుడు కొత్తదారులను ప్రపంచం అన్నేషిస్తోంది. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ ఏం చేసిందంటే…

Eatout  Helpout  The more you eat the more fre
Eatout Helpout The more you eat the more fre

సగం బిల్లు కడితే చాలు…

కరోనా దెబ్బతో ఆ రంగం ఈ రంగం అని కాకుండా ఎన్నో వ్యవస్థలు దెబ్బతిన్నాయ్. ఉద్యోగాలు పోయాయ్. ఉపాధి అవకాశాలు సన్నిగిల్లాయ్… కంపెనీలు మూతబడ్డాయ్. బతుకు ఎలా సాగాలో తెలియని దయనీయ పరిస్థితి. ఇలాంటి సిట్యూవేష్లో వ్యాపారాలను దారిలోకి పెట్టేందుకు బ్రిటన్ సర్కారు నడుంబిగించింది. కరోనాతో భారీగా దెబ్బతిన్న బ్రిటన్… కేసులు తగ్గడంతో… సాధారణ జీవితానికి ప్రజలు అలవాటుపడుతున్నారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రం అంతగా బిజినెస్ లేక డీలా పడిపోయాయ్. ఇలాంటి పరిస్థితుల్లో వాటి వ్యాపారాలను పూర్తి స్థాయిలో గాడిన పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

మందుబాబులకు నో యూజ్

సాధారణంగా ఆఫర్లు అనేక రకాలుంటాయ్. అయితే బ్రిటన్ సర్కారు ప్రకటించిన ఆఫర్ ఏంటంటే… కడుపు నిండా తినండి… బిల్లులో సగం మాత్రమే కట్టండి… సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు ఎన్నిసార్లైనా తినండి… ఎంతైనా తినండి… సుమారుగా 800 రూపాయల మేర ఆదా చేసుకోవచ్చు. పౌండ్లలో పది పౌండ్ల వరకు బిల్లులో మినహాయింపు ఇచ్చింది. అంత తింటేనే ఆఫర్ వర్తిస్తుందని నిబంధనలు ఏమీ లేవు. తక్కువ తినేవాళ్లకు ఈ ఆఫర్ సూపర్ ఉపయోగపడుతుంది. అయితే లిక్కర్, ఆల్కాహాల్ ఇందుకు మినహాయింపు. మరోవైపు వీకెండ్ పార్టీలు మాత్రం పాత రేట్లకే లభిస్తాయ్.

నారాయణమూర్తి అల్లుడు రిషి సూపర్ ఐడియా

బ్రిటన్లో లాక్ డౌన్ దరిమిలా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో హోటల్ ఇండస్ట్రీ భారీగా కుదేలయ్యింది. సుమారు 20 లక్షల మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. యజమానులు రెంట్లు కట్టలేక… ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక… వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఎలా ముందడుగేయాలో తెలియని పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఇంతకీ ఇలాంటి వండర్ ఫుల్ ఐడియా ఎవరికి వచ్చిందనేగా మీ అనుమానం. అవునండీ… మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రుషి సనక్‎దే ఈ ఆలోచన… ఇంగ్లాండ్ ఆర్థిక మంత్రిగా ఉంటూ సంస్కరణలతో దుమ్మురేపుతున్న రిషి ఐడియా ఇప్పుడు అక్కడ సూపర్ హిట్. ఈటవుట్… హెల్పవుట్ నినాదం ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఓ తారకమంత్రం… సో… ఇదే నినాదం ప్రపంచం ఫాలో అవుతుందేమో చూడాలి…

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju