IPL Auction : 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కోసం ఆటగాళ్ళ కొనుగోలు ప్రక్రియ గురువారం పూర్తయింది. జీవితంలో జాక్పాట్ తగలడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటి జాక్ పాట్ క్రికెటర్లకు ఒక్కరోజులోనే తగిలి, వారిని కోటీశ్వరులను చేసింది. ఎన్నడూ లేనట్లుగా ఈసారి ఐపీఎల్ వేలం ఉత్కంఠగా సాగింది. ప్రాంఛైజీలు పోటీలు పడి మరీ ఆటగాళ్లను అధిక ధరలకు కొనుగోలు చేయడం అది రికార్డులకు ఎక్కడం విశేషం. గత ఏడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ప్రాంఛైజీలు దృష్టిలో పెట్టుకోలేదు. గత ఏడాది నిరాశపరిచిన ఆటగాళ్లు సైతం ఈ సారి వేలంలో మంచి ధర పలికారు. అలాగే అంతర్జాతీయ అరంగేట్రం చేయని దేశవాళీ క్రికెటర్లను కొనడం విశేషం.

IPL Auction క్రిస్ మోరిస్ జాక్ పాట్ (16.25 కోట్లు )
దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ రికార్డులను తిరగరాశాడు. వేలంలో ఇప్పటివరకు ఏ ఆటగాడు పలకని ధరను అతడు పలికాడు. సీజన్లో కేవలం బెంగళూరు తరపున కొన్ని మ్యాచులు మాత్రమే ఆడిన అతడికి వేలంలో అద్భుతమైన ధర వచ్చింది. మెరుపువేగంతో బంతులు వేసే మోరీస్… అవసరం అయితే బ్యాట్తోనూ మ్యాజిక్ చేయగలడు. గత ఏడాది బెంగళూరు తరపున కొన్ని మ్యాచులు ఆడిన అతడిని ఆ టీమ్ వదిలేసింది. దీంతో వేలంలో కి 75లక్షల కనీస ధర తో వచ్చిన రాజస్థాన్ జట్టు ఏకంగా 16.25 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. క్రిస్ మోరిస్ కోసం ముంబై పంజాబ్ రాజస్థాన్ తీవ్రంగా పోటీ పడగా, రాజస్థాన్ రాయల్స్ చివరకు అతను రికార్డు ధరకు తీసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఆటగాడికి ఇంత ధర దక్కలేదు.
IPL Auction మ్యాక్సీ కోసం బెంగళూరు పట్టు (14.25కోట్లు )
గత సీజన్లో పేలవమైన ప్రదర్శనతో అందరిని నిరుత్సాహపరిచిన గ్లెన్ మాక్స్వెల్ ఈసారి మంచి ధరకు బెంగళూరు తీసుకుంది. గత సీజన్లో పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్సీ కనీసం ఎక్కడ ఒక సిక్సర్ కూడా కొట్టలేక పోయాడు. బ్యాట్స్మెన్ కోటలో పంజాబ్ తీసుకున్నప్పటికీ ఆ జట్టుకు పూర్తి నిరుత్సాహం మిగిల్చాడు. కనీసం ఎక్కడా ప్రభావం చూపకుండానే అత్యంత తక్కువ కోళ్లు చేసి పెవిలియన్ కు వచ్చాడు. దీంతో పంజాబ్ యాజమాన్యం అతన్ని వదిలించుకుంది. ఈసారి మ్యాక్సీ కు చాలా తక్కువ ధర పలుకుతుందని మొదట అందరూ భావించారు. అయితే వేలంలో అనూహ్యంగా చెన్నై బెంగళూరు అతడి కోసం పోటీ పడ్డాయి. చివరికి బెంగళూరు జట్టు 14.25 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. గత సీజన్లో ఏమాత్రం ఆడకపోయినా మంచి ధర పలకడం విశేషం.
జెమి సన్ (15 కోట్లు )
గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ యువ పేస్ బౌలర్ జేమీసన్ కు ఊహించని ధర దక్కింది. అతడి కోసం బెంగళూరు తీవ్రంగా ప్రయత్నించింది. మంచి బౌలింగ్తో చక్కని లైన్ అండ్ లెగ్త్ తో బౌలింగ్ చేసే ఇతడి కోసం ఆర్సిబి 15 కోట్లు వచ్చింది. ఇటు బౌలింగ్తో పాటు అటు బ్యాటింగ్ లోనూ ఇతడు రాణించగలరు అన్న నమ్మకాన్ని బెంగళూరు ధర పెట్టడానికి కారణం.
మెడ్ రీత్ (9 కోట్లు )
గత సీజన్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లో అద్భుత బౌలింగ్తో మంచి ప్రతిభ చూపించిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మెడ్ రీత్ కోసం పంజాబ్ టీం పోటీ పడింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంకా తన బౌలింగ్ రుచిని చూపించని ఇతన్ని కొనడానికి పంజాబ్ ఎంతగానో ఆసక్తి చూపి 9 కోట్లు పెట్టింది.
రిచర్డ్ వాహ్ ( 14కోట్లు )
ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ రిచర్డ్సన్ ఈసారి వేలంలో మంచి ధరకు వెళ్ళాడు. ఈ యువ పేస్ బౌలర్లు పంజాబ్ జట్టు 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. విదేశీయుల కోటాలో మ్యాక్స్వెల్ వదిలేసిన పంజాబ్ ఆ స్థానంలో మరో ఆసీస్ బౌలర్ విచారణకు అవకాశం ఇచ్చింది. ఇతడి కోసం ఢిల్లీ బెంగళూరు ముంబై పోటీపడగా చివరకు పంజాబ్ భారీగా వెచ్చించి కొనుగోలు చేసింది.
కృష్ణప్ప పంటపండింది ( 9.25కోట్లు )
ఈ వేలంలో భీభత్సమైన అదృష్టం లభించింది కర్ణాటక పిన్ ఆల్ రౌండర్ కృష్ణప్ప దే. 2019లో రాజస్థాన్ తరఫున ఆడిన ఈ యువ ఆల్రౌండర్ అప్పట్లో చక్కన ప్రదర్శన చేసినప్పటికీ 2020 లో మాత్రం రాణించలేకపోయాడు. దీంతో రాజస్థాన్ కృష్ణప్పను వదులుకుంది. దీంతో వేలం లోకి వచ్చిన ఇతని చెన్నై జట్టు అనూహ్యమైన ధరకు కొనుగోలు చేసింది. కనీస ధర కేవలం 20 లక్షలు ఐతే చెన్నై ఇతడి కోసం 9.25 కోట్లు పెట్టడం విశేషం.
షారూఖ్ సూపర్ (5.25 కోట్లు )
తమిళనాడుకు చెందిన యువ ఆటగాడు షారుక్ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు. కేవలం 20 లక్షల నామమాత్రపు ధర తోవేల్ అమల్లోకి వచ్చిన షారుక్ ను పంజాబీ యాజమాన్యం దక్కించుకుంది. ఇతడి కోసం 5.25 కోట్లు పెట్టింది. ఇటీవల అండర్-19 ప్రపంచకప్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోపీ లో మెరుపులు మెరిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు షారుక్.
మోయిన్ అలీ పై చెన్నై నమ్మకం ( 7కోట్లు )
గత ఐపీఎల్ సీజన్లో బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లండ్ స్పిన్ ఆల్రౌండర్ మోయిన్ అలీ మీద చెన్నై యాజమాన్యం పూర్తి నమ్మకం ఉంచినట్లు కనిపించింది. గత సీజన్లో అతడు ఎలాంటి పెద్ద రాణింపు చేయక పోయినప్పటికీ అతడిని 7 కోట్లు పెట్టి చెన్నై దక్కించుకుంది.
శివమ్ కు పెరిగిన గిరాకీ (4.4కోట్లు )
గత ఐపీఎల్ సీజన్లో మంచి హిట్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన సేవన్ దూకు ఈసారి వేలంలో మంచి గిరాకీ వచ్చింది. గత ఏడాది బెంగళూరు తరపున కోహ్లీ సారథ్యంలో బెంగళూరు జట్టుకు మంచి విజయాలను శివమ్ దూబే అందించాడు. దీంతో అతని ట్రాక్ రికార్డు రాజస్థాన్ను ఆకర్షించింది. 4.4 కోట్ల కు దూబేను ఆ జట్టు కొనుగోలు చేసింది.
పాత జట్టులోకి షకిబ్ (3.2 కోట్లు )
నిషేధం కారణంగా గత సీజన్ కు దూరమైన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ ఉల్ హాసన్ కు మంచి ధర వచ్చింది. మళ్లీ పాత జట్టు కోల్కతా అతడిని కొనుగోలు చేసింది. 3.2 కోట్లు అందించి ఈ బంగ్లాదేశ్ ఆటగాడిని కోల్కతా కొనుగోలు చేసింది. ఇటు బౌలింగ్ లోనూ అటు బ్యాటింగ్ లోనూ రాణించే సాక్షి బుల్ కోసం మొదటినుంచి కోల్కత్తా కాచుకు కూర్చుంది. చివరకు మంచి ధరను అందించే అతని దక్కించుకుంది.
తెలుగు వాళ్ళు ఉన్నారు
ముగ్గురు తెలుగు క్రికెటర్లు ఈసారి ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న భారత్ను బెంగళూరు టీం 20 లక్షలతో కొనుగోలు చేసింది. అలాగే ఏపీ పేస్బౌలర్ హరీష్ శంకర్ రెడ్డి హైదరాబాద్ స్పిన్నర్ భగత్ వర్మ లను కనీస ధర 20 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. హరీష్ శంకర్ రెడ్డి కడప కాగా, భగత్ దీ విశాఖపట్నం.