NewsOrbit
బిగ్ స్టోరీ

కరోనా టైమ్ లో కేసీఆర్ ఇలాంటి నిర్ణయమా?

ఎవరేమనుకుంటే… నాకేంటి? ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిలాసఫీ. అవును కరోనా తెలంగాణలో లేదు లేదంటూ నెల రోజుల క్రితం చెప్పుకొచ్చిన అక్కడి మంత్రులు.. ఇప్పుడు రోజూ వస్తున్న కేసులతో బేజారైపోతున్నారు.

 

కర్నూల్ వెళ్లొద్దు… గుంటూరు వెళ్లొద్దు కరోనా ప్రమాదం వస్తుందని చెప్పిన ఆ నేతలు ఇప్పుడు తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులతో తలపట్టుకుంటున్నారు. ఇప్పుడెందుకు కరోనా లెక్కలా అనుకుంటున్నారా… కరోనా ఇంతలా రెచ్చిపోతుంటే.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయంగా కాకరేపుతోంది.
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం… తన దృష్టంతా తన ప్లానింగ్ పైనే పెడుతున్నారు. అవును ఇక్కడ చర్చిస్తున్న అంశం తెలంగాణ సచివాలయం గురించే. తెలంగాణ సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికి ఒక కాంతి పుంజం. 13 మంది ముఖ్యమంత్రులు ఇక్కడ పాలన సాగించారు. అంతటి ఘన చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చి ఇప్పుడు కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. 132 ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయాన్ని రాత్రికి రాత్రే నెలకూల్చేస్తోంది.
హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యమన్నట్టుగా చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్ణయం బ్లాక్ డే అంటూ విపక్ష కాంగ్రెస్
నిప్పులు చెరిగితే… కరోనా వ్యవహరాన్ని దారి మళ్లించేందుకే ఈ నిర్ణయమంటూ బీజేపీ నేతలు సౌండ్ చేస్తున్నారు.
మొత్తంగా ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ సారూ మాత్రం తన మాటను నెగ్గించుకోవాలన్న పంతంతో ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా… ఒకరకంగా చెప్పాలంటే ఇండియాలోనే ఒక ఐకానిక్ సింబల్ గా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్లూప్రింట్స్ కూడా తయారైపోయాయ్.
అధికార పగ్గాలు చేపట్టాక సీఎం కేసీఆర్ సచివాలయానికి పెద్దగా వచ్చిందీ లేదు. రివ్యూలు జరిపింది లేదు.
2016 నవంబర్లో చివరిసారిగా కేసీఆర్ వచ్చారు. 2019 జూన్ 27న కొత్త సెక్రటేరియేట్ శంకుస్థాపన సందర్భంగా అడుగు పెట్టారు. ఇక కొత్త సచివాలయంలోనే కేసీఆర్ కాలుపెడతారనుకోవాలి. సచివాలయాన్ని కూల్చేయాలన్న సంగతి సీఎంకు అత్యంత నమ్మకమైన ఓ స్వామిగారు చెప్పారని విపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. వాస్తు లేకుండా ఇష్టానుసారం సచివాలయం కట్టారన్న అభిప్రాయం వచ్చిందని… భవిష్యత్ లో టీఆర్ఎస్ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే కూల్చివేత నిర్ణయమన్న అభిప్రాయం కూడా విన్పిస్తోంది.

ఆయనంతే…ఎవరెన్ననుకున్నా… ఆయన చేయాల్సిందే చేస్తారు. విమర్శలను పట్టించుకోరు. ప్రజల ఆమోదం లేని నాయకులు మట్లాడితే ఎంత… మాట్లాడకుంటే ఎంత అంటారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే నిర్ణయం తీసుకుంటే విమర్శలెందుకన్నది ఆయన చతురత. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ సచివాలయం ఉంటే అది రాష్ట్రానికి, తద్వారా టీఆర్ఎస్ పార్టీకి అఖండ గౌరవాన్ని తీసుకొస్తాయన్న సారు భావన.

author avatar
Special Bureau

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju