NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హైదరాబాదీ చెవిలో “కాషాయ” పూలు..! గులాబీ కూడా అదే తీరు..!!

అసలే కార్తీక మాసం. రోజూ పూజలు చేయాలి. ఆ పూజకి పూలు కావాలి. హైదరాబాద్ లాంటి మహానగరంలో పూలకు కరవు వస్తుంది. అందుకే ఆ పూలు పార్టీలే ఇస్తుంటే.., పూలతో పాటూ పూజలు కూడా చేస్తుంటే ఆ కిక్కే వేరు కదా..! అందుకే హైదరాబాద్ లో పూలకు, పూజలకు ఇబ్బంది లేదట. ఈ పూజల్లో బీజేపీ ముందు వరుసలో ఉంటె.., టీఆరెస్ కూడా అదే ఆటలో పయనిస్తుంది..! ఆ పూలు ఏమిటో, పూజలు ఏమిటో.. చూద్దాం పదండి..!!

ముందుగా ఒక చిన్న లెక్క..!!

గ్రేటర్ లో మొత్తం బడ్జెట్ రూ. 6 వేల కోట్లు. గ్రేటర్ మొత్తం ఆదాయం రూ. 3 వేల కోట్లు. తిప్పి తిప్పి కొడితే.. పన్నులు, ఇతర వసూళ్లు పెంచేస్తే మరో రూ. 500 కోట్లు పెరుగుతుందేమో..! కానీ ఈ పార్టీలేమిటి..? రూ. లక్ష కోట్ల హామీలిచ్చేశాయి. సరే ఇచ్చాయి అనుకుందాం.., ఈ డబ్బు ఎవరిస్తారు..? ఎక్కడి నుండి తెస్తారు..? సరే రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అనుకుందామ్.., కానీ ఏ ఖాతాలో ఇస్తుంది..? ఏ లెక్కల్లో ఇస్తుంది. ఇక్కడి జనాభా ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇస్తే మిగిలిన ప్రాంతాలు ఏమవ్వాలి..? తెలంగాణ మొత్తం బడ్జెట్ లో సగం హైదరాబాద్ కె ఖర్చు చేస్తామన్నట్టు ఎన్నికల హామీలిచ్చేస్తే జనం చెవిలో పూలు కాక ఇంకేమంటారు..!??

ఇవి మరీ విడ్డూరం కదా..!?

బీజేపీ మేనిఫెస్టో ఒకసారి చూద్దాం..! లక్ష ఇల్లు కట్టిస్తారట. బడిలో పేద పిల్లలకు ఉచితంగా టాబ్స్, వైఫై ఇస్తారట. 100 యూనిట్లు లోపు కాలిస్తే కరెంటు ఫ్రీ గా ఇస్తారట. ఎల్ఆర్ఎస్ తీసేస్తారట. పాత బస్తీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారట. సెప్టెంబర్ 17 న అధికారికంగా తెలంగాణ విముక్తి దినంగా పాటిస్తారట..! ఇవి చెవిలో పూలు కాక మరేమిటి..? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశాలను ఒక మునిసిపల్ కార్పొరేషన్ చేయగలదా..? ఒక వేళ చేసినా. డబ్బు ఎక్కడి నుండి తీసుకువస్తారు..? ఇవి కాకుండా బీజేపీ ఇచ్చిన హామీల్లో కాస్త అమలు సాధ్యమైనవి కూడా ఉన్నాయి. 24 గంటలూ నీటి సరఫరా.., కొత్త మెట్రో లైన్లు, మహిళలకు మెట్రో ప్రయాణం ఉచితం.., బైక్స్, ఆటోలకు చలాన్లు మాఫీ.., ప్రతి కిలోమీటర్ కి మహిళలకు ప్రత్యేక టాయిలెట్ నిర్మాణం..! ఇవి అమలు చేసే వీలుంది.

కానీ ముందు చెప్పుకున్న హామీలు కచ్చితంగా అమలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ. 40 వేల కోట్లు కావాలి. బీజేపీ ఎక్కడి నుండి తీసుకువస్తుంది..!? ఇక టీఆరెస్ హామీల్లో విడ్డురంగా పెద్దగా ఏమి లేనప్పటికీ.. కొన్ని గాలి హామీలున్నాయి. ఇన్నాళ్లు నెరవేర్చని హామీలు కొత్తగా చెప్పినట్టు పాత అంశాలను చేర్చారు. 20 వేల లీటర్ల నీటి సరఫరా.., లాండ్రీలకు, సెలూన్లకు ఉచిత కరెంటు ఇవ్వడం కొత్త హామీలే. అయితే టీఆరెస్ , బీజేపీ హామీల అమలుకు మాత్రం గ్రేటర్ బడ్జెట్ సరిపోదు అనేది నూటికి నూరుశాతం వాస్తవం. అలాగే కొన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను హామీల్లో చేర్చడమూ విడ్డురమే.

ఇది ఎలా సాధ్యం..!?

ఒకవేళ బీజేపీ హామీలు అమలు చేయాల్సి వస్తే ఏటా రూ. 50 వేల కోట్లు ఎక్కడి నుండి తీసుకువస్తారు..? గ్రేటర్ బడ్జెట్ మించి అప్పులు చేస్తారా..? అప్పులు కూడా ఎక్కడి నుండి చేస్తారు..? అనేది ప్రశ్న. ఇప్పుడు ఏపీ చీటికీ మాటికీ అప్పులు చేస్తున్నట్టుగా.. గ్రేటర్ కూడా అప్పులు చేయాలన్నా కుదరని పని. ఒక మునిసిపల్ కార్పొరేషన్ కి అప్పులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ష్యురీటి ఉండాలి. అదీ ఏదో ఒక ఆస్తి తాకట్టు పెడితేనే. రాష్ట్రం కుర్హ్సీఈలో టీఆరెస్ ఉన్నప్పుడు గ్రేటారు లో బీజేపీ ఎలా ఈ వేల కోట్ల మాటల్ని అమలు చేస్తుంది అనేది ఆలోచిస్తే చెవిలో పూలు కాక మరేమిటి..? పోనీ టీఆరెస్ అంటే ఎంతో కొంత అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వారే అధికారంలో ఉన్నారు కాబట్టి.. ఏదో సర్దుబాటు చేసుకోగలరు. కానీ బీజేపీకి అలా సాధ్యం కాదు కదా..!? అందుకే జనం చెవిలో పూలు అనేది..!

 

 

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk