NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Elections : వాళ్ళతో ప్రజలకు లాభం… పెద్ద పార్టీలకు భయం !

Jayalalitha and Karunanidhi Elections

Elections : తమిళనాడులో ఎన్నికలు అంటే అటు డీఎంకే అయినా గెలవాలి లేదా అన్నాడీఎంకే అయినా గెలవాలి. అయితే ఈ రెండు పెద్ద పార్టీలు ఇప్పుడు అనూహ్యంగా వణికిపోతున్న పరిస్థితి తమిళనాడురాష్ట్రంలో కనిపిస్తోంది. అధికార అన్నాడీఎంకే పార్టీ సైతం రాష్ట్రంలో చిన్నాచితకా పార్టీలకు భయపడే పరిస్థితి నెలకొంది. చిన్నచితకా పార్టీలు అంటే కాంగ్రెస్, బిజెపిలు అనుకున్నేరుఅక్కడే మీరు పప్పు లో కాలేసినట్లు..!

 

Jayalalitha and Karunanidhi Elections
Jayalalitha and Karunanidhi

ఎన్ని పార్టీలో….

ఇంతకీ తమిళనాడులో అసలు ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలుసా..? సరిగ్గా చెప్పాలి అంటే ఎవరైనా కొద్దిసేపు ఆలోచించాల్సిందే. డీఎండీకే, ఎండికే, పీఎంకే, ఏఎంఎంకే, ఐజెకే, ఎస్ఎంకే లాంటి పేర్లతో ప్రాంతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి. కొన్ని జిల్లాలకు లేదా రాష్ట్రం లో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ చిన్న పార్టీల వల్ల పెద్ద పార్టీలైన అన్నాడీఎంకే డీఎంకే లు వణికిపోతున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఎక్కడ తమ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తాయి అన్నది వీరి బాధ. ఇవేమీ ఉత్తుత్తి ఊహాగానాలు కాదు. వారి వేసుకుంటున్న కచ్చితమైన లెక్కలు.

Elections : గతం గుర్తుతెచ్చుకుంటేనే….

2016 అసెంబ్లీ ఎన్నికల్లో అయినా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అయినా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ రెండు పెద్ద పార్టీలను విపరీతంగా వణికించాయి. ఎన్నో చోట్ల స్వల్ప మెజారిటీఅంటే ఒక మూడు నాలుగు వేల తో ఈ రెండు పార్టీలు చాలా నియోజకవర్గాల్లో బయటపడ్డాయి. 2019 ఎన్నికల్లో అయితే ఏకంగా అధికార పక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అభ్యర్థులు ఓడిపోవడం లో చిన్న పార్టీల ప్రభావం ఎక్కువ. అందుకే వారికి చాలా చోట్ల అంత పెద్ద మెజారిటీ కూడా రాలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఫలితం తారుమారు అవుతుందని పెద్ద పార్టీలు భయపడుతున్నాయి. పైగా పార్టీలకి పెద్ద దిక్కులు అయిన కరుణానిధి, జయలలిత కూడా లేరాయె. వాళ్ళిద్దరు లేకుండా రాష్ట్రం లో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం విశేషం.

ప్రజలకు భలే అవకాశం…!

ఇక జయలలిత, కరుణానిధి లేకపోవడంతో ఈ ప్రాంతీయ పార్టీలకు మరింత బలం వచ్చినట్లు అయింది. ఈ మధ్య తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రాంతీయ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిస్థాయి మెజార్టీ రావడం కోసం ఇప్పటికే పార్టీలు వరాల జల్లు కురిపించారు. అదీ కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ తమ పీటం కదులుతుందో అన్న భయంతో ప్రాంతీయ పార్టీలను చేరదీయడం…. అలాగే వారి వెనుక ఉన్న ప్రజల బాగోగులు చూసుకోవడం కూడా నిశ్చయం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇలా ప్రాంతీయపార్టీల ఎదుగుదల కూడా ప్రజాస్వామ్యానికి మంచిదే. పెద్ద పార్టీలు కూడా తమ రాజకీయాన్ని అదుపులో ఉంచుకుంటారు. మరి ఇటువంటి పరిస్థితి మరే ఇతర రాష్ట్రానికైనా భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk