NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అమెరికా కుర్చీ ఎవ్వరిదైనా .. ఇండియా నాలిక గీచుకోవడానికి కూడా పనికిరారు !

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. రోజుల తరబడి కౌంటింగ్ తర్వాత డోనాల్డ్ ట్రంప్ ప్రస్థానం అగ్రరాజ్యంలో ముగిసింది. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ గెలిచాడు. ఇక అతని పట్ల భారతీయుల ధోరణి ఎలా ఉంటుందనే విషయంపై పూర్తిగా స్పష్టత రాలేదు గానీ ప్రస్తుతానికైతే ట్రంపు ఓటమిని ఆస్వాదిస్తున్నారు. అదీ కాకుండా భారతీయ సంతతికి చెందిన కమలా హరీస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం కూడా అందరికీ ఆనందంగా ఉంది. అయితే జో బైడెన్ వచ్చినంత మాత్రాన అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారతదేశంలోని పలు వర్గాల ప్రజలకు మాత్రం లాభం చేకూరుతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న….

 

మన వ్యతిరేకి…?

విషయం ఏమిటంటే జో బైడెన్ గెలిచాడు…. అయితే అతను చైనా అభిమాని. వామపక్ష అభిమాని. గతంలో మన దాయాది అయిన పాకిస్థాన్ తన దేశ అత్యున్నత పురస్కారాన్ని అతనికి ఇచ్చి సన్మానించింది. “మనఅనుకుంతున్న కమలా కూడా గతంలో కాశ్మీర్ వంటి విషయాల్లో భారతీయ ధోరణిని ఖండించింది. కాబట్టి వారి ఎన్నిక ఇండియాకి మంచిది కాదు అని ప్రస్తుతానికి అనుకుందాం. ఇప్పటికే మన మీద కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్, ఛైనాలకి ఈ రూపంలో ఒక బలమైన సపోర్ట్ దొరికినట్లేపైగా ట్రంప్ కోసం ప్రచారం చేసిన మోడీ కూడా అమెరికా కొత్త పాలకులకు అంతగా నచ్చడు. ఇదంతా ఒక వైపు వాదన….

అతనేం డిక్టేటర్ కాదు….

మరో పక్క చూస్తే అనవసర భయాలు సందేహాలు అసలు అక్కరలేదు. దానికి బోలెడు కారణాలు ఉన్నాయి. లోతుల్లోకి వెళ్లి విశ్లేషణలు చేయాల్సిన అవసరమే లేదు అని అంటున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం మన ఇంట్రెస్ట్లు దెబ్బతింటాయా లేదా అన్నది కాలమే చెబుతుంది .సరిగ్గా చూస్తే గతంలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకి ఏమైనా నష్టం కలిగించారా…? అధ్యక్షులు మనపట్ల అనవసర శత్రుత్వాన్ని కనబరిచారు అంటే లేదనే చెప్పాలి. అమెరికా అవసరం భారతదేశానికి కొంత కానీ ఇండియా అవసరం అగ్రరాజ్యానికి బాగా ఉంది.

అవసరం సార్..!

మరీ ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానంలో ఒక కూటమి ప్రయోజనాలను కూడా పరిగణనలోకి వస్తాయి. బైడెన్, కమలా అయితే అంతిమ నిర్ణేతలు కాదు. వారు కొన్ని సిస్టమ్స్ దాటి వెళ్ళలేరు. భద్రత, ఆర్థిక విధానాల తెరవెనుక చాలా కసరత్తులు జరుగుతాయి. ఇక వాణిజ్య ప్రయోజనాల విషయానికి వస్తే చైనా…. తను అగ్రదేశం గా మారి ఈ విశ్వం పై ఆధిపత్యం కోసం దేనికైనా తెగించేలా ఉంది. ఈ స్థితిలో భారత్ సహకారం లేకుండా అమెరికా మిత్రదేశాల కూటమి ఏమి చేయలేదుచైనా ని నిలువరించ లేదు. కాబట్టి భారతదేశానికి ఎంతవరకూ సాయపడడమే వారి ప్రధాన లక్ష్యం

కాబట్టి ప్రధాని ఎవడైనా వాడికి చైనా పాకిస్థాన్ లతో ఎంత బంధుత్వాలు ఉన్న కూడా భారతదేశాన్ని కాదని ఎవడు ఏమి చేయలేడు. ప్రపంచ రాజకీయాల్లో ఎవరు ఎవరికి ఏ అంశంలో సహాయం చేస్తారు అనేది చాలా సంక్లిష్టంగా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు బైడెన్ కు భారత వ్యతిరేకి అని ముద్రవేయాల్సిన అవసరం లేదు. మన బలాన్ని నమ్ముకొని ముందుకు పోవడమే….. 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju