NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Eetela Rajendar: ఈటెల కొత్త పార్టీ.. మరో ముగ్గురు కీలక నేతలు కూడా..!?

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team

Eetela Rajendar: తెలంగాణ రాజకీయాలు జోరెక్కుతున్నాయి.. రాజకీయాలు అనే కంటే టీఆరెస్ లో విబేధాలు జోరెక్కుతున్నాయి.. తెలంగాణ అన్నా.., టీఆరెస్ అన్నా అందరూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని మాత్రమే చూసి ఉంటారు. కానీ ఈ ముగ్గురుతో పాటూ ఈటెల రాజేందర్, నాయిని నరసింహ రెడ్డి వంటి కీలక నేతలున్నారు. ఈ అయిదుగురు కలిస్తేనే టీఆరెస్. వారి నాయిని మరణించారు. ఇప్పుడు ఈటెలపై కేసీఆర్ కత్తి దూశారు. హరీష్ రావు కీలకంగా ఉన్నప్పటికీ ఎన్నాళ్లుంటారో చెప్పలేని పరిస్థితి..! కాకపోతే ఇప్పటికిప్పుడు టీఆరెస్ కి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. అత్యంత కీలకమైన నేతలు ఆ పార్టీలో ఉన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తారు.. ఇక ఈటెల భవిష్యత్తు అడుగులు ఏంటి..? ఆయన మంత్రిగా దిగిపోయాక ఇక రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి..!? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది..!

Eetela Rajendar: New Party in Telangana Politics
Eetela Rajendar New Party in Telangana Politics

Eetela Rajendar: కొత్త పార్టీ షురూ..!? తెరవెనుక ఎవరు..!?

తెలంగాణాలో టీఆరెస్ కాకుండా కాంగ్రెస్, బీజేపీ పెద్ద పార్టీలుగా ఉన్నాయి. టీడీపీ ఐసీయూలో ఉంది. షర్మిల కొత్తగా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అది పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఓ కొత్త రాజకీయ పార్టీకి అడుగులు పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. “న్యూస్ ఆర్బిట్” కీలక సోర్సుల ప్రకారం.. తెలంగాణాలో మరో ఆరు నెలల్లో కొత్త పార్టీ రాబోతుంది. ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో పాటూ మరో ముగ్గురు ప్రస్తుత మంత్రులు కూడా వీరితో జత కట్టనున్నట్టు తెలుస్తుంది. వీరికి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఒక ఎంపీ సూత్రధారిగా ఉన్నట్టు తెలుస్తుంది. కొండా సురేఖ దంపతులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు మాజీ మంత్రులు, టీఆరెస్ లోని కొందరు ఎమ్మెల్యేలు, కలిసి భారీగానే ప్లాన్ చేసినట్టు సమాచారం. పరిస్థితులు మొత్తం చూసుకుని సదరు కాంగ్రెస్ ఎంపీ కూడా ఈ పార్టీతో జత కలిసి తెలంగాణాలో రాజకీయ పోరాటానికి దిగే అవకాశాలున్నట్టు చర్చలు జరుగుతున్నాయి.

Eetela Rajendar: New Party in Telangana Politics
Eetela Rajendar New Party in Telangana Politics

కేసీఆర్ తీరుతో కొందరు మంత్రుల్లో అసహనం..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ మొండి మనిషి. ఆయన ఒకటి అనుకుంటే అదే చేసి తీరుతారు. కానీ టీఆరెస్ లో కానీ.., తెలంగాణ రాజకీయాల్లో కానీ ఈటెల రాజేందర్ కీలక నేత. మంచి మాస్ లీడర్. నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయనపై పెద్దగా ఆరోపణలు లేవు. ప్రస్తుతం ఇతర మంత్రులు కొందరితో పోలిస్తే ఈటెల కి క్లీన్ చీట్ ఇవ్వొచ్చు. కానీ ఆయనపై ఒక ప్రణాళిక ప్రకారం మచ్చ వేయడం, తొలగించడం.. చూస్తే ఈటెలని అవమానించి బయటకు పంపించారు అనే చర్చ జరుగుతుంది. ఇదే తీరులో ఇంకొందరు మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి.., మరో ఇద్దరు మంత్రులు, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ మంత్రి.., కొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆరెస్ అధినేత తీరుపై అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది..! మొత్తానికి ఈ విషయం ఈటెలతో ఆగదు. రానున్న కొన్ని రోజుల్లోనే కొందరిపై కత్తి వేలాడుతుంది. ఆ అందరూ కలిసి కత్తులు దూయడమూ ఖాయమే..!!

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?