Hero Siddharth vs BJP: నేను ఆగేది లేదు – బీజేపీ భరతం పడతా..! మోడీ, అమిత్ షాపై తమిళ హీరో భగ్గు..!!

Hero Siddharth Tweet Against BJP: Viral in Politics
Share

Hero Siddharth vs BJP: తమిళ నాడు ఎన్నికలు ముగిసాయి. అక్కడ బీజేపీ పప్పులు ఉడకపెదు. బీజేపీ మద్దతిచ్చిన అన్నా డీఎంకే గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మరోవైపు బీజేపీపై ఆ రాష్ట్రంలో చిన్న, పెద్ద స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగు హీరోల్లాగా తమిళ హీరోలు సైలెంట్ గా ఉండే టైపు కాదు. ఏమైనా, ఏదైనా వెంటనే స్పందించేస్తారు. కొన్ని నెలల కిందట కమల్ హాసన్.., రోజుల కిందట హీరో విజయ్.. తాజాగా మరో హీరో బీజేపీ తీరుపై మండిపడ్డారు. ఈ సరి అయితే ఈ హీరో ఏకంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలకు సవాల్ కూడా చేస్తున్నారు..!

Hero Siddharth Tweet Against BJP: Viral in Politics
Hero Siddharth vs BJP: Viral in Politics

Hero Siddharth vs BJP: హీరో సిద్ధార్థ్ ట్వీట్ వైరల్..!!

తమిళ హీరో సిద్ధార్థ్ అందరికీ తెలిసిన నటుడే. బాయ్స్.., బొమ్మరిల్లు.., నువ్వొస్తానంటే నేనొద్దంటానా.., వదలడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన వ్యక్తిగత ఫోన్ నంబర్ ని తమిళనాడు బీజేపీ నాయకులు బయటకు లీక్ చేసి.., ఇతనికి ఫోన్లు చేయించి బెదిరించారనేది సిద్ధార్థ్ ఆరోపణ. “నా ఫోన్ నంబర్ ని తమిళనాడు బీజేపీ నాయకులు లీక్ చేశారు. గత 24 గంటల్లో నాకు, నా కుటుంబానికి 500 కి పైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అసభ్యంగా మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ నంబర్లన్నీ తమిళనాడు బీజేపీ నాయకులు, వారి అనుచరులవే అని తెలిసింది. వివరాలన్నీ పోలీసులకు ఇచ్చాను, ఫిర్యాదు చేసాను. విషయం ఇక్కడితో వదలను. అమిత్ షా, మోడీలు ఏం చేస్తారో చేసుకోండి” అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో కూడా బిజేపిపై ఆరోపణలు చేసారు. “నా ఫోన్ నంబర్ ఇచ్చి అతన్ని హీరోస్ చేయండి అని బీజేపీ నాయకులు చెప్పినట్టు తన దగ్గర ఆధారాలున్నట్టు” సిద్ధార్థ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సో… ఏ వ్యవహారం ముదిరినట్టే కనిపిస్తుంది.

Hero Siddharth Tweet Against BJP: Viral in Politics
Hero Siddharth vs BJP: Viral in Politics

ఇంతకూ సిద్ధార్థ్ కీ.. బీజేపీకి గొడవెక్కడంటే..!!

సిద్ధార్థ్ ని బీజేపీ ఇలా విసిగించాల్సిన అవసరం ఏముంది..!? అతను ఏం చేసాడు అనే అనుమానాలు రావచ్చు..! కొన్ని రోజుల కిందట బెంగాల్ ఎన్నికల సందర్భంగా అక్కడ బీజేపీ ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ ఉచిత వాక్సిన్ వేస్తామని ప్రకటించింది. దీనిపై సిద్ధార్థ్ స్పందిస్తూ.. “మీరు అధికారం కోల్పోయిన రోజు దేశం మొత్తం వాక్సిన్ వేసినట్టే.. ఆ రోజు త్వరలోనే వస్తుంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో తమిళ బీజేపీకి బాగా మండి ఇలా చేసి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* కొన్ని రోజుల కిందట “దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా మొన్న ఎన్నికల రోజున తమిళ ప్రముఖ హీరో విజయ్ సైకిల్ పై వచ్చి ఓటు వేసిన సంగతి తెలిసిందే”..!


Share

Related posts

పూజా హెగ్డే కి త్రివిక్రం అంటే అందుకే ప్రత్యేకం.. ఎక్కడున్నా ఒక్క కాల్ తో వాలిపోతుందట ..?

GRK

Neelima Esai Latest Photos

Gallery Desk

బిగ్ బ్రేకింగ్: విచారణకు హాజరు కావాలని జగన్ కి ఈడీ కోర్టు సమాన్లు జారీ..!!

sekhar