Hetero Drugs Scam: హెటేరో కట్టలు కథ.. బీజేపీ ఖాతాలోకి మరో కార్పొరేట్ శక్తి..!?

Hetero Drugs Scam: Another Corporate Surrender to BJP
Share

Hetero Drugs Scam: దేశం మొత్తం ఒక వ్యవస్థ చేతిలో ఉంది. ఆ వ్యవస్థని ఒక పార్టీ శాసిస్తుంది. రాజ్యాంగేతరమా.., రాజ్యాంగం ప్రకారమా అనేది పక్కన పెడితే ఆ పార్టీ పెద్దలు శాసిస్తారు.., కొన్ని వ్యవస్థలు ఆచరిస్తాయి.. దేశంలో కార్పొరేట్ శక్తులకు కొదవ లేదు. ఆ శక్తులన్నీ బీజేపీ గూటి పక్షాలుగానే ఉన్నాయి.. అంబానీ, అదానీ, ధమానీ తరహాలోనే బయటకు కనిపించని కార్పొరేట్ శక్తులు ఫార్మా అధిపతులు. తాజాగా ఐటీ దాడుల ఫలితంగా ఒక పెద్ద కార్పొరేట్ ఫార్మా శక్తి కూడా బీజేపీ చేతిలో బందీగా మారింది.. ఎప్పుడు, ఎలా కావాలంటే అలా వాడుకునేందుకు లొంగిపోయింది..! గత నాలుగు రోజులుగా నడిచిన ఐటీ దాడుల ముగింపు దీని కంటే భిన్నంగా ఉంటుందని ఊహించలేం..!

Hetero Drugs Scam:  గుట్టలుగా.. ఎక్కడిక్కడ..!?

హెటిరో డ్రగ్స్ కు చెందిన ప్లాంట్‌లు, కార్యాలయాలు, అధికారుల ఇళ్లల్లో ఐటీ అధికారులు రెండు మూడు రోజుల పాటు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే సీక్రెట్ డెన్‌ను ఐటీ అధికారులు గుర్తించారు. సాధారణంగా డ్రగ్స్ కంపెనీ అంటే అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఒక చూట ఉంటుంది. మానిఫ్యాక్షర్ యూనిట్ లు రెండు లేదు మూడు చోట్ల ఉంటాయి. అయితే హెటిరో డ్రగ్స్ కు సీక్రెట్ డెన్ లు కూడా కొన్ని ఉన్నాయి. ఇతర కంపెనీలకు ఇదే మాదిరిగా సీక్రెట్ డెన్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇంకా వేరేవి వెలుగులోకి రాలేదు. కానీ హెటిరో డ్రగ్స్ కు సంబంధించి హైదరాబాద్ లోని బోరబండలో సీక్రెట్ డెన్ ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. తొలుత హైదరాబాద్ లోని హెటిరో మెయిన్ ఆఫీసులో ఐటీ అధికారులు రికార్డులు పరిశీలిస్తుంటే వైజాగ్ లోని ఫలానా ప్రదేశంలో కార్యాలయం ఉన్నట్లు తెలిసింది. అక్కడికి కొందరు ఐటీ అధికారులను పంపారు. ఇలా రికార్డులను పరిశీలిస్తుంటే హైదరాబాద్ లోని బోరబండలో ఓ సీక్రెట్ డెన్ ఉన్నట్లు కనుగొని అక్కడకు వెళ్లి సోదా చేస్తే గది నిండా లిక్విడ్ క్యాష్ (పెద్ద ఎత్తున నగదు నిల్వలు) ఉంది. ఈ నగదు మొత్తం సుమారు రూ.140 కోట్లు అని ఒక అంచనా. దాంతో పాటు బ్యాంక్ లాకర్లు, సీక్రెట్ లాకర్లు, మరో సీక్రెట్ ప్రదేశంలో లిక్విడ్ క్యాష్ ఉన్నట్లు బయటకు వచ్చింది.

Hetero Drugs Scam:  Another Corporate Surrender to BJP
Hetero Drugs Scam: Another Corporate Surrender to BJP

ఏపీకి ఏమైనా సంబంధముందా..!?

హెటేరో యజమాని పార్ధసారధి రెడ్డి. దేశంలో టాప్ 5 ధనవంతుల్లో ఒకడు. అతని కార్యాలయాల్లో జరిగిన ఐటీ తనిఖీల్లో లెక్కల్లో లేని రూ.500 కోట్ల నగదు (బ్లాక్ మనీ) ను ఐటి అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ సోదాల అంశం ఇక్కడితో ఆగదు. కేసులు నమోదు, అరెస్టుల వరకూ వెళుతుంది. ఈ పార్ధసారధి రెడ్డికి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రెండవ సారి టీటీడీ బోర్డు మెంబర్ షిప్ ఇచ్చారు. అదే విధంగా స్పుత్నిక్ వి అనే రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ ను భారతదేశంలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి హెటిరో డ్రగ్స్ ముందుకు వచ్చింది. కాకపోతే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. రెమిడిస్‌విర్ ఇంజక్షన్ల తయారీ, అమ్మకాల్లో హెటిరో డ్రగ్స్ అందరికంటే ముందు ఉంది. అంతే కాక హెటిరో యాజమాన్యానికి ఏపి ప్రభుత్వంతో అత్యంత సాన్నిహిత్యం కూడా ఉంది. వాస్తవానికి అనేక ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో ఏపి సర్కార్ కు మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయి. హెటేరో ముందు వరుసలో ఉండగా.., అరబిందో కూడా ఈ జాబితాలో ఉంది. గతంలో జగన్ అవినీతి కేసుల్లో కూడా హెటేరో, అరబిందోలపై ఈడీ కేసులు నమోదు చేసింది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో ఇలా పలు ప్రముఖ ఫార్మా కంపెనీల యాజమాన్యాలు రెడ్డి సామాజిక వర్గీయులు కావడంతో ఏపి సర్కార్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం ఉంది.

Hetero Drugs Scam:  Another Corporate Surrender to BJP
Hetero Drugs Scam: Another Corporate Surrender to BJP

ఇప్పుడు బీజేపీకి దాసోహం..!

ఫార్మా కంపెనీ యాజమాన్యాల వద్దనే ఎక్కువగా నల్లధనం ఉంటుందనేది గతంలో, ఇప్పుడూ జరిగిన ఐటీ సోదాల వల్ల అర్ధం చేసుకోవచ్చు. అందుకే రామోజీ లాంటి వాళ్ళు కూడా పత్రికారంగాన్ని పక్కన పెట్టి దీనిలోకి రావాలనుకుంటున్నారు.. అయితే హెటెరోలో ఇక్కడ ఏపిలో తనిఖీల్లోనే దాదాపు రూ. 500 కోట్ల నల్లధనం లభించడంతో ఇంకా సీక్రెట్ లాకర్లు ఇతర ప్రదేశాల్లోనూ సోదాలు జరగాల్సి ఉంది. అయితే ఈ పెద్ద పెద్ద కంపెనీలకు పొలిటికల్ లాబీయింగ్ ఉండటం వల్ల ఏదో విధంగా బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తారనేది అందరికీ తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలను వీరు కలిస్తే వారు తలదూర్చి దాన్ని సామరస్యపూర్వకంగా లౌక్యంగా అక్కడితో ఆపేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల రాంకీ ఇన్‌ఫ్రా పై జరిగిన ఐటీ దాడులను పేర్కొనవచ్చని అంటున్నారు. వైసీపీ ఎంపి అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థపై ఐటి సోదాలు నిర్వహిస్తే దాదాపు 300 కోట్లు నష్టాలను చూపి ట్యాక్స్ ఎగవేసినట్లు గుర్తించడం జరిగింది. అయితే వాళ్ల నుండి ఇంత వరకు పన్ను కట్టించుకున్నట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఈ కేసుల్లో ఎక్కువగా అరెస్టులు చేస్తారు, ఆ తరువాత వారు బెయిల్ పై వస్తారు కేసులు కోర్టులో నడుస్తూనే ఉంటాయి. సో.. మరో ఒక పెద్ద కార్పొరేట్ శక్తి బీజేపీకి దాసోహమైనట్టు చెప్పుకోవచ్చు..!


Share

Related posts

Daily Horoscope జూన్‌ 28 ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha

బిగ్ బాస్ 4: నామినేషన్స్ మొదలుకాక ముందే ఎలిమినేట్ అయిపోయేది ఎవరో తెలిసిపోయింది!

sowmya

బ్రేకింగ్ : వేతనాలపై ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్

Srinivas Manem