NewsOrbit
Featured బిగ్ స్టోరీ

గణేశ్ మండపాల ఏర్పాటు… ప్రభుత్వానికి బీజేపీ కౌంటర్

రాజా స్టైలే వేరు

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బాగా దెబ్బతిన్నా… ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించాడు రాజా సింగ్… ఓల్డ్ సిటీలో బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ… అటు పార్టీలోనూ… ఇటు హిందూ సమాజంలోనూ చెరగని ముద్రవేశాడు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతున్న రాజా సింగ్.. తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ నిత్యం వార్తల్లో ఉంటాడు. దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ వేడుకల విషయంలో సర్కారుకు రాజాసింగ్ ఓ డిమాండ్ పెట్టారు. గణేశ్ విగ్రహాలకు సంబంధించి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలను రాజా సింగ్ తప్పుబట్టారు. పండుగకు నాలుగు రోజుల ముందు… ఇళ్లల్లో జరుపుకోవాలంటూ సూచించడమేంటని ప్రశ్నించారు. ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే చెబితే… తగిన విధంగా గణేశ్ తయారీదారులు నిర్ణయం తీసుకునేవారన్నారు.

Hyderabad BJP MLA demand is ..
rajasingh file photo

ముందస్తుగా ఎందుకు చెప్పలేదు

కరోనా వైరస్ మార్చి నుంచే దేశంలో ప్రభావం చూపిస్తున్నప్పుడు ముందుగా ఎందుకు తయారీదారులకు సూచనలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ముందస్తుగా గణేశ్ తాయారీదారులకు సూచనలు చేసి ఉంటే ఇప్పుపడు ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కాదన్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణ చేస్తున్నప్పుడు పండుగ గురించి క్లారిటీ ఇస్తే అది తయారీదారులతోపాటు… పేద ప్రజలకు మేలు జరిగేదన్నారు. ధూల్ పేటలో కార్మికులు ఆరు నెలల ముందు నుంచి గణేశ్ తయారు చేస్తున్నారని… ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణానికి ఇబ్బంది కలగని విధంగా ఒక అడుగు నుంచి పది అడుగుల విగ్రహాలను తయారు చేశారని… ఇప్పుడు అందరూ ఇళ్లలోనే గణేశ్ పండుగ చేసుకోవాలంటే.. ఆ విగ్రహాల అమ్మకం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ధూల్‎పేట్‎లో గణేశ్ తయారీదారులంతా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి విగ్రహాలను తయారు చేశారని… ఇప్పుడు వారి పరిస్థితేంటని ప్రశ్నించారు. వారి జీవితాలను ప్రమాదంలో పడేయవద్దని కోరారు.

Hyderabad BJP MLA demand is ..
DHOOLPET GANESH IDOLS 2020

ప్రభుత్వమే విగ్రహాలు కొనుగోలు చేయాలి

ప్రభుత్వం లక్ష గణేశ్ లు పంచుతామంటూ ప్రకటనలు ఇస్తుందని… ధూల్ పేట తయారీదారుల వద్ద నుంచి విగ్రహాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. ధూల్ పేట తయారీదారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే అందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే తయారీదారుల వద్ద నుంచి గణేశ్ విగ్రహాలు కొనుగోలు చేసి… పంపిణీ చేయాలన్నారు రాజాసింగ్. ప్రభుత్వం ధూల్ పేటలో గుడుంబా నిషేధిస్తే… ఇక్కడ ప్రజలు పూర్తిగా సహకరించి… బతుకుదెరువు కోసం గణేశ్ విగ్రహాల తయారీపై ఆధారపడ్డారన్నారు. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం వారి బతుకుదెరువు లేకుండా చేస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గణేశ్ విగ్రహాల అమ్మకాల ద్వారా ధూల్ పేటలో చాలా మంది ఏడాదిగా జీవనం సాగిస్తారు. అలాంటి వారికి పండుగ ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అశనిపాతమవుతుందన్నారు. కరోనా విషయంలో జాగ్రత్తలుతీసుకోవాల్సిందేనని… ఇప్పుడప్పుడే తగ్గి పరిస్థితి లేదని… బక్రీద్ సమయంలో ప్రభుత్వం ఏవిధంగా సహకరించిందో చూశామని…. ఇప్పుడు ఎందుకు హిందువుల విషయంలో పక్షపాతం ఎందుకుని ఆయన ప్రశ్నించారు.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju