NewsOrbit
Featured బిగ్ స్టోరీ

అడుగడుగునా ఉల్లంఘనలే…!! రమేష్ ఆస్పత్రిపై చర్యలకు సిద్దం..!!

అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి నివేదిక

ప్రభుత్వ అనుమతులు లేకుండానే కోవిడ్ సెంటర్

పది మంది ప్రాణాలు పోవటానికి కారణమైన రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. అందులో విస్తుపోయే అంశాలను కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తేల్చింది. రమేష్‌ ఆస్పత్రి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తున్న నిబంధనలను పట్టించుకోలేదని కమిటీ పేర్కొంది. కోవిడ్ సోకిన వారికి వైద్య చికిత్ కోసం నిర్దేశించిన ప్రోటోకాల్ ను సైతం ఆస్పత్రి ఉల్లంఘించిందని కమిటీ నిర్ధారించింది. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన రెమ్‌డెసివర్‌ అన్ని కేటగిరీల పేషెంట్లకూ వాడారని గుర్తించింది. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం..కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటంతో రమేష్ ఆస్పత్రిలో ఉల్లంఘనలపైన తేల్చటంతో..ఇప్పుడు ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Govt may take serious action on Ramesh hospital based on committee report
swarna palce tragedy photo

అన్నీ ఉల్లంఘనలే..ప్రమాదం సమయంలోనూ..

స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అనేక కీలక అంశాలను ప్రస్తావించింది. కోవిడ్ కేర్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను ఉల్లంఘించింది. అన్ని విషయాలు తెలిసి కూడా.. ఉద్దేశ పూర్వకంగా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బు సంపాదించాలనే యావతోనే నియమాలను, చట్టాలను పట్టించుకోలేదని పేర్కొంది. ఎలాంటి అనుమతి లేకుండానే రమేశ్‌ ఆస్పత్రి ప్లాస్మా థెరఫీ నిర్వహించిందని తేల్చి చెప్పింది. హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించకుండానే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటులో నిర్లక్ష్యం వహించిందని కమిటీ నిర్ధారించింది. మెట్రోపాలిటిన్‌ హోటళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే కోవిడ్‌ కేర్‌ సెంటర్లను రమేశ్‌ ఆస్పత్రి నిర్వహించిందని కమిటీ తన నివేదిక లో ప్రభుత్వానికి వివరించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కట్టాల్సిన పన్నులు కూడా కట్టలేదు. రూ.33.69లక్షల పన్ను బకాయిలు కట్టని విషయాన్ని ఇప్పుడు కమిటీ నివేదికలో బహిర్గతం అయింది.

Govt may take serious action on Ramesh hospital based on committee report
ramesh hospital file photo

ఆక్యెపెన్సీ సర్టిఫికెట్ సైతం లేకుండానే..

అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు గాని, నిరభ్యంతర పత్రంగాని, అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలుగాని స్వర్ణప్యాలెస్‌లో లేవని అధికారులు నిర్ధారించారు. గత పన్నెండున్నర సంవత్సరాలుగా 19.4 మీటర్ల ఎత్తులో, అత్యంత రద్దీ ప్రదేశంలో ఈ హోటల్‌ కొనసాగుతోంది. ప్రభుత్వ నియమాలను, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్నారు. బిల్డింగుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా లేదని కమిటీ గుర్తించింది. దీని ద్వారా గత ప్రభుత్వ హాయంలో వీరికి ఉన్న అండదండల కారణంగానే ఇలా నిబంధనలు ఉల్లంఘించి హోటల్ ను కొనసాగించినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇప్పుడు నివేదికలో పూర్తిగా రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యమే ఆ పది మంది ప్రాణాలు పోవటానికి కారణంగా తేలటంతో..ప్రభుత్వం దీని పైన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. రమేష్ ఆస్పత్రితో పాటుగా స్వర్ణ ప్యాలెస్ పైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా ఫైర్..మున్సిపల్..పోలీసు శాఖలు ఈ దిశగా ప్రభుత్వానికి చర్యలు సిఫార్సు చేయనున్నాయి. మరో వైపు రమేష్ ఆస్పత్రి ఎండీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju