బిగ్ బాస్ నాలుగో సీజన్ రేపటితో ముగియనుంది. 15 వారాల పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను వినోదంలో ముంచెత్తిన ఈ రియాలిటీ షో చివరి దశకు చేరుకుంది. ఇక ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం అభిజిత్ ఈసారి టైటిల్ విజేత గా నిలిచాడు అని తెలుస్తోంది వరుసగా నాలుగో సారి మేల్ కంటెస్టెంట్ ఈ టైటిల్ సాధించాడు. మరి దీని వెనుక ఉన్న విశ్లేషణ ఏమిటో చూద్దాం…
పెద్ద మైనస్ ఇదే….
ఈ సీజన్ మొదలయ్యే ముందు ప్రేక్షకుల అందరిలో ఒక సందేహం ఉంది. ఈ సారి కూడా టైటిల్ మేల్ కంటెస్టెంట్ గెలుస్తాడా లేదా తొలిసారి ఒక అమ్మాయి తన సత్తా చూపిస్తుందా అని ఆత్రుతగా ఉన్నారు. ఇక కంటెస్టెంట్ ల పేర్లు ప్రకటించిన వెంటనే ఈ సారి అమ్మాయిలు కొట్టడం కష్టం అని ఫిక్స్ అయిపోయారు. ఉన్నవారిలో లాస్య కొద్దిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. దివి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇద్దరూ వెళ్లిపోవడంతో ఆశలు సన్నగిల్లాయి ఇదంతా పక్కన పెడితే మొదటినుండి షో లో మొదటినుండి అబ్బాయిల డామినేషన్ ఉంది. ఒక్క అరియానా తప్పించి ఎవరూ పెద్దగా ప్రభావం చూపించింది లేదు. అయితే ఎప్పుడైతే సోహెల్ లాంటి కంటెస్టెంట్ అరియానా పైన విరుచుకుపడగానే ఆమె ఏడ్చిన వెంటనే అందరూ ఉమెన్ కార్డు వాడింది అని నిందించారు. అమ్మాయిలకి ఇది ఒక పెద్ద ప్రతికూలత.
చాలా కొద్ది మంది మాత్రమే…
ఈ విషయానికి వస్తే గత సీజన్లలో కూడా అమ్మాయిలు అంత ప్రభావవంతంగా ఆడలేదనే చెప్పాలి హరితేజ, గీతామాధురి, తేజస్వి, శ్రీముఖి ఇలా ఒక అయిదారు పేర్లు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవడం తప్పించి పెద్ద పేర్లు బయటకు రావు. వీరందరిలో కి శ్రీముఖి బాగా గట్టి కంటెస్టెంట్ అని చెప్పాలి. అయితే దీనికి ప్రధాన కారణం ఫిజికల్ టాస్క్ ల్లో అబ్బాయిలతో సరిసమానంగా వీరు పోటీపడడం లో విఫలం అవుతున్నారు. ఇక అమ్మాయిలకి ఉండే ఎమోషన్స్, వీక్ నెస్ ను కూడా అబ్బాయిలు టార్గెట్ చేసి ఎలివేట్ అవుతున్నారు.
ఇంకా వివరాల్లోకి వెళితే ఈ సీజన్లోనే కొన్ని ఉదాహరణలు చూడవచ్చు. షో మొదలైనప్పటి నుండి హారిక పెద్ద తప్పు చేసింది లేదు. అయితే అభిజిత్ నీడలో బ్రతుకుతుంది అన్న ముద్ర వేసుకుంది. ఇక అభిజిత్ సపోర్టర్ కు మాత్రమే ఆమెకు ఓటు వేసే పరిస్థితి. ఆమె ఉన్న కొద్ది మంది ఫ్యాన్స్ ఓట్లు సరిపోలేదు. మోనాల్ విషయానికి వస్తే మొదట్లో ఆమె ఇద్దరితో లవ్ ట్రాక్ నడిపింది అనేస్తారు. ఆమె వల్ల వీరిద్దరికీ క్రేజ్ రావడం మొదలైంది. ముఖ్యంగా అఖిల్ అయితే మోనాల్ వల్లే హైలెట్ అయ్యాడు అని చెప్పాలి. కానీ తర్వాత మోనాల్ సాధారణ కంటెస్టెంట్ అయిపోయింది. అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
కానీ ఆడవారు టైటిల్ కొట్టే రోజులు పెద్ద దూరంలో లేవని తెలుస్తోంది. వచ్చే సీజన్లో ఒక ఇద్దరు ముగ్గురు గట్టి కంటెస్టెంట్స్ వస్తే అదేమీ పెద్ద కష్టమేమీ కాదు. మిగతా భాషల్లో కూడా ఆడవారు టైటిల్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేదు మళ్లీ మగవారే టైటిల్ సాధించాడు అంటే. బిగ్ బాస్ తెలుగు పై భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!