NewsOrbit
బిగ్ స్టోరీ

జగన్ కే ఎందుకులా జరుగుతోంది – సీక్రెట్ కారణం ఇదేనా ?

జగన్ రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. 2009 ఎన్నికల్లో జగన్ ఎంపీ అవటం ఆలస్యం తండ్రి వైయస్ చనిపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక పొగ పెట్టి బయటకు పంపించడం, వైస్సార్సీపీ పార్టీ స్థాపించాక జైలు పాలవడం ఇలా వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినా కానీ ఎక్కడా కూడా వైయస్ జగన్ తగ్గకుండా తల వంచకుండా వైసీపీ పార్టీని అద్భుతంగా తెలుగు రాజకీయాల్లో ఆవిష్కరించారు.

2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు తో పోరాడి గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ కి మాత్రం ఇంకా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్నవాళ్లు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు… అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పుకోవచ్చు. కానీ జగన్ అధికారంలోకి వచ్చినా ఎదురు దెబ్బలు తగలడంతో జగన్ కే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి నెలకొంటుంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక న్యాయస్థానాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలకు భయంకరంగా మొట్టి కాయలు మీద మొట్టి కాయలు పడుతూనే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, అమరావతి భూముల విషయంలో గాని అలాగే వైసిపి రంగుల విషయంలో గాని జగన్ తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ పరిణామాలతో ప్రజలలో వైసిపి పార్టీ పలచన పడింది. ఇదిలా ఉండగా తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి మళ్లీ ఆయనకే కేటాయించాలని ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఆర్డినెన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో న్యాయస్థానంలో జగన్ సర్కార్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ సర్కార్ కి ఊహించని విధంగా తీర్పు రావటంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ పొలిటికల్ ప్రయాణం ముందు నుంచి గమనిస్తే ప్రతిపక్షాల నుండైనా అదేవిధంగా న్యాయస్థానాల నుండైనా ఎదురు దెబ్బ తగలటం వెనుక సీక్రెట్ కారణం చూస్తే ముందూ వెనకా ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయాలే అని యదార్థవాది లోకవిరోధి అన్నట్టుగా ఉన్నాయి అని మేధావులు అంటున్నారు. ప్రభుత్వ సలహాదారులను నియమించుకునే విషయంలో జగన్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అని అందువల్లే పాలనాపరంగా ముందు నుండి న్యాయస్థానాల్లో నిర్ణయాలు నీరుగారి పోతున్నాయి అనే వాదన వినబడుతోంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju