NewsOrbit
Featured బిగ్ స్టోరీ

అంబానీ దేశాన్ని కోనేయ్..! మోడీ గారు మీరు చూస్తూ ఉంటారా..??

మోడీ గారు ట్విట్టర్ లో ఎటువంటి ఫోటోలు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు..? అలా అలోచించి ఫోటో షూట్ కి వెళ్లి గడిపేస్తున్నారు..!
నిర్మలా గారు..! మీడియాకు ఏం మాటలు చెప్పాలా..? ఎవరికీ అందని లచ్చల కోట్ల ప్యాకేజీలు ఎలా రూపొందించాలా అని ఆలోచిస్తారు..!!
దేశంలో ఏం కొనాలా..? సంపాదన ఎలా పెంచుకోవాలా..? అని అంబానీ ఆలోచిస్తారు.
(ఇవీ ఈ ముగ్గురిపై బాగా వినిపిస్తున్న సెటైర్లు- అందుకే ఇవన్నీ ఎందుకు ఏకంగా అంబానీ దేశాన్ని కొనేసి అప్పులన్నీ తీర్చేసి.. ఆర్ధిక రంగాన్ని నెత్తిన పెట్టుకుంటే పోలా..? బాగుటుంది కదా అని కూడా సెటైర్లు వస్తున్నాయి. నిజమే మోడీ గారు, అంబానీ గారూ ఆలోచించండి..!!)

ఇప్పుడు సమస్య ఏమిటంటే..!!

జాతీయ గణాంకాల సంస్థ ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా ఉంది. కరోనా సంక్షోభంతో గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.1996లో భారతదేశం త్రైమాసిక గణాంకాలను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3 శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీగా క్షీణించాయి, ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం పడిపోయింది.

 

 

సింపుల్ లెక్క ప్రకారం..!!

దేశ జీడీపీ ఏడాదికి 203 లక్షల కోట్లు ఉంటుంది. దీనిలో తొలి త్రైమాసికంలో కనీసం 50 లక్షల కోట్లు అన్నమాట. దీనిలో క్షీణత ఎక్కువగా ఉంది. అంటే లావాదేవీలు సరిగా జరగని కారణంగా జీడీపీ కోల్పోయింది. ఈ పతనం ఇప్పటికి చిన్నదే అయినా జులై, ఆగష్టులో కూడా పెద్దగా లావాదేవీలు జరగలేదు. అంటే తొలి త్రైమాసికం ప్రభావం ఇంకా కొనసాగుతుంది. సుమారుగా 5 లక్షల కోట్లు లోటు ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రభావం దేశంపై తీవ్రంగానే పడుతుంది.

ఏ ఏ రంగాలపై ప్రభావం ఎక్కువంటే..!!

* ఆటోమొబైల్ రంగంపై కరోనా ప్రభావం విపరీతంగా పడింది అని ముందు నుండే చెప్పుకుంటున్నదే. దేశీయంగా దాదాపు 30 శాతం అమ్మకాలు పడిపోయాయి.
* మధ్యతరగతి ఎక్కువగా ఆధారపడే తయారీ, హోటళ్లు, వాణిజ్య రంగంపై ప్రభావం ఎక్కువగానే ఉంది. కరోనా ఆరంభం నుండి దాదాపు ఈ మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా 5 వేల పెద్ద స్థాయి హోటళ్లు మొత్తపడ్డాయి.
* వస్త్ర, చెప్పుల ఇండస్ట్రీకి వచ్చిన ముప్పు లేకపోయినప్పటికీ 10 శాతం వరకు అమ్మకాలు మందగించాయి. మార్చి నుండి జులై మధ్యలో బాగా అమ్మకాలు జరుగుతాయని అనుకున్నపిటికీ ఆశించిన మేరకు పది శాతం తక్కువ ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకాల్లో 20 శాతం లోటు ఉంది. ఈ ప్రభావం బాగా పడింది.
* దేశానికి ఆదాయంలో వెన్నెముకగా ఉన్నా పెట్రోలియం అమ్మకాలు తగ్గాయి. కరోనా కారణంగా రాకపోకలు స్తంభించడంతో ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్యలో జరగాల్సిన కంటే 40 % తక్కువ అమ్మకాలు జరిగాయని దేశీయ పెట్రోలియం లెక్కలు చెప్తున్నాయి. ఈ ప్రభావం దేశ ఆర్థికరంగం పై పడుతుంది.

మోడీ ఏం చేస్తున్నారు..? అంబానీ ఏం చేస్తున్నారు..??

మోడీ గారు ట్విట్టర్ ద్వారానో.., సోషల్ మీడియా ద్వారా అమాట్లాడితేనో.., నిర్మలమ్మ మరో 20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తేనో ఈ ఆర్ధిక మందగమనం పట్టాలెక్కదు. అన్నిటికీ కంటే ఆందోళనకమైన విషయం ఏమిటంటే…? గడిచిన నాలుగు నెలలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపించిన నేపథ్యంలో ఒక్కసారి కూడా మోడీ ఆర్ధిక పరిస్థితిపై సమీక్షించింది లేదు. ఆర్ధిక రంగ నిపుణులతో చర్చించిన దాఖలాలు లేవు. దేశం వెనక్కు వెళ్తున్నా మాటలు, భజనలు, చప్పట్లు అంటూ ప్రచార ఆర్భాటాలకు పోయారు. ఇవే మోడీపై తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.

* ఇదే కరోనా సమయంలో అంబానీ విపరీతంగా సంపద పెంచుకున్నారు. ఇటీవల అలీబాబాని ధాటి ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి వెళ్లారు. ఆయన కంటే ముందు అమెజాన్ సీఈఓ, మైక్రో సాఫ్ట్ అధినేత, పేస్ బుక్ అధినేత మాత్రమే ఉన్నారు. ఇటీవల అంబానీ రూ. 24 వేల కోట్లు పైగా వెచ్చించి ఫ్యూచర్ గ్రూప్ ని కూడా కొనుగోలు చేశారు. ఆయన సంపద ఏడాదికి 22 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అంటే సుమారుగా ఏడాదిలోనే ఆయన ఒకటిన్నర లక్షల కోట్లు సంపాదించేస్తున్నారు. దేశ జీడీపీ విలువ ప్రకారం ఆయన సంపదలో కొంత భాగాన్ని వెచ్చిస్తే దేశాన్ని ఏడాది పాటూ ఆయన కొనేయొచ్చన్నమాట. అదీ…! కార్పొరేట్ పెరుగుతుంది, దేశం విలువ తగ్గుతుంది.

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju