NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గంటా శ్రీనివాసరావు సాక్షిగా పవన్ కి గట్టి ఝలక్ ఇచ్చిన చిరంజీవి

ఇప్పటికీ రాష్ట్ర ప్రజలందరి నోట ఒకటే మాట. చిరంజీవి కనుక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగా వైఫల్యాలను తట్టుకొని పట్టుదలతో నిలబడి ఉంటే ఈపాటికి ముఖ్యమంత్రి అయిపోయే వాడు అని. సరే మొత్తానికి చిరు ఏదో రకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చివరికి రాజకీయాలనుండి పూర్తిస్థాయిలో తప్పుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వైసిపి అధికారం లోకి వచ్చిన తర్వాత తన కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఏమాత్రం నమ్మకం లేనట్లు వ్యవహరించారు అన్న వాదన కొత్తగా తెరమీదకు వచ్చింది.

 

విషయం ఏమిటంటే జగన్ వద్ద ముఖ్యమంత్రి సీటు పదికాలాలపాటు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు 2019 ఎన్నికల ఫలితాలతోనే తేల్చి చెప్పేశారు. ఏపీ లోని రాజకీయ వాతావరణం మొత్తం ఐదేళ్ళ పాటు దాదాపు వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. ఇక చిరంజీవికి కూడా ఇది పూర్తిగా అర్థం అయినట్లు ఉంది. అందుకే ఆయన అనుచరుదిగా సన్నిహితుడిగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ని వైసీపీలోకి తీసుకురావడానికి అయిన తనదైన రాయబారం చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

జగన్ ఇంకా చిరంజీవి మధ్య మంచి సాన్నిహిత్యం ఈ మధ్యకాలంలో ఏర్పడిం ఇద్దరూ ఫోన్లో కూడా మాట్లాడుకునే చనువు ఉంది. ఏ ముహూర్తాన మూడు రాజధానుల పై మాట్లాడుతూ జగన్ చెవిన చిరంజీవి…. విశాఖలో బిజినెస్ టైకూన్ అయిన గంటా మాటను వేశారో.. ఇప్పుడు కాస్త అతనిని అధికార పార్టీ లోకి తేవడానికి తన వంతు పాత్ర పోషించారని వైసీపి వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇదే సమయంలో తన తమ్ముడు స్థాపించిన జనసేన లోనికి చిరంజీవి చెబితే గంట తు.చ తప్పకుండా వెళ్లి కనీసం ఇలా అయినా ఆ పార్టీని ఉ త్తరాంధ్ర లో బలపరిచేందుకు చర్యలు తీసుకునే వారు. గంటాకు మెగా ఫ్యామిలీ తో ఉన్న అనుబంధం అలాంటిది. కానీ ఎందుకో పవన్ రాజకీయం పై మెగా అన్నయ్య చిరంజీవి కే నమ్మకం లేక కొన్ని డౌట్లు ఉన్నాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పైగా బీజేపీతో దోస్తీ చేస్తున్న పవన్ కి మద్దతుగా గంటతో ఒక మాట చెబితే ఆ పార్టీ కి వెళ్లి భుజం కాయడం గంటా కు పెద్ద పని కాదు. కానీ అలా కాకుండా వైసీపీలో చేరమని అతను చెప్పినట్లు వస్తున్న మాటలు చూస్తుంటే ఏదేమైనా చిరంజీవి నేరుగా కాకపోయినా ఆయన మనిషిగా గంటా అయిన గంటాను జగన్ కి తోడుగా ఉండమని చెప్పాడని తెలుస్తోంది. అయితే తమ్ముడి రాజకీయాల మీద చిరు కి అసలు ….నమ్మకం లేదా అసలు రాజకీయాల మీద నమ్మకం లేక ఏదో జగన్ అలా పరిచయం కొనసాగించేందుకు చిన్న సహాయం చేశాడా అన్న విషయం తెలియాల్సి ఉంది

author avatar
arun kanna

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!