NewsOrbit
బిగ్ స్టోరీ

బందీ అయిన హిందూమతం!

 

గత సంవత్సరం కొలకతా వీధుల్లో రామనవమి ఊరేగింపు

ఎగ్జిట్ పోల్స్ ఊహించిన విధంగా ఎన్నికల ఫలితాలు కనుక ఉంటే ఈవిఎం పరికరాలు రిగ్గింగ్ చేశారు అనే ఆరోపణలు మనం వింటాం.ఎన్నికల ఫలితాలు ఏ విధంగానైనా ఉండనివ్వండి కాని ఒక విషయంలో మాత్రం మనకి ఎటువంటి సందేహం ఉండకూడదు: ఈవిఎం పరికరాల సంగతేమో కానీ హిందువుల ఆలోచన ధోరణిని మాత్రం ప్రభావవంతంగా రిగ్గింగ్ చేశారు.

నరేంద్ర మోదీ తన ఆధ్యాత్మిక ప్రయాణాలని, ‘ఏకాంత సాధనని’ కెమేరాల వెలుగుజిలుగలలో, కొన్ని లక్షల, కోట్ల హిందూవులకి ప్రత్యక్ష ప్రసారం చేసే ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? తన ఈ చవకబారు ప్రవర్తనని నిజమైన మత అనుభవంగా హిందువులు అంగీకరిస్తారు అనే నమ్మకం ఎందుకు ఏర్పడింది?

హిందువుల ఆలోచనా ధోరణి పూర్తిగా వికృతం చెంది, ఆధ్యాత్మికంగా ఒట్టిబోయింది కాబట్టి ఇటువంటి చవకబారు ప్రవర్తన కూడా ఒక మతపరమైన అనుభవయాత్రగానే లెఖ్కలోకి వస్తుందని మోదీకి నమ్మకం.

‘హిందువు ఆలోచనా ధోరణి’ అనే ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువస్తున్నందుకు ఈ రచయిత మీద దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

హిందువు ఆలోచనా ధోరణి అంటూ ఏమి లేదని, హిందూ మతం అంటేనే బాహుళ్యత అని; హిందూ మతం సెమిటిక్ మతాల( ఒకే మూలాలు ఉన్న యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలని సెమిటిక్ మతాలు అంటారు) మాదిరి కాదని; దాని ఉదార విశ్వజనీనత  బహుళత్వంతో కూడుకున్నదని, అందుకే కొత్త కొత్త ఆలోచన ధోరణులని తనలో ఇముడ్చుకోగలదని; ప్రపంచంలో ఉన్న అన్ని మతాలలోకి హిందూ మతమే అత్యంత సృజనాత్మకమైనది, మానవతావాదమైనది అని ఈ రచయితకి చెబుతారు.

ఈ హితభోద నిరాధారమైనది. గత పాతిక సంవత్సరాలలో హిందూ మతంలో చోటుచేసుకున్న మార్పుల గురించి తెలియనటువంటి అవగాహనరాహిత్యం నుండి వచ్చిన హితబోధ ఇది. ఈ పాతిక సంవత్సరాలలో మొరారి బాపు, అసారాం బాపు, బాబా రాందేవ్, సద్గురు జగ్గీ లాంటి బాబాలు పుట్టుకొచ్చారు.

వీళ్ళందరూ నేడు హైందవ ఆధ్యాత్మికతకి నాయకత్వం వహిస్తున్నారు. వీరిని సృష్టించింది హిందువులే. ఇప్పుడు వీరిని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నదీ హిందువులే.

కానీ దీనికంటే ముందు, విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసినప్పుడే తమ కోసం వల పన్నుతున్నారు అని హిందువులు అర్థం చేసుకుని ఉండాల్సింది. విశ్వ హిందూ పరిషత్‌తో అనుబంధం ఉన్నవాళ్ళని సాధువులు అని అంటున్నారు. అలా అనటం ఆ పదాన్ని పూర్తిగా వక్రీకరించటమే.

విశ్వ హిందూ పరిషత్ ఒక రాజకీయ సంస్థ. కానీ అది హిందువులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న మత సంస్థగా చెలామణీ అవుతూ వస్తున్నది.

సాధువులు అంటే సామాజిక, వస్తుగత, సమయ పరిమితులకి అతీతంగా ఉండే భైరాగులు అని అందరి భావన. కానీ ఇక్కడ సాధువులుగా పేర్కొంటున్న వారు గోరక్షణ పేరు మీద పార్లమెంట్‌ని ఘెరావ్ చేస్తున్నారు. వారికి తెలుసు ఇటువంటి పనులు మత కార్యక్రమాలు కాదు, ఇటువంటివి పూర్తిగా రాజకీయ కార్యకలాపాలు అని. అలాగే ముస్లింలకి వ్యతిరేకంగా, బిజెపికి  సహాయకారిగా “ఉద్యమాలు” నిర్మించి, ముందుండి నడిపిస్తూ ఉన్నారు.

విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సఘ్ లాంటి సంస్థలు హిందూ మత కార్యకలాపాలని తమ ఆధీనంలోకి తీసుకోవటానికి హిందువులు అంగీకరించారు. ఒక మత అనుభవానికి అత్యంత అవసరమైన ఏకాంతతని హిందువులు క్రమంగా కోల్పోయారు. నేడు ప్రతిదీ ప్రచారం కోసం ఆర్భాటం కోసమే జరుగుతున్నది.

హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వం ఇస్తున్న రాయితీలని హిందువులు ఎప్పుడూ హర్షించలేదు. కానీ తమ స్వంత తీర్ధయాత్రలు ఏ విధంగా పూర్తిగా వినిమయ వ్యవహారంగా తయారయ్యాయో, అటువంటి ప్రతి సందర్భంలోనూ తాము ఎలా ప్రభుత్వం మద్దతు ఆశించామో, ఈ విషయాల గురించి హిందువులు ఆలోచించటమే మానేశారు. మానసరోవార్ యాత్ర కానివ్వండి, కుంభమేళా కానివ్వండి, బద్రినాథ్/కేదారనాథ్ యాత్ర కానివ్వండి, ఇవన్నీ ఎదో ఒక రకంగా ప్రభుత్వం మద్దతుతో జరిగేవే.

ఇవే కాకుండా, హిందువులు తమ పండుగలు అన్నింటినీ ఒక రాజకీయ పార్టీకి అప్పగించేశారు. దీని ఫలితం వైవిధ్యం కోల్పోవటం, ఒక మూస విధానం తిష్ట వేసుకుని కూర్చోవటం. కన్వర్ యాత్రలో మూడు రంగుల జాతీయ జెండా చూడగానే నాకు మొదట తట్టిన విషయం ఏమిటంటే మూడు లోకాలకు  అధినాయకడైన శివుడిని ఆ స్థానం నుండి తొలగించి పాపం ఒక ప్రాంతం సరిహద్దులకే పరిమితం చేశారు కదా అని.

అదే విధంగా, బెంగాల్ లో జరిగే రామనవమి ఊరేగింపులు మత సంబంధమైనవి కావు. ఆ విషయం హిందువులకి కూడా తెలుసు. ఒక రాజకీయ పార్టీ రాజకీయ దురాక్రమణకి అవి సాధనాలు. కానీ హిందూ మతం పేరు మీద వాటికి ఆమోదముద్ర వేస్తున్నారు. బిహార్ లో కానివ్వండి, ఉత్తర ప్రదేశ్ లో కానివ్వండి, లేదా ఇంకే ప్రాంతంలో అయినా  కానివ్వండి హిందువుల పండుగలు అనేవి ఒక రాజకీయ పార్టీ లాభం కోసం జరుగుతున్నాయి.

ఇన్ని జరుగుతుండగా హిందువుల నుండి వీటి మీద ఎటువంటి వ్యతిరేకత రావడం లేదు.

హిందూ మతం జాతీయీకరణ, ప్రాంతీయీకరణ వల్ల హిందువులు విశ్వదృక్కోణాన్ని కోల్పోయి సంకుచితంగా తయారయ్యారు. గత డెబ్బై సంవత్సరాలలో – గాంధీ చనిపోయిన తరువాత సంవత్సరాలు- హిందూమతంలో అంతర్గతంగా ఎటువంటి చర్చా జరగలేదు. భీం రావ్ అంబేద్కర్ లాంటి  విమర్శకులు లేవనెత్తిన అంశాలను పట్టించుకున్న దాఖలా లేదు. గాంధీ, వినోభా భావే భగవద్గీతని, హిందూమతాన్ని పునర్నిర్వచించే ప్రయత్నం చేశారు. వారి తరువాత ఎటువంటి ఆత్మవిమర్శ జరగలేదు.

తనలో భాగం అని హిందూమతం చెప్పే కొన్ని వర్గాలు – అయితే ఆ వర్గాలకు హిందూమత ప్రస్తానంలో పాత్ర పోషించే అవకాశం ఎప్పుడూ దక్కలేదు –  ప్రశ్నించటం మొదలుపెట్టినప్పుడు హిందూమతం తానే బాధిత వర్గం అన్నట్లు నటించడం మొదలుపెట్టింది. హజారి ప్రసాద్ ద్వివేది చెప్పినట్టు హిందువులకి ఎటువంటి పరిచయం లేని సమానత్వం అనే ఒక విలువని ఇక్కడికి తీసుకువచ్చింది ఇస్లాం మతం. అలాగే సేవాగుణం, పొరుగువారిని వారిని ప్రేమించడం అనే విలువలను క్రైస్తవ మతం ఇక్కడ పరిచయం చేసింది. ఇవి కూడా హిందూమతానికి పరిచయం లేనివి.

ఇటువంటి వాటికి జవాబుగా తనని తానూ సంస్కరించుకునే బదులు హిందూమతం మరింతగా సంకుచితం అయిపొయింది.

హిందూమతంలో ఉన్న వివిధ పరంపరల మధ్య ఎటువంటి తాత్విక చర్చా లేదు. పురాణాల పునః:పరిశీలన లేదు, హిందూమతంలోని వివిధ శాఖల మధ్య ఎటువంటి సృజనాత్మకమైన సంభాషణ లేదు. హిందూమతంలో ఎమన్నా ఉంది అంటే అది కేవలం గత వైభవాన్ని గురించి గొప్పలు చెప్పుకోవడం. హిందూమతం మనకి అందించిన గొప్ప తాత్వికవేత్తలు ఎవరయ్యా అంటే ఓషో, సద్గురు జగ్గీ వంటివారు!

2017 లో కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి ప్రధాన మంత్రి మోదీ వెళ్లినపుడు ఆహ్వానం పలుకుతున్న సద్గురు

ఒక ముక్కలో చెప్పుకోవాలంటే హిందూమతం తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని, ధైర్యాన్ని కోల్పోయింది. అన్నీ వేదాల్లో ఉన్నాయిషా అంటే మనం కేవలం మన పూర్వీకుల ఆత్మల్ని మన భుజాల మీద మోస్తున్న గత వైభవపు కూలీలం మాత్రమే.

మూడు నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచ భ్రాహ్మల సంఘం ప్రతినిధి నుండి నాకు ఫోన్ కాల్స్ రావటం మొదలయ్యింది. వేదాలు నేర్చుకోవటానికి ఎదురవుతున్న అవరోధాల గురించి వారి బాధ అంతా. దీన్ని సరిచెయ్యటానికి వేదాలకు ప్రచారం కల్పించడానికి ఒక పరుగు ఏర్పాటు చేశారు.

వారిని ఈ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారు అని అడిగితే రొమిల్లా థాపర్ అని జవాబిచ్చారు. రొమిల్లా థాపర్ లాంటి మనిషి వేదాలు నేర్చుకుందాం అని అనుకుంటున్నవారికి నేర్చుకోకుండా అడ్డంకులు ఎలా కల్పిస్తున్నారా అని ఆశ్చర్యపోవటం నా వంతు అయ్యింది.

రెండోవది, పరిగెడతం ద్వారా వేదాలు ఎలా నేర్చుకోగలము? పరిగెత్తే బదులు వేదాలని తమదైన శైలిలో అధ్యయనం చేస్తున్న ఒక ఐదు పది మంది పండితులని కూర్చోబెట్టి వేదాలలో తమ అన్వేషణ అనుభవాలను వారితోనే ప్రజలకు చెప్పిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాను.

అలాగే చేస్తాను అన్నవాడు ఆ తరువాత ఇక నన్ను సంప్రదించలేదు.

మేధోసంపత్తి అభివృద్దికి సంబంధించినంతవరకు మధ్య యుగాల నాటి కాలం ఒక చీకటి యుగం అని హజారి ప్రసాద ద్వివేది అంటారు. ఆ కాలంలో మనదంటూ ఎటువంటి ఆలోచన ముందుకి  రాలేదని ఆయన వాపోయారు.  హిందూమతం తన వైభవాన్ని కోల్పోవటానికి కారణం ఇస్లాం మతం అని రామచంద్ర శుక్లా తదితరులు అభిప్రాయపడ్డారు. కానీ ఈ కాలం అత్యంత సృజనాత్మకతకి నెలవైన కాలం. సాహిత్యం, కళలు, నిర్మాణ శాస్త్రం మొదలైనవి దీనికి సాక్ష్యాలు.

ఈనాడు హిందూమతం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. రాజకీయాల నుండి వేరుగా తను తన అస్తిత్వం నిలబెట్టుకుంటుందా? లేదా రాజకీయ కారణాన పూర్తిగా దిగజారిపోయి హిందూమతం అంటే యోగి ఆదిత్యనాథ్, ప్రగ్యా ఠాకూర్, నరేంద్ర మోదీ అనే భావనను భావితరాలకు అందిస్తుందా?

తమ ఆలోచన ధోరణి ఏ విధంగా రిగ్గింగ్‌కి గురి అయ్యిందో తెలుసుకుని దాని నుండి బయటపడటం ఇప్పుడు హిందువుల ముందున్న ముఖ్యమైన పని.

-అపూర్వానంద్

వ్యాసకర్త డిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడు

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment