Fake Messages: మొన్న మాజీ డీజీపీ, నిన్న చింతమనేని..! ఇంకా ఎంత మందిని చంపేస్తారో..!?

Fake Messages: Worst Trend in Social Media
Share

Fake Messages: ఇటువంటి సోషల్ మీడియా సంస్కృతిలో మనం ఉండడం మన దారిద్రమేమో.. ఇంత చెత్త సంస్కారం ఉన్న మనుషుల మధ్య అదే గాలి పీలుస్తుండడం మనం చెత్త రోజులకు నిదర్శనమేమో.. సోషల్ మీడియాకి పట్టిన దరిద్రమో.., రాజకీయానికి చుట్టిన గ్రహణమో.. కారణం ఏమైనా కావచ్చు, కారకులు ఎవరైనా కావచ్చు వరుసగా మనుషుల్ని చంపేస్తున్నారు. అధికారులని, పోలీసులని, రాజకీయ నేతల్ని ఎవర్నీ వదలడం లేదు.. సోషల్ మీడియాలో రోజుకొకర్ని చంపేస్తూ నివాళులర్పిస్తున్నారు. పాపం… “మేము చనిపోలేదు మొర్రో… బతికే ఉన్నాము. మా ఆరోగ్యం బాగానే ఉంది” అంటూ వాళ్ళు బతికున్నట్టు నిరూపించుకోవాల్సి వస్తుంది.

Fake Messages: Worst Trend in Social Media
Fake Messages: Worst Trend in Social Media

Fake Messages:  చింతమనేని, ముళ్ళపూడి చనిపోయారంటూ..!

పశ్చిమ గోదావరి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరణించారు అంటూ నిన్న ఫేస్ బుక్ పేజీలో ప్రచారం చేశారు. “అశ్రు నివాళి. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి అకాల మరణం మమ్మల్ని బాధిస్తుంది” అంటూ ఒక సందేశాన్ని తయార చేసి, పేస్ బుక్ లోని టీడీపీ పేజీలోని పెట్టారు. దీంతో ఆయనకు వందలాది ఫోన్ లు వెళ్లాయి.
* పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు విషయంలోనూ ఇలాగే జరిగింది. కొన్ని టీడీపీ గ్రూప్స్ లో ఒకేసారి ఈ ఇద్దరి మరణం వార్త దవాలంలా వ్యాపించింది. నిమిషాల వ్యవధిలో టీడీపీ అన్ని గ్రూపుల్లోనూ షేర్లు చేసేసారు. నిన్న సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వాళ్లకు ఫోన్లు మొగుతూనే ఉన్నాయి. జిల్లా మొత్తం ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆ ఇద్దరూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు.

Fake Messages: Worst Trend in Social Media
Fake Messages: Worst Trend in Social Media

మాజీ డీజీపీ పేరిట మొన్న..!

రెండు రోజుల కిందట కొన్ని వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ లో మరో మెసేజ్ కూడా హల్ చల్ చేసింది. ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు మరణించారనే వార్త సోషల్ మీడియాలో బాగా వ్యాపించింది. రాజకీయ, పోలీసు సర్కిళ్లలో ఎక్కువగా చక్కర్లు కొట్టింది. వచ్చే వార్త నిజమా, కదా అని తెలుసుకునే టైం కూడా లేని జనం చాలా మంది వీటిని వివిధ గ్రూప్ లలో షేర్లు చేసేసారు. అలా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ వార్త వ్యాపించింది. కొద్దిసేపటికే తేరుకున్న ఆయన వెంటనే ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. “బతికున్న మనిషి చనిపోయారంటూ సోషల మీడియాలో ఇలా ప్రచారం చేయడం చాలా పెద్ద నేరం. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కింద కేసులు నమోదు చేసే వీలుంది. అక్కడ చింతమనేని, ముళ్లపూడి బాపిరాజు.., ఇక్కడ మాజీ డీజీపీ ఈ అందరిపై దుష్ప్రచారం ఒక్కరి పనేనా..!? దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా..!? అనేది పోలీసులు ఛేదించాల్సి ఉంది. లేకపోతే మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం లేకపోలేదు..


Share

Related posts

ఎల్ఐసి హౌసింగ్ నోటిఫికేషన్

bharani jella

ఆచార్య కి డేట్స్ ఇచ్చిన రాం చరణ్ .. కొరటాలకి ఈ డేట్స్ సరిపోతాయా ..?

GRK

Eesha Rebba : ఈషా రెబ్బ ని ఈ డ్రెస్ లో చూస్తే ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద ఆఫర్స్ ఇవ్వడం గ్యారెంటీ..

bharani jella