ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Gudivada: గుడివాడలో గోవా క్యాసినో బ్యాచ్..!? ఏపిలో ఎవ్వరూ ఊహించని మార్పులు..!?

Share

Gudivada: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇటీవల కృష్ణాజిల్లాలోని గుడివాడలో ఏపిలో గతంలో ఎన్నూడూ లేని విధంగా కొత్త సంస్కృతి వచ్చింది. గోవా బ్యాచ్ దిగి క్యాసినో నిర్వహించింది. నిజానికి గోవాలో క్యాసినోలోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్ రూ.2,500లు. ఈ ఎంట్రీ టికెట్ తీసుకుంటే 24 గంటల పాటు కావాల్సినంత తినవచ్చు. తాగవచ్చు. క్యాసినో ఆడవచ్చు. క్యాసినో ఆడేందుకు వేరే టోకెన్లు తీసుకోవాలి. కానీ గుడివాడలో కూడా అంతే కాకపోతే ఇక్కడ ఎంట్రీ పీజు రూ.10వేలు పెట్టారు. బిగ్ బ్యానీ క్యాజినో నిర్వహకుడు ఒక అతన్ని ఇక్కడకు తీసుకువచ్చారనేది ఒక టాక్. ఈ విషయాన్ని పక్కన బెడితే ఇప్పుడు ఏపిలో ఈ కొత్త తరహా ఆటను ఏమైనా పరిచయం చేస్తున్నారా. గుడివాడలో జరిగిన ఈ జూదాన్ని ప్రభుత్వం ఎంత వరకు కంట్రోల్ చేస్తుంది. వాళ్ల మీద కేసులు నమోదు చేస్తుందా లేదా.. ఇది అందరికీ తెలిసే జరిగింది. తెలియకుండా జరగలేదు. ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసులకు తెలుసు. పెద్దలకు తెలుసు అన్న మాటలు వినబడుతున్నాయి. ఈ విషయాలను పక్కన బెడితే..

Gudivada: రాష్ట్రంలో 800 కిలో మీటర్లకు పైగా తీర ప్రాంతం

ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో ఉంది. రాష్ట్రానికి కొత్త ఆదాయ మార్గాలు లేవు. ఆదాయం అనుకున్నంత రావడం లేదు. ఆర్ధిక సంక్షోభంలో ఉంది. ఈ దశలో మన రాష్ట్రం కాస్త ప్రగతి దిశగా వెళితే ఆదాయ మార్గాలు పెంచుకోవాలంటే, అభివృద్ధి చెందాలంటే గోవా తరహా సంస్కృతిని సంక్రాంతి మూడు రోజులే కాకుండా పూర్తి స్థాయిలో తీసుకువస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుందనే వాళ్లు ఉన్నారు. గోవా చాలా చిన్న రాష్ట్రం. కానీ ఆ రాష్ట్రానికి ప్రత్యేకత ఏమిటంటే తీర ప్రాంతం. గేవాలో కేవలం 35 నుండి 40 కిలో మీటర్లు మాత్రమే తీరప్రాంతం ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో 800 కిలో మీటర్లకు పైగా తీర ప్రాంతం ఉంది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 110 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉంటే గుంటూరు జిల్లాలో, కృష్ణాజిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలు. శ్రీకాకుళం, విశాఖపట్నం నుండి నెల్లూరు వరకూ 9 జిల్లాల్లో తీర ప్రాంతం ఉంది. మన రాష్ట్రానికి ఇది పెద్ద ఆస్తి. కొన్ని తీర ప్రాంతాలను, కొన్ని బీచ్ లను అభివృద్ధి పర్చడం., విశాఖలో ఆర్కే బీచ్, ఎండాడ బీచ్ ఉంది. రుషి బీచ్ ఉంది. భీమిలి బీచ్ ఉంది. వీటిలో ఏదో ఒక ప్రాంతంలో గోవా తరహా సంస్కృతిని తీసుకు రావచ్చు.

Gudivada: గోవా తరహా సంస్కృతిని తీసుకువస్తే

అలానే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం, చీరాల, కొత్తపట్నం ఇలా నాలుగైదు బీచ్ లు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో బాపట్ల, కృష్ణాజిల్లాలో హంసలదీవి తదితర ప్రాంతాలు ఉన్నాయి. తీర ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో గోవా తరహా సంస్కృతిని తీసుకువచ్చి పర్యాటకులను ఆకట్టుకునేలా తక్కువ రేటుకు మద్యం ఇచ్చి తక్కువ రేటుకు ఫుడ్ ఇచ్చి క్యాసినో లాంటి గేమ్స్ ను అధికారికంగా నిర్వహిస్తే అటు వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తారు. ప్రభుత్వానికి ఆదయం వస్తుంది. ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అంటున్నారు. గోవా ఆదాయం అంతగా ఆదాయం పెరగడానికి కారణం కేవలం తీర ప్రాంతం. క్యాసినో లాంటి గేమ్స్ సంస్కృతి ఉంది కాబట్టే. అనధికారికంగా చీకట్లో నిర్వహించే ఈ వ్యాపారాన్ని లీగలైజ్ చేస్తే అటు ఆదాయం వస్తుంది. అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.

రుజువు చేస్తే ఆత్మహత్యకు సైతం సిద్ధమే

గోవా తరహా సంస్కృతి ఇక్కడ ఎందుకు తీసుకువస్తాం, ఏపికి అది తీసుకురావడం మంచిది కాదని భావిస్తే గుడివాడలో జరిగిన దానిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. గుడివాడలోని తన కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహణే జరగలేదనీ. ఎక్కడో జరిగిన క్యాసినో గేమ్ ఫోటోలు, వీడియోలతో టీడీపీ అనుకూల మీడియా అసత్య ప్రచారం చేస్తుందని చెప్పుకొచ్చారు మంత్రి కొడాలి నాని. తన కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో ఆడినట్లు టీడీపీ వాళ్లు రుజువు చేస్తే ఆత్మహత్యకు సైతం సిద్ధమేనంటూ సవాల్ విసిరారు కొడాలి నాని. సంక్రాంతికి ముందే తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చినట్లు వివరణ ఇచ్చారు.


Share

Related posts

సీఎం వైఎస్ జగన్ కు “చిరు” ప్రశంసలు..! ఎందుకంటే..?

somaraju sharma

Job notification : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో భారీగా ఖాళీలు..!!

bharani jella

రాజమౌళి ని కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఇంత టెన్షన్ పెడుతుందని ఊహించలేదే .. తేడా జరిగితే అంతే ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar