న్యూస్ బిగ్ స్టోరీ

ఆది నుంచి అనూహ్యం వరకు… అన్న రాజకీయ ప్రస్థానం!!

Share

 

 

అప్పటి వరకు తెరపై అద్భుతమైన నటుడు… ఆయనను చూసేందుకు ఊళ్లకు ఊళ్ళు కట్టగట్టుకుని వచ్చేవారు.. తెరపై కృష్ణుడు గా కనిపించే ఆయన రూపాన్ని గుండెల్లో పెట్టుకునేవారు.. ఆడితే ఆహా అనేవారు. బొమ్మ పడితే జై కొట్టేవారు. అదే ఊపు తో తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని నినాదంతో 1982 మర్చిలో రాజకీయ పార్టీని స్థాపించి 1983లో కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు అధికారంలోకి రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఆయన రాక దేశవ్యాప్తంగా ఓ ప్రభంజనం అయితే.. తర్వాత ఎన్టీ రామారావు కేంద్రంగా సాగిన రాజకీయ ప్రస్థానం అంతా ఆయన మృతి చెందే వరకు ఓ ఒడిడోడుకుల ప్రయాణంగానే మిగిలిపోతుంది.

1985 నుంచే!

సినిమా యాక్టర్ గా పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారం వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయన… అనారోగ్యం కారణంగా అమెరికాలో కి వెళ్లి చికిత్స చేయించుకోవడం పార్టీలోని ఓ వర్గానికి కన్ను కొట్టినంత పని అయింది. పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీరామారావు అమెరికాకు వెళ్లారని నెపంతో తాత్కాలికంగా అధికారం చెప్పాల్సింది పోయి తానే ముఖ్యమంత్రిగా గద్దె నెకకెందుకు స్కెచ్ వేయడం కొందరు ఎమ్మెల్యేలను తన వెంట తిప్పుకోవడం… ఆయన మాటకు గవర్నర్ సైతం తల ఊపడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. పార్టీ స్థాపించిన మూడు సంవత్సరాల్లోనే పెను సంక్షోభం ఎదురయ్యింది. దీంతో అమెరికా నుంచి వచ్చిన ఎన్టీఆర్ 1985లో ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు.
** 1985 ఎన్నికల్లో 200 పైగా సీట్లు సాధించిన ఎన్టీఆర్ తర్వాత కాలంలో తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు, ఆయన పాలన తీరు పుణ్యమాని 1989లో టిడిపి ఓడిపోయింది. మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
** 1994 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ నుంచి అధికారం చేపట్టిన ఎన్టీఆర్ మరింత బలంగా 216 సీట్లు సాధించారు. కాంగ్రెస్ ప్రతిసారి ముఖ్యమంత్రులను మార్చే తీరుతో పాటు వారు తీసుకున్న నిర్ణయాలపై ఎన్టీఆర్ సాగించిన ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అన్ని వర్గాలు టిడిపి వైపు చూడడం అదే తొలిసారి. 1994లో ముఖ్యమంత్రి అయ్యాక టిడిపిలో వింత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత టిడిపి అధినేత చంద్రబాబు కేంద్రంగా కొత్త రాజకీయాలు టిడిపిలో మొదలయ్యాయి. ఎన్టీఆర్ కు అప్పటికి దగ్గరైన లక్ష్మీపార్వతి అనే మహిళ పార్టీ మీద విపరీతమైన పెత్తనం చేయడమే కాకుండా ప్రభుత్వం మీద, అధికారుల మీద ఆధిపత్యం ఎక్కువైందని కోణంలో చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీలోని కొందరు ను తమ వైపు తిప్పుకొని వైస్రాయ్ హోటల్ కేంద్రంగా నడిపిన రాజకీయం రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2016 సీట్లు సాధించిన ఎన్టీఆర్ను పదవి నుంచి దింపి… టీ టీ టీడీపీ శాసనసభాపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం పెద్ద వివాదం అయింది.
** 1996 జనవరిలో ఎన్టీఆర్ గుండెపోటు కారణంగా మృతి చెందడం కూడా పలు వివాదాలకు విమర్శలకు దారి తీసింది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా చంద్రబాబు కారణంగానే ఆయన మృతి చెందారని ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి.
** రాజకీయాల్లో మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్ ఒక సంచలనం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒక కీలక అంశం ఉండేది. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకుంటారని పేరున్న ఆయన ప్రధాని చరణ్ సింగ్ తర్వాత కీలకం ఆయన మూడో ఫ్రంట్ లోనూ టీడీపీ కీలకంగా వ్యవహరించింది. మొత్తం ఫ్రంట్కు కన్వీనర్గా ఎన్టీరామారావు వ్యవహరించారు. దేశ రాజకీయాల్లో కి వెళ్తారు అనుకున్న ఎన్టీఆర్ 1994లో వచ్చిన ప్రభంజనంతో ఆయన ఖచ్చితంగా ప్రధాని అవుతారని మాట వినిపించింది. అయితే అంతలోనే పార్టీ సంక్షోభం తర్వాత ఆయన మరణం ఆయన ప్రస్థానాన్ని విషాదంగా ముగిసింది.


Share

Related posts

టీవీ9 దేవి తన రియల్ లైఫ్ లో ఎలాంటి పనులు చేయాల్సి వచ్చిందో తెలిస్తే అవాక్కవుతారు..! 

arun kanna

BJP ; ఆ సీక్రెట్ సర్వేలో ఏం తెలిసింది..!? బీజేపీ సైలెన్స్ వెనుక కారణాలేంటి..!?

Srinivas Manem

జగన్ అడ్డా లో జగన్ మీద ముసలం పుట్టింది ? కారణం ఇదే ? 

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar