Eenadu VS BJP: ఈనాడుకి స్ట్రాంగ్ డోస్ రెడీ చేసిన బీజేపీ..! రామోజీపై కేంద్రం కన్నెర్ర..!!

Eenadu VS BJP: Strong Counter by BJP to Eenadu
Share

Eenadu VS BJP: ఈనాడు ఏది రాస్తే అదే వార్త.. ఈనాడు ఏం బొమ్మ వేస్తే అదే నిజం.. ఈనాడులో ఏ కార్టూన్ వేస్తే అదే సెటైర్ .. ఇవన్నీ ఒకప్పుడు..! అందుకే ఈనాడు అన్నా.., రామోజీరావు అన్నా తెలుగు మీడియారంగంలో ఒక ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది.. అయితే కాలక్రమేణా ఈనాడు చీకటి వ్యవరాహాలు, భజనలు.. మీడియా పేరిట జరుపుతున్న సొంత వ్యాపారాలు సీక్రెట్లు బయటకు వస్తున్న తర్వాత ఈనాడుని పెద్దగా ఎవ్వరూ నమ్మడం లేదు. కాకపోతే మిగిలిన పత్రికల చేతగాని తనం.. ఇప్పటికీ ఈనాడు అంతర్గతంగా అనుసరిస్తున్న కొన్ని విధానాల కారణంగా ఇప్పటికీ ఈనాడే తెలుగునాట నంబర్ వన్ లో స్థిరపడింది.. అయితే ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం ఈనాడుకి స్ట్రాంగ్ పంచులు పడుతున్నాయి. ఈనాడు రాస్తున్న వార్తలకు, ఈనాడులో ఫోటోలకు, ఈనాడులో వస్తున్నా కార్టూన్లకు కూడా రివెర్స్ కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి. తాజాగా ఆ పత్రికలో కార్టూన్లకు “బీజేపీ” సోషల్ మీడియా టీమ్ ఇస్తున్న సెటైర్లు అదిరిపోయాయి. నెట్టింట వైరల్ గా మారాయి. ఈనాడులో జరుగుతున్న వ్యవహారాలకు పోలుస్తూ.. మీ సంస్థలో బాగోతాలను చూసుకోండి అంటూ సూటిగా, స్పష్టంగా ఏవ్ బొమ్మలతో కౌంటర్లు ఇస్తున్నారు బీజేపీ కుర్రాళ్ళు..!

Must Read : కొవాక్జిన్ తో భారత్ బయోటెక్ లక్ష్యం ఏమిటి..!? ఎందుకీ వివాదాలు..!?

Eenadu VS BJP: Strong Counter by BJP to Eenadu
Eenadu VS BJP: Strong Counter by BJP to Eenadu

Eenadu VS BJP: కేంద్రానికి శ్రీధర్ – ఈనాడుకు బీజేపీ..!!

ఈరోజు ఈనాడు “ఇదీ సంగతి”లో ఓ కార్టూన్ వచ్చింది. కోర్టు ఏ లెక్కలు అడిగినా కేంద్రం తెలియదు అని సమాధానం ఇచ్చిన విషయాన్నీ ఈనాడు కార్టూన్ వేశారు. వలసకూలీలు, రేషన్ కార్డులు, కూలీలకు సాయం అంశాలపై కోర్టు ప్రశ్నలకు కేంద్రం అన్నిటికీ తెలియదు సార్ అనడాన్ని హైలైట్ చేశారు. దీనికి కౌంటర్ గా బీజేపీ సోషల్ మీడియాలో ఈనాడు అంతర్గత వ్యవహారాలను హైలైట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. “ఉద్యోగులను తొలగిస్తున్నారుగా.., కొవాక్జిన్ లో పెట్టుబడులు పెట్టారటగా.., సిబ్బందికి వాక్సిన్ వేయించలేదట గా.., సిబ్బంది చనిపోతున్నా పట్టించుకోలేదటగా..” అని ప్రజలు ప్రశ్నిస్తే “ఈనాడు అన్నిటికీ “తెలియదు సార్” అని సమాధానమిస్తున్నట్టు ఒక అదిరిపోపోయే కౌంటర్ ని ట్రోల్ చేశారు. అలా కేంద్రానికి శ్రీధర్ కార్టూన్ ద్వారా సెటైర్ వేస్తే.. బీజేపీ సోషల్ మీడియా తమ కౌంటర్ ద్వారాఈనాడుకు చెమటలు పట్టించారు.

Eenadu VS BJP: Strong Counter by BJP to Eenadu
Eenadu VS BJP: Strong Counter by BJP to Eenadu

* మరో సందర్భంలో “పేద కూలీకి భోజనం పెట్టకుండా కేంద్రం తిండిగింజలు విదేశాలకు పంపిస్తుంది” అంటూ కార్టూన్ వేశారు. దీనికి కౌంటర్ గా బీజేపీ సోషల్ మీడియాలో “మాస్కులు పెట్టుకోండి.ఖాళీ ఉంటె కరువు పనికి వెళ్ళండి. అంతే తప్ప సంస్థ ఆదుకోదు” అని చెప్తూ ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు చూపిస్తూ కౌంటర్ వేశారు. ఇది కూడా వైరల్ అవుతుంది..!

Eenadu VS BJP: Strong Counter by BJP to Eenadu
Eenadu VS BJP: Strong Counter by BJP to Eenadu

ఈనాడు వ్యవహారాలపై కేంద్రం ఆరా..!?

మరోవైపు ఈనాడు రాతలు, కార్టూన్లు పై బీజేపీ పెద్దలు కూడా ఆర తీస్తున్నట్టు సమాచారం. నిజానికి ఈనాడు ఏ ఎండకు ఆ గొడుగు పెట్టె టైపు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీకి భజన చేస్తుంది. కానీ ఎన్నికలు ముందు మాత్రం టీడీపీ పక్కన చేరుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఈనాడు వ్యవహారం చూస్తే ఇది అర్ధమవుతుంది. అందుకే 2014 నుండి 2018 మధ్య టీడీపీ- బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు ఈనాడు బీజేపీ భజన విపరీతంగా చేసింది. 2015 లో సిబ్బందికి ఇచ్చే డెయిరీలను కూడా “కాషాయం” రంగులో ప్రచురించింది. బీజేపీ ప్రవేశపెట్టిన ముద్ర రుణాలు పథకం, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను సొంత వ్యవహారాలగా భావించి మాంచి ప్రమోట్ చేసింది. క్షేత్రస్థాయి సిబ్బందిని వాడుకుని బీజేపీ భజన విపరీతంగా చేసింది. ఆ ఫలితంగా రామోజీకి ఓ అవార్డు కూడా దక్కింది.. కానీ కేంద్రం స్థాయిలో ఆశించిన పదవి మాత్రం రాలేదు. ఇక 2018లో టీడీపీ – బీజేపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఈనాడు వైఖరి కూడా మారింది. ఇటీవల కేంద్రంపై మరీ వ్యతిరేకంగా కొన్ని ప్రచురిస్తుంది.. అందుకే బీజేపీ పెద్దలు కూడా ఈనాడులో రాతలను, కార్టూన్లను ఆరాతీస్తూ కొన్ని సూచనలు ఇచ్చినట్టు సమాచారం..


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 28th సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

RRR మామూలుగా లేడుగా..! జగన్ కి చిక్కుముడి వచ్చే సవాల్..!!

Special Bureau

Today Horoscope ఏప్రిల్ – 11 – ఫాల్గుణ మాసం – ఆదివారం.ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

Sree matha