NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

“ఇన్ సైడర్ ట్రేడింగ్” లో పరాభవం ఎవరికీ..? ప్రతిష్ట ఎవరికీ..!?

ysrcp and tdp alleging both on insider trading

వైసీపీ YSR Congress Party నాలుగేళ్లుగా ఆరోపిస్తుంది. టీడీపీ Telugu Desam Party నాలుగేళ్లుగా ఖండిస్తోంది. హైకోర్టు Andhra Pradesh Highcourt ఒక్క మాటతో కొట్టేసింది. రహస్య కొనుగోళ్లు అనేవి ఉండవు అని తేల్చి చెప్పేసింది..!! “ఇన్ సైడర్” ట్రేడింగ్ Insider Trading అనేది లేదు, అదేమి లేదు అంటూ ఆ కేసులను కొట్టేసింది. మరి నాలుగేళ్లుగా టీడీపీపై Nara Chandrababu Naidu ఆరోపణలు చేస్తూ.., లక్ష కోట్ల అవినీతి అంటూ నానా యాగీ చేస్తున్న వైసీపీ YS Jagan Mohan Reddy మాట ఏం కావాలి..!? ఈ కేసులో ఎదురైన పరాభవాన్ని సీఎం జగన్ CM YS Jagan భరించాల్సిందేనా..? లేదా ప్రతిష్టకి పోయి సుప్రీం కి Supreem Court వెళ్తారా..!?

కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి వద్దాం..!!

అది 2013 , 2014 సమయం. రాష్ట్ర విభజన జరుగుతుందని ఖాయమైంది. ఏపీలో కొత్త రాజధాని వస్తుందని టాక్ మొదలయింది. వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుంది. ప్రకాశం జిల్లా దొనకొండ కేంద్రంగా రాజధాని ఏర్పాటు ఖాయం అంటూ పుకార్లు, ప్రచారం జరిగింది. దొనకొండలో భూముల ధరలు పెరుగుతాయని ప్రచారం ఊపందుకుంది. దీంతో వైసీపీ నేతలు చాలా మంది అక్కడ భూములు కొనేశారు.
* పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఓ రాజు గారు (వైసీపీ తరపున పోటీ చేసి ఓడారు) దొనకొండలో 45 ఎకరాలు కొనుగోలు చేసారు. నరసాపురం ప్రాంతానికి చెందిన మరో వైసీపీ నేత 33 ఎకరాలు కొన్నారు. జగన్ మీడియాలో పని చేసే ఓ పెద్ద తలకాయ కూడా 25 ఎకరాలు కొనేశారు. ఇలా అనేక మంది దొనకొండలో భూములు కొనేశారు. మరో సీక్రెట్ ఏమిటంటే.., అప్పట్లో వెలుగు వెలిగిన అగ్రి గోల్డ్ అధినేత కూడా భారీగా కొన్నారు (ఈ భూములు ఏమయ్యాయో తర్వాత చెప్పుకుందాం)..! ఒకవేళ 2014 లో వైసీపీ అధికారంలోకి వచ్చి.., దొనకొండనే రాజధానిగా మారిస్తే అప్పుడు భూములు కొన్నవారు “ఇన్ సైడర్” ట్రేడింగ్ చేసినట్టా..? అది పెద్ద కుంభకోణమా..!?

ysrcp and tdp alleging both on insider trading
ysrcp and tdp alleging both on insider trading

* 2019 లో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు నెలల్లో విశాఖపై దృష్టి పడింది. విశాఖ రాజధానిగా మారబోతుంది అని తెలిసింది. దీంతో 2019 అక్టోబర్ నుండి 2020 ఫిబ్రవరి మధ్యలో 27 వేల ఎకరాలు చేతులు మారాయి. భారీగా కొనుగోళ్లు జరిగాయి. వైసీపీ అనుకూలులు, కొందరు నాయకులు, పెట్టుబడి దారులు అక్కడ వాలిపోయారు. భూముల ధరలు కూడా అయిదు రెట్లు పెరిగిపోయాయి..! అంటే విశాఖలో కూడా “ఇన్ సైడర్” ట్రేడింగ్ జరిగినట్టా..? వైసీపీ నేతలు “ఇన్ సైడర్” ట్రేడింగ్ కి పాల్పడుతున్నట్టా..!?

ఇప్పుడు అమరావతి విషయం చూద్దాం..!!

2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఎక్కడ..? రాజధాని ఎక్కడా..? అనే చర్చ చాల జరిగింది. కృష్ణా జిల్లా నూజివీడు అని, ప్రకాశం జిల్లా దొనకొండ అని పుకార్లు వ్యాపించాయి. నూజివీడులో టీడీపీ నేతలు కొందరు భూములు కొన్నారు. ఈ క్రమంలోనే 2014 ఆగష్టు నాటికి విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు అనే ఒక పరోక్ష స్పష్టత వచ్చింది.

YS Jagan: Big Plan to Shift Capital
Amaravathi to visakha via delhi

ఇక వెంటనే టీడీపీ నేతలు, వారి బంధువులు, టీడీపీ అనుకూల మీడియా పెద్దలు, లాయర్లు, డాక్టర్లు… అనేక వర్గాల పెద్దోళ్ళు అక్కడ వాలిపోయారు. మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, కాకాని, వెలగపూడి ఆ చుట్టూ ఎక్కడ భూములు దొరికితే అక్కడే కొనేశారు. దాదాపు 12 వేల ఎకరాలు రాజధాని డిసైడ్ అవ్వకమునుపే విక్రయాలు జరిగాయి. రాజధానిగా నిర్ధారణ జరిగిన తర్వాత మరో 20 వేల ఎకరాలు కొన్నారు. సో… ఇదే “ఇన్ సైడర్” ట్రేడింగ్ అని వైసీపీ అంటుంది. రాజధాని నిర్ధారణ జరగక మునుపే టీడీపీ నేతలు కొన్న 12 వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అని.., పెద్ద అవినీతి అని.., భారీ కుంభకోణం అని ప్రచారం, ఆరోపణలు చేసింది.
* రాజధాని రాబోతుంది అని ముందుగానే తెలిసి భూములు కొంటె అది పెట్టుబడి, రియల్ ఎస్టేట్, భూముల వ్యాపారం అవుతుంది అని జనాలకు, సాధారణ ఆలోచన పరులకు తెలుసు. కానీ అది “ఇన్ సైడర్ ట్రేడింగ్” అనే పదం కిందకు ఎలా వస్తుందో..? పెద్ద కుంభకోణం ఎలా అవుతుందో..? అనేది వైసీపీ వివరించి చెప్పలేకపోయింది. కోర్టుకి ఆధారాలు కూడా చూపలేకపోయింది. అందుకే ఈ ఆరోపణలన్నీ వృథా అయ్యాయి. సింపుల్ గా కోర్టు కేసు కొట్టేసింది. ఆరోపణలు నవ్వులపాలయ్యాయి. మొదటి నుండి “ఇన్ సైడర్ ట్రేడింగ్” నిరూపించు, నిరూపించు అంటున్న టీడీపీ నేతల వాదనలకు బలం చేకూరింది. ఏమో.., జగన్ బృందం దీనిపై సుప్రీం మార్గం ఎంచుకుంటారో..? సైలెంట్ అయిపోతారో చూడాల్సి ఉంది..!!

author avatar
Srinivas Manem

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju