NewsOrbit
బిగ్ స్టోరీ హెల్త్

వాక్సిన్ సంగతి మరచిపోండి – ఇది త్వరగా రావాలి అని దండం పెట్టుకోండి .. వ్యాక్సిన్ కి బాబు ఇది!

ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. ఎక్కడ చూసినా అవే వార్తలు. ఒక్క భారతదేశంలోనే ప్రెతీ రోజు వందలకొద్దీ మరణాలు. ఇక ఆశలన్నీ వ్యాక్సిన్ పైనే. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రోజూ అడ్మిట్ అవుతున్న వేలాది పేషెంట్లకు న్యాయం చేయలేని పరిస్థితి. ఈ సమయంలో కరోనా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్లో ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేసి మరీ వైద్యం అందిస్తున్నాడు. ఈ వివరాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

 

వివరాల్లోకి వెళితే… వెంటిలేటర్ అవసరం లేకుండానే ‘హై ఫ్లో ఆక్సిజన్ ద్వారా’ ప్రాణాలను కాపాడుకోవచ్చు అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఇక వివరంగా తెలుసుకుంటే కరోనా వైరస్ శ్వాసకోశాల్లోకి ప్రవేశిస్తుందని అక్కడే సమస్యలు సృష్టిస్తుందని భావించే వాళ్ళం అందరం. కానీ అది రక్తంలో కూడా ప్రవహిస్తుంది అని చెచ్చి షాక్ ఇచ్చారు డా. నాగేశ్వర్ రెడ్డి. వ్యాక్సిన్ వచ్చేందుకు కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. ఈ లోపల కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడాలి. దానికి మెరుగైన వైద్య సేవలు అవసరం. వైరస్ రక్తం లోకి ప్రవేశించింది అంటే అది చాలా ప్రమాదకరం. కావున వెంటిలేటర్ కన్నా ప్రస్తుతం అతి ప్రభావవంతమైన, ముఖ్యమైన ప్రక్రియ ఈ ‘హై ఫ్లో ఆక్సిజన్.’

వైరస్ ఆక్సిజన్ లోకి ప్రవేశించడం వల్ల రెండు వారాలలో రక్తంలోని ఆక్సిజన్ శాతం 95 కంటే తక్కువ పడిపోతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. 90 శాతం కంటే తక్కువ ఉంటే అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. కొందరిలో అయితే ‘హ్యాపీ హైపాక్సియా’ ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం 80-85 ఉన్నా కూడా పైకి మామూలుగా కనిపిస్తారు. ఉన్నట్టుండి పరిస్థితి విషమించి నేరుగా గుండెపై వైరస్ తన ప్రభావాన్ని చూపుతుంది.

ఇలాంటి వారికి మొదటి వారంలో యాంటీవైరస్ మందులు ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనవి రెండు…. మనందరికీ తెలిసినవే. ఫావిపిరవిర్, రెమిడేసివిర్. ఇవి రెండూ చాలా ప్రభావవంతం, ఖరీదు కూడా ఎక్కువ. ఆ తర్వాత మనిషి పరిస్థితికి తగ్గట్టు, అతనిలో బయటపడే లక్షణాలకు తగ్గట్టు ‘డెక్సామిథాసోన్’, స్టెరాయిడ్స్ వంటివి ఇస్తారు. ఆక్సిజన్ ఇస్తూ స్టెరాయిడ్స్ చికిత్స అందించడం వల్ల 99 శాతం మందిలో మూడు రోజుల్లోనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

ఆ తర్వాత సాధారణంగా ముక్కు ద్వారా అందించే ఆక్సిజన్ వల్ల ఎక్కువ మందిలో 2 నుండి 10 లీటర్ల ఆక్సిజన్ సరిపోతుంది. అది సరిపోకపోతే ‘నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్’ విధానంలో ఆక్సిజన్ ను అందిస్తారు. ఇటీవల ‘నాసల్ కేథటర్’ ద్వారా కొత్తగా ‘హై ఫ్లో ఆక్సిజన్’ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తాయి. ఇది ఇస్తే వెంటిలేటర్ పై చికిత్స అవసరమే లేదు. ‘ఈ హై ఫ్లో ఆక్సిజన్’ ప్రక్రియ రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగేళా చేసి వైరస్ కణాలను నిర్వీర్యం చేస్తుంది… వ్యాక్సిన్ వచ్చేలోపు మనిషి ప్రాణాలను నిలబెడుతుంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri