NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఒక్క దెబ్బతో ఎన్నో విమర్శలకు చెక్ చెప్పిన జగన్..! సైలెంట్ గా ఉంటూనే వైలెంట్ అయ్యాడు

ప్రత్యర్థులు విమర్శలు సంధించే లోపు వారిని సైలెంట్ చేయడం జగన్ కి ఉన్నా అతి గొప్ప అలవాటు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ అదే రకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతూ అధికారాన్ని చేతిలో ఉంచుకున్న వారు దానిని ఎలా ఉపయోగించుకోవాలో రాబోయే తరాలకు జగన్ పాఠాలు చెబుతున్నట్లు కనిపిస్తోంది.

 

అదానికి స్వాగతం..!

జగన్ అధికారం చేపట్టి సంవత్సరం పైనే అయిపోయింది. అయితే రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకొని రాలేదని…. ఇండస్ట్రీలు లేవని, ఐటీ రంగాల్లో అభివృద్ధి ఎక్కడని…. సంక్షేమ పథకాలకు మినహాయించి ఏ ఒక్క మంచి పని జరగడం లేదని ఎంతోమంది ఎన్నో సార్లు విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు ఇచ్చినప్పటికీ ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే జగన్ ఈ మధ్యనే కొత్తగా ఏపీలో పెట్టుబడులు పెడుతున్న వారి లిస్ట్ ప్రకటించారు. ఇక అందులో భాగంగా దేశీయ మార్కెట్ రంగంలో, నిర్మాణ రంగంలో బాగా స్థిరపడి చక్రం తిప్పుతున్న అదాని గ్రూపుతో అతను చేసుకున్న ఒప్పందం ప్రతిపక్షాల నోర్లు మూయించింది అనే చెప్పాలి.

అన్నీ కేటాయింపులు ఇచ్చేశారు…

పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫారసుల ప్రకారం అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించింది. డేటా సెంటర్ కు, ఐటీ బిజినెస్ పార్క్ నైపుణ్యాభివృద్ధికి, వర్సిటీ నిర్మాణాలకు మధురవాడ లో దాదాపు 130 ఎకరాలను కేటాయించింది. ఇక మూడేళ్ల లోపు కార్యకలాపాలు ప్రారంభించాలని సదరు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. 130 ఎకరాలను కేటాయించారు కదా అని ఎటువంటి జాప్యం లేకుండా ఏడేళ్లలోపు నిర్మాణాలు కచ్చితంగా పూర్తి కావాలని స్పష్టం చేసిన ప్రభుత్వం ఐటి బిజినెస్ పార్కుకి 20 ఏళ్ల పాటు విద్యుత్ ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.

తప్పుడు వార్తలకు చెక్

ఇలా ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తూ ఉంటే ఏపీలో అదాని డేటా సెంటర్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు 70 వేల కోట్ల పెట్టుబడి పెడుతామని గురువారం ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడో ఘనంగా శంకుస్థాపన జరిగిన ఈ ఈ కార్యానికి వైసిపి అధికారం చేపట్టిన వెంటనే అక్కడే ప్రతిపాదనలు అన్నింటిని నిలిపివేసింది అని అదాని డేటా సెంటర్ హైదరాబాద్ కు తరలి వెళ్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. విపక్షాల వాటిని జనాల్లో రుద్దివేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మాత్రం వారికి కావలసిన వసతులను కల్పించి అభివృద్ధిని ముందుకు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju