Etala Rajendar: ఈటల పెద్ద ప్లాన్.. కేసీఆర్ చుట్టూ “పొలిటికల్ పద్మవ్యూహం”..!!

Telangana Politics: Eetala Rajendar New Plans against KCR Team
Share

Etala Rajendar: ఈటలను మంత్రివర్గం నుండి తరిమేసి.. ఇప్పుడు పార్టీ నుండి తరిమేసి.. రాజకీయంగా అణగదొక్కే ప్రణాళిలను కేసీఆర్ పక్కాగా అమలు చేస్తున్నారు.. ఆయన రాజకీయ శిష్యుడిగా ఈటల కూడా అతను మించిన ఓ పెద్ద రాజకీయ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు..! కేసీఆర్ కి ఊహించని షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతని ఏకతాటిపైకి తేడానికి.., రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకి పక్కాగా అడుగులు వేస్తున్నారు.. గడిచిన వారం రోజులుగా వరుసగా భేటీలు ఇస్తున్నారు. పెద్ద, చిన్న నాయకులతో సంప్రదింపులు జరుపుతూ రానున్న రెండు నెలల్లో ఓ భారీ వేదిక సిద్ధం చేస్తున్నట్టే సమాచారం..!

Etala Rajendar: A Big Plan ready against KCR Team
Etala Rajendar: A Big Plan ready against KCR Team

Etala Rajendar:  ఎవరెవరు..? ఎవరి పాత్ర ఏంటి..!?

కేసీఆర్ వ్యతిరేకుల జాబితా తెలనగానలో పెద్దదే ఉంది. బీజేపీని పక్కన పెట్టేస్తే.., నాయకత్వం, వ్యక్తిగతంగా “రేవంత్ రెడ్డి.., ఈటల రాజేందర్.., మల్లు బట్టివిక్రమార్క.., కొండా విశ్వేశ్వర్ రెడ్డి.., డీ శ్రీనివాస్.., కొండా సురేఖ.., ప్రొఫెసర్ కోదండరాం.., ఈ అందరు లేకుండా తెలంగాణ రాజకీయాలను ఊహించలేం..! ఈ అందరూ ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ నీడలో ఉన్నారు. కానీ ఈ అందరికీ ప్రధాన రాజకీయ శత్రువు మాత్రం ప్రస్తుతం కేసీఆర్ మాత్రమే. ఆ ఏకైక అజెండాతో తెలంగాణలో ఓ పెద్ద రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా చర్చలు సాగుతున్నాయి. ఒక పెద్ద ప్రణాళిక.., ఓ ముందు చూపు.., ఓ భారీ నిధి.. ఓ కార్యక్రమాల చిట్టా తయారవుతుంది. ప్రస్తుతానికి సంప్రదింపుల దశలోనే ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. గడిచిన వారం రోజుల్లో ఈటల డీ శ్రీనివాస్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొండా సురేఖ, మల్లు భట్టివిక్రమార్క తదితరులతో భేటీ అయ్యారు..
* ప్రస్తుతం ఈటలకు రెండు దారులున్నాయి. బీజేపీలోకి వెళ్లడం లేదా రాజకీయ పార్టీ పెట్టడం. రాజకీయ పార్టీ ఏర్పాటుకే ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

Etala Rajendar: A Big Plan ready against KCR Team
Etala Rajendar: A Big Plan ready against KCR Team

ఒకేసారి మూడు మార్గాల్లో కేసీఆర్ పై దాడి..!!

ఈ రాజకీయ ప్రముఖులు అందరూ ఒకేసారి కలిసి రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క మినహా మిగిలిన అందరూ కలిసి రావచ్చు. రేవంత్ రెడ్డి మాత్రం తెరవెనుక మద్దతు ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్ వ్యతిరేకులకు తన మద్దతు ఉంటుందని ఇదివరకే రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కట్టుబాట్లు దాటుకుని.. ఏదో సమయం చూసుకుని రేవంత్ కూడా వచ్చేది ఈ పార్టీ బాధ్యతలు తీసుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు వీరి ప్రణాలికను గమనిస్తే..

* ముందుగా పదిమంది ప్రముఖులతో కలిసి ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు. ఓ భారీ బహిరంగ సభ నిర్వహణ. కేసీఆర్, కేటీఆర్ లపై వ్యతిరేకులకు పిలుపు ఇవ్వడం.. వారి ఏడేళ్ల పాలనలో అవినీతి అంశాలను, లోపాలను వివరించడం ద్వారా పోరాటం మొదలు పెడతారు.
* రాజకీయ పార్టీ ఏర్పాటుతో పాటూ ఓ టీవీ ఛానెల్, ఓ పత్రిక ఏర్పాటుకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఓ న్యూస్ ఛానెల్, దినపత్రిక ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది.
* ఈ ఏడాది చివరి నుండి తెలంగాణా మొత్తం పాదయాత్ర ప్రారంభించాలని ఓ ప్రణాళిక. నాలుగు నెలల పాటూ ప్రజల్లోనే ఉండేలా .. పాదయాత్ర లేదా, బస్సు యాత్ర చేయాలని నిర్ణయం..
* పార్టీకి నిధులకు ఇబ్బంది లేకుండా ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా కొందరు తటస్తులు, కలిసొచ్చే వారి నుండి ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.


Share

Related posts

యుపిలో మొత్తం సీట్లకు ‘హస్తం’ పోటీ

Siva Prasad

జెసి బ్రదర్స్‌కి షాక్:వైసిపిలో చేరిన ముఖ్య అనుచరుడు

somaraju sharma

Monal : మోనాల్ కెరియర్ లో అలాంటి ఇలాంటి న్యూస్ కాదు బంపర్ న్యూస్..!!, కంటెస్టెంట్ లు ఇండస్ట్రీ మొత్తం షాక్..!!

sekhar