బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇక గోవిందా నే : గ్లాసు లో కమలం ఇమాడలేకపోతుందా?

Janasena : Important Political Decisions
Share

 

 

తిరుపతి ఉప ఎన్నిక జనసేన బీజేపీ పొత్తు మీద పడింది. ఇరు పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు.. బరిలో దిగేందుకు పోటీపడుతున్నారు. పైకి మాత్రం ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని చెబుతున్నా.. ఏ పార్టీకి ఆ పార్టీ నే రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. ఇటీవలే ప్రకటించిన జనసేన బీజేపీ పొత్తు లో అప్పుడే లోకల్ అప్పులు కనిపించడం ఇరు పార్టీల కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి కు పూర్తిగా సహకరించి, పోటీ నుంచి తప్పుకున్న జనసేన కచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలిపేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రచారం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోపక్క బిజెపి నేతలు సైతం తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపి.. హిందుత్వ వాదాన్ని తెరమీదికి తీసుకొచ్చి జాతీయ నాయకులను సైతం రంగంలోకి దింపి గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో పైకి చెప్పుకోవడం లేదు కానీ జనసేన బీజేపీ నాయకుల మధ్య అసలు పోసగని పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో ఉప ఎన్నిక కోసం సన్నద్ధ సభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తిరుపతికి రమ్మని అన్నట్లు తెలిసింది. హుస్సేన్ పార్టీ తిరుపతి ఉప ఎన్నిక సన్నాహక సమావేశం గా భావిస్తున్నారు. మరోపక్క బిజెపి సైతం ఉప ఎన్నిక కోసం ఫిబ్రవరి 4 నుంచి తిరుపతి కపిల తీర్థం నుంచి రథయాత్రను ప్రారంభించి ఉప ఎన్నికల శంఖారావం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇరు పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ… విడిగా వెళ్తారా లేక ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతారు నిలిపితే వారికి వచ్చే ఓట్లు అనేదానిమీద లెక్కలు వేగంగా జరుగుతున్నాయి.

Janasena : Important Political Decisions

అభ్యర్థి విషయంలో..

ఉప ఎన్నిక లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక మీద ఇరు పార్టీలు మీద పూర్తిగా దృష్టి పెట్టాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో మిత్రపక్షాల మధ్య రచ్చ రాజుకుంటోంది. బయటకు ఒకటిగా ఉన్నా లోలోపల కత్తులు నూరుకుంటుంన్నారు. తిరుపతి ఉపఎన్నికలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులు రగిలిపోయేలా మార్చింది. ఇన్నాళ్లూ ఉపఎన్నికలో ఎవరు నిలవాలనే విషయమై ఓ కమిటీ తేలుస్తుందని చెప్పుకుంటూ వచ్చిన జనసేన నేతలు ఇప్పుడు బీజేపీ నేతల తీరుపై ఒంటికాలుతో లేసేలా చేసింది.

ఇదే అసలు కారణం!

రెండు రోజుల క్రితం బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో నిర్వహించిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో కుంటే ఒకవేళ జనసేన పార్టీ తమ మాట వినకుండా కలిసి రాకుంటే మిత్రపక్షాన్ని దూరంగా పెట్టాలని నిర్ణయించారని సమాచారం. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు రగిలిపోతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలు ఇక సఖ్యత కుదరదని, సొంతంగా బరిలోకి దిగడమే మంచిదని యోచిస్తున్నారు. ఈనెల 21న తిరుపతిలో జరిగే జనసేన కీలక సమావేశంలో ఆ విషయా న్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

మరో వైపు బీజేపీ కూడా!

తిరుపతి ఉప ఎన్నికలే లక్ష్యంగా రథయాత్ర  నిర్వహించాలనుకుంటున్న ది. తిరుపతి ఉప ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలు రథయాత్ర చేపట్టాలని కోర్‌ కమిటీలో నిర్ణయించారు. దీనికోసమే తిరుపతిలోని కపిలతీర్థం నుంచి రథయాత్ర ప్రారంభించి రామతీర్థం వరకు చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 4న తిరుపతి కపిలతీర్థం నుంచి ప్రారంభించి ఎనిమిది రోజులపాటు సాగే ఈ యాత్రలో పీఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం ప్రాంతాల్లో సభలను నిర్వహించాలని నిశ్చయించారు. ఈ రథయాత్రలో సెంటిమెంట్‌ను రాజేసి తిరుపతి ఉప ఎన్నికల్లో దాన్ని ఉపయోగించాలానేది బీజేపీ ఆలోచన. ఇప్పటికే పలు ఎన్నికల్లో బిజెపికి పూర్తిగా సహకరించిన జనసేన పార్టీ శ్రేణులు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తమను బీజేపీ అవమానిస్తే భవిష్యత్తులోనూ ఆ పార్టీ కు అంతగా సహకారం అందించేది లేదని తీర్మానం చేసే అవకాశం లేకపోలేదు.

అధినేతకు చెప్పేందుకు!

తిరుపతిలో 21వ తేదీన జనసేన పార్టీ కీలక సమావేశానికి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ సమావేశంలో కచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడితేనే బీజేపీ తో ముందుకు వెళ్లే ఆలోచన చేయాలని అధినేత వద్ద నాయకులు గట్టిగా చెప్పేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ జనసేన సహకరిస్తే ఎప్పటికీ తోక పార్టీగా మిగిలిపోయే అవకాశం ఉందని, దీనివల్ల భవిష్యత్తులో రాజకీయాలు చేయడం కష్టమని… ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే వద్దనేది తిరుపతి నియోజకవర్గ నాయకుల మాట. అందులోనూ బిజెపి కంటే జనసేన పార్టీని తిరుపతి లోక్సభ పరిధిలో బలంగా ఉందని, పవన్ కళ్యాణ్ కనుక ప్రచారానికి వస్తే ఈ గ్రూపు పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బిజెపి పెద్దలు నాయకులు స్థానికులు ఇక్కడ తమ పార్టీ పోటీ చేస్తుందని అప్పుడే ప్రచారానికి దిగారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని సైతం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి… దీని బిజెపి పెద్దలతో మాట్లాడించే ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తు ఆదిలోనే తిరుపతి ఉప ఎన్నికలు పుణ్యమా అని ప్రమాదంలో పడే అవకాశాలు దీనిద్వారా కనిపిస్తున్నాయి. ఇరు పార్టీలు పోటీకి సిద్ధంగా ఉండటంతో అసలు ఎవరు బరిలో దిగుతారు అక్కడ ఎంత ప్రభావం చూపిస్తారు అనేది పెద్ద ప్రశ్న.

 


Share

Related posts

Jamili Elections ; బీజేపీ మాట నెగ్గుతున్నట్టే..! 2022లోనే ఎన్నికలు – జమిలికి మొత్తం ప్లాన్ సిద్ధం..!?

Srinivas Manem

Narendra Modi : మోడీ ఊహించ‌ని కామెంట్స్ చేస్తున్న‌ సీఎం అభ్య‌ర్థి

sridhar

దీపావళి ఆగితే “శివకాశీ”లో ఎన్ని గుండెలు ఆగుతాయో..? ఎన్ని కడుపులు కాలుతాయో..!?

Vissu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar