Evaru Meelo Koteeswarudu: “ఎవరు మీలో కోటీశ్వరుడు..!? రూ. కోటి కలలను సాకారం చేసుకున్న విజేత..!

Evaru Meelo Koteeswarudu: One Crore Winner Raja Raveendra
Share

Evaru Meelo Koteeswarudu: జ్ఞానం అందరికీ ఉండదు.. జ్ఞానం ఉన్నవాళ్లు అందరూ విజేతలు కాలేరు.. అదృష్టం.., ఆ జ్ఞానాన్ని సరైన సమయానికి తగ్గట్టూగ్స్ వాడుకునే ఇంగితం.. బయటపెట్టగల సామర్ధ్యం అన్నీ ఉంటేనే విజేత కాగలరు.. జ్ఞానానికి పరీక్ష పెట్టె టీవీ షోలు, జీకే పరీక్షలు చాలానే ఉన్నాయి. జెమినీ టీవీలో ప్రసారమయ్యే “ఎవరు మీలో కోటీశ్వరుడు” అనే షోస్ జ్ఞానంతో పాటూ అదృష్టం ఉన్నవారిని వరిస్తుంది. మొదట రూ. 5 లక్షల వరకు అదృష్టమే అయినా.. ఆ తర్వాత ఒక్కో దశ దాటాలంటే కచ్చితంగా జ్ఞానం, విజ్ఞానం, విజ్ఞత ఉండాల్సిందే. ఇటువంటి కీలకమైన షోలో ఓ సామాన్యుడు రూ. కోటి గెలుచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమిని టివి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద రియాలిటీ జీకే గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”.. ఈ షోలో రూ. కోటి గెలుచుకున్నవారు అరుదు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు, మరో ఇద్దరు మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. కోటి మాత్రం ఎవ్వరూ గెలవలేదు. కానీ.. తొలిసారిగా కోటి రూపాయలు గెలుచుకున్న తొలి విజేతగా కొత్తగూడెంకు చెందిన బి.రాజా రవీంద్ర నిలిచారు.

Evaru Meelo Koteeswarudu: తెలంగాణాలో ఎస్సై..!

ఇప్పటి వరకు ఈ షోలో చాలా మంది పాల్గొన్నారు. ఈ సీజన్ లో అత్యధికంగా రూ. 25 లక్షలు మాత్రమే గెలుచుకున్న వారున్నారు. కానీ తొలిసారిగా .. మూడు సీజన్లు కలిపి చూసినా రూ. కోటి ఎవ్వరూ గెలవలేదు. అందుకే ఆ చరిత్రపుటల్లోకి రాజా రవీంద్ర ఎక్కారు. 33 ఏళ్ళ బి రాజా రవీంద్ర స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం. వృత్తిరీత్యా ఆయన పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన క్రీడల్లో దిట్ట. జాతీయ స్థాయిలో షూటింగ్ పోటీలలో పాల్గొని ఎన్నో పథకాలను సాధించారు. అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్లారు. కానీ ఆటలు, ఉద్యోగంతో పాటూ నిత్యం పుస్తకాలు, పత్రికలూ క్షుణ్ణంగా చదవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటు ఆయనను విజేతగా నిలిచింది. ఎప్పటికైనా ఒలింపిక్స్ లోపాల్గొని ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో మెడల్ సాధించాలని రాజా రవీంద్ర లక్ష్యం. అది నెరవేరడం కోసం గెలుచుకున్న కోటి రూపాయల నగదు ఉపయోగిస్తానని అయన తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Evaru Meelo Koteeswarudu: One Crore Winner Raja Raveendra
Evaru Meelo Koteeswarudu: One Crore Winner Raja Raveendra

ఈరోజు నుండి ప్రసారం..!

“ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో వ్యాఖ్యాత ఎన్టీఆర్ తరచూ చెప్పేమాట.. “ఆట నాది కోటి మీది” కొటేషన్ అక్షర సత్యం అయింది. కంటెస్టెంట్ బి. రాజా రవీంద్ర తన కలను నిజం చేసుకొని ” తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరి కొత్త రికార్డ్ సృష్టించారు, మరి ఈ మహా ఎపిసోడ్ లో NTR, కంటెస్టెంట్ రాజా రవీంద్రను ఏ ప్రశ్నలు వేసారు, కోటి రూపాయల ప్రశ్న దాకా ఎంత ఉత్కంఠభరితంగా ఆట కొనసాగింది తెలియాలంటే జెమిని టివిలో సోమ, మంగళవారాల్లో రాత్రి 8.30 ని.లకు ప్రసార మయ్యే”ఎవరు మీలో కోటీశ్వరులు” కోటి రూపాయల అద్భుత ఎపిసోడ్ ను చూడాల్సి ఉంది.


Share

Related posts

క్రిస్మస్ తాత గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్..!!

sekhar

శ్రావణి హత్య కేసు: ఆ రోజు ఆ ఫోన్ రాకపోయి ఉంటే శ్రావణి బతికి ఉండేది… ??

sowmya

YSRCP: జోగి రమేష్ కి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లేగా..! ఇదే ప్రూఫ్..!!

somaraju sharma