HBD Sachin: అనితర సాధ్యం అతని రికార్డులు..! అంబర దర్పం అతని ఆట… క్రికెట్ దేవుడు సచిన్

Share

HBD Sachin:  సచిన్ ప్రపంచ క్రికెట్ లోకి అడుగుపెట్టి 24 ఏళ్లు ఆ ఆటని ఆడాడు. అతను రిటైర్ అవ్వక ముందు…. అడుగు పెట్టిన తర్వాత… ఆ కాలంలోనే ఎలాగో తెలియకుండా క్రికెట్ అనే ఆట భారతదేశంలో ఒక మతం గా మారిపోయింది. సచిన్ దేవుడు అయిపోయాడు. ప్రతి పుట్టినరోజుకి అతని రికార్డులు నెమరు వేసుకొని మెదడు కూడా అలిసిపోయింది. మరి అలుపెరగని పోరాట పటిమ చూపిన ఆటగాడికి మనం ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. అది సచిన్ టెండూల్కర్ సంపాదించుకున్న ఖ్యాతి, దానికున్న విలువ.

 

HBD Sachin cricket god sachins birthday today impossible records
HBD Sachin cricket god sachins birthday today impossible records

“సచిన్ ఉంటే మ్యాచ్ గెలిచి చేస్తాం… అతడు అవుట్ అయితే కష్టమే” ఈ మాటలు భారత మ్యాచ్ జరుగుతుంటే ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనిస్తాయి. మాస్టర్ బ్లాస్టర్ అవుట్ అయితే టీవీలు కట్టేసేవారు. అతని బ్యాటింగ్ వస్తే పనులు మానుకొని మరి మ్యాచ్ మొత్తం చూసేవారు. ఫార్మెట్ ఏదైనా సచిన్ కి శాసించడం ఒక్కటే తెలుసు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో 664 మ్యాచ్ లు ఆడిన సచిన్ ఓపెనర్ గా, మూడవ స్థానంలో ఎక్కువ కాలం తన ప్రస్థానాన్ని కొనసాగించి 74 సార్లు నాటౌట్ గా ఉంది జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతేనా… అసలు ఇతను అందరిలాంటి మనిషినా….? అని అనుమానం కలిగే రీతిలో 34, 357 పరుగులు చేసి ఇక ఈ రికార్డుని అందుకోవడం ఎవరి తరం కాదు అని ప్రపంచ క్రికెట్ తోనే చెప్పించాడు. అతని అత్యధిక స్కోరు 248… అదీ టెస్టుల్లో. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు కూడా సచిన్ కావడం విశేషం. మొత్తం 164 అర్థ శతకాలు సాధించిన సచిన్… అక్షరాలా వంద సెంచరీలు బాదాడు.

ఇరవై ఎనిమిది సార్లు 90 లలో అవుటయ్యాడు. 150 కి పైగా పరుగులు 25 సార్లు చేశాడు. కేవలం టెస్టులోనే 200 కు పైగా పరుగులు 6 సార్లు చేశాడు. ఇక తన కెరీర్ మొత్తంలో 76 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సచిన్ 20 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. 4076 సార్లు బంతిని దాటించాడు. రెండు వందల అరవై నాలుగు సార్లు ప్రేక్షకుల మధ్యలో కి సిక్స్ లు బాదాడు.

అంతేకాదండోయ్… బ్యాట్స్మెన్ గానే కాకుండా ఒక బౌలర్ గా కూడా ప్రపంచ క్రికెట్ కు తన ఉనికిని చాటుకున్నాడు. సచిన్ తన కెరీర్లో 201 వికెట్లు తీసుకోగా ఆ క్రమంలో 107 మెయిడెన్ ఓవర్లు విసిరాడు. ఐదు వికెట్ల రెండుసార్లు తీసుకున్నాడు. నాలుగు వికెట్లు 6 సార్లు తీసుకున్నాడు. 256 క్యాచ్ లు కూడా అందుకున్నాడు. ఇతర బ్యాట్స్ మెన్ తో కలిసి వందకు పైగా భాగస్వామ్యాలు 185 సార్లు జోడించాడు. కెప్టెన్ గా కూడా భారత జట్టుకు 27 విజయాలను అందించాడు

మరి వీటన్నింటిలో సగం రికార్డులను ఎవరైనా చేస్తేనే ఈ రోజుల్లో నెంబర్ వన్ అంటున్నాం. మరి సచిన్ ను సూపర్ వన్ అనాలేమో. లేదు… దేవుడు అనేశాక అంతకంటే పెద్ద పదం ఏముంటుంది అంటారా…? సరే అలాగే కానివ్వండి.


Share

Related posts

YS Jagan : సీఎం జగన్ రిస్క్ లో పడినట్టేనా..!?ఈ గేమ్ లో ఎవరు బలైనట్టు..!? “న్యూస్ ఆర్బిట్” స్పెషల్..!!

Srinivas Manem

పాపం.. పవన్ అంత పెద్ద తప్పు చేసారా..?

Special Bureau