NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ టీడీపీ ఎమ్మెల్యేను జగన్ పెద్దవాణ్ణి చేస్తున్నారా? : శాసన సభలో వ్యూహంపై చర్చ

నిమ్మల రామానాయుడు…. నిన్న మొన్నటి వరకు ఎవరికీ అంతగా తెలియని పేరు ఇది… తెదేపా నాయకుడిగా 2014 లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టికెట్ పొందారు. అక్కడ ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ మృదుస్వభావి గా, మంచి పేరున్న డాక్టర్ బాబ్జి ను పక్కన పెట్టి మరి చంద్రబాబు రామానాయుడికి టికెట్ ఇచ్చారు. మంచి మెజార్టీ సాధించిన నిమ్మల 2019 జగన్ హవాలోను గెలిచారు… అయినా ఎక్కువమందికి ఆయన గురించి తెలీదు… తెదేపా ప్రభత్వ హాయంలో సైతం ఆయనకు ఎలాంటి పదవి లేదు… అయితే ఇప్పుడు రామానాయుడు ని సీఎం జగన్ మోహన్ రెడ్డి హైప్ ఇస్తున్నారు. ఆయ

నకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అదేంటి రామానాయుడు కూడా వైస్సార్సీపీ వైపు వెళ్లాడా అనుకోకండి అక్కడి ఉంది అసలు కథ…..

రాజకీయాల్లో సన్షేన్ ఉండాలి… ఇప్పుడు వార్తల్లో నిలవాలి… ప్రజల నోళ్ళలో నానాలి… మంచో చెడో మొదట రచ్చకెక్కాలి… ఏది రాకీయాల ప్రాధమిక సూత్రం. ఎప్పుడైతే ఉనికి తెలియకుండా వెళ్తామో రాజకీయ జీవితం మసకబారుతుంది. సినిమాలో హీరో కి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో , విలన్ కి అంతే ప్రాధాన్యం ఉంటుంది. రాజకీయాల్లో సైతం అంతే … రెండు పార్టీల మతాల యుద్ధంలో ఇరు వైపులా ముందుండి నడిపించే వ్యక్తులు ప్రాధాన్యం సంతరించుకుంటారు.. జగన్ ప్రభత్వానికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న టీడీపీలో ఇప్పుడు రామానాయుడు మాటలకూ జగన్ అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం, ఆయన మీద మీడియా ఫోకస్ చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

 

 

రామానాయుడు హైపర్ ఆక్టివ్

** రామానాయుడు ని వైస్సార్సీపీ నేతలంతా శాసన సభలో కామెంట్రీ చేయడం ఎక్కువగా మీడియా లో వస్తుంది. ”డ్రామా నాయుడు” అంటూ వైస్సార్సీపీ నాయకులూ అరుపులు అరుస్తుంటే మీడియాలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ నాలుగు రోజుల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేల అందరిలో నిమ్మల రామానాయుడు హైలైట్ అవుతున్నారు. అంత శాసన సభలో పోరాడుతున్నా నిమ్మల మాత్రం కాస్త చొరవ తీసుకుని ముందుకు వెళ్లడం చేస్తున్నారు. సభలో తొలి రోజు నుంచి ఆయన దూకుడుగా ఉన్నారు. ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు ఏకంగా స్పీకర్ పోడియం ఎదుట కాకుండా, పోడియం పైకి ఎక్కి మరీ నిరసన తెలిపారు.

కావాలనేనా… లేక వ్యూహమా??

** నిమ్మల ఎంత యాక్టీవ్గా ఉన్నా దాన్ని అధికపక్షం అంత పట్టించుకోనవసరం లేదు. అయితే నిమ్మల వ్యవహారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అది మీడియాలో రావడం జరిగింది. దింతో ఆయన మీద టీడీపీ తో పటు వైస్సార్సీపీ కార్యకర్తల ద్రుష్టి పడింది. నాలుగో రోజు సభలో సీఎం ఫుల్ సీరియస్ అయ్యారు. ఓ దశలో జగన్ ఆగ్రహానికి గురైన జగన్ పెన్షన్ల అంశంలో సభను తప్పుదోవ పట్టిస్తున్న రామానాయుడు మీద ప్రివిలేజ్ మోషన్ ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. అలాగే, రామానాయుడుకు సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దని సాక్ష్యాత్తు జగన్ స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. ఒక ఎమ్మెల్యే తీరు మీద సీఎం ఎందుకు సీరియస్ అవుతున్నారో, ఎందుకు ఆయన మీద ప్రధానంగా ద్రుష్టి పెట్టారో, సీఎం జగన్ వ్యూహం ఏమిటో అంతుపట్టక అయోమయంతో చూస్తున్నారు.
** ఒకానొక దశలో సీఎం జగన్ కోపం ప్రదర్శిస్తూ టీడీపీ ఎమ్మెల్యేను రామానాయుడును ఉద్దేశించి ‘మార్షల్స్‌ను పిలిపించి ఎత్తి పడేయండి. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దు.’ అని సభలో చెప్పడం విశేషమని చెప్పాలి. గతంలో ఏదైనా గొడవ జరిగినపుడు సీఎం లికలగజేసుకోవడం ఉంది.. అయితే ఎవర్ని ఉద్దేశించి మాత్రం వ్యాఖ్యనించేవారు కాదు. కానీ ఇప్పుడు సభ నాకుడిగా ఉన్న ముఖ్యమంత్రి ఒక సభ్యుడి మీద ప్రధానంగా ద్రుష్టి పెట్టడం ఇదే మొదటిసారి. జగన్ కావాలనే ఒక వ్యూహం ప్రకారం నిమ్మలకు మైలేజ్ ఇస్తున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది.

author avatar
Special Bureau

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju