NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబుని నిండా ముంచేసే వ్యూహంతో జగన్..! మీకు బాబు ముద్దా…. జగన్ ముద్దా అని అడిగేశాడు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని విప్లవాత్మక పథకాలతో రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతూ పాలన సాగిస్తున్నాడు. ప్రతి పక్షం నుండి విసుర్లు, హైకోర్టు నుండి ఎదురు దెబ్బలను మినహాయిస్తే జగన్ పాలనలో ఈ పథకాల అమలుకు మాత్రం ఎటువంటి జాప్యం చోటు చేసుకోవడం లేదు. ఇక తాజాగా జగన్ ప్రవేశపెట్టిన పథకం లోని కీలక అంశాలు విన్న ప్రజలు ఔరా అనుకుంటున్నారు… వాటి వివరాల్లోకి వెళితే…

 

 

ఇళ్ళ నిర్మాణం ఆగేదే లేదు..!

బుధవారం తన క్యాంపు కార్యాలయం నుండి జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు స్థలాలు పంపిణీ ఏర్పాట్లు, నిర్మాణాలపై కలెక్టర్లు, ఎస్పీలు జేసీల తో స్పందన కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్ళ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించగా అవి కాస్తా హైలైట్గా నిలిచాయి. గ్రామ వాలంటీర్లు వచ్చే సోమవారం నుండి ఈ నెల 30వ తేదీ వరకు లబ్ధిదారుల్లో 300 చదరపు అడుగుల పొందుతున్న వారి దగ్గరకు ప్రభుత్వం తీసుకునివెళ్తారని జగన్ స్పష్టం చేశారు.

ఇది మామూలు వాడకం కాదుగా….

దీనికి కొనసాగింపుగా మీకు జగన్ ముద్దా?? బాబు ముద్దా?? అని అడుగుతారని అలాగే మీకు బాబు స్కీం కావాలా జగన్ కావాలా అని అడుగుతారని తెలిపారు. ఇక బాబు స్కీం లో ఏముంటుంది జగన్ స్కీం లో ఏముంటుంది అన్నది స్పష్టంగా రాస్తామని జగన్ తెలపడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే ఇది చంద్రబాబుని భారీగా దెబ్బ కొట్టే వ్యూహంలా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల పై చేసుకునే ప్రమోషన్ అంతాఇంతాకాదు. తన అనుకూల మీడియా తో బాబు ఒక రేంజ్ లో వాటికి ప్రచారం కల్పించాడు. అయితే జగన్ ఇప్పటివరకు బాబు ఏర్పరుచుకున్న మైలేజీని దెబ్బకొట్టేందుకు రెడీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్న జగన్ ఈ క్రమంలో ఒక పెద్ద విప్లవానికికి తెర తీశాడు అనే చెప్పాలి.

మా స్కీమ్ ఇది..! కావాలా..?

విషయం ఏమిటంటే…. గ్రామ వాలంటీర్ల వివరింపులో… ఈ స్కీం లలో చంద్రబాబు స్కీమ్ లబ్ధిదారుడు మూడు లక్షల రూపాయలు… నెలకు మూడు వేల చొప్పున ఇరవై ఏళ్లపాటు వడ్డీతో సహా మొత్తం ఏడు లక్షల వరకు కట్టవలసి ఉంటుంది అని…. అలా కట్టిన తర్వాత వారికి ఆ ఇంటి పై హక్కులు చేతికి వస్తాయి అని స్పష్టపరిచేలా ఉంటుంది. ఆ డబ్బు కట్టిన తర్వాతే లబ్ధిదారునికి ఆ పట్టా అందుతుంది. కానీ జగన్ స్కీమ్ కి వచ్చేసరికి కేవలం ఒక్క రూపాయి తో వెంటనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేకుండా ఇంటి పై సర్వ హక్కులు లభిస్తాయి…. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా పక్కాగా ఉచితంగా జరుగుతుంది.

ఈ వివరాలు చెప్పి ఎవరికి ఏ స్కీమ్ కావాలో తెలుసుకోవాలని జగన్ వివరించారు. ఇటువంటి ఒక స్కీం అనేది నిజంగా విప్లవాత్మకం అని చెప్పాలి. ఈరోజుల్లో గత ప్రభుత్వం రూపొందించిన పథకం కావాలా ఈ ప్రభుత్వం రూపొందించిన పథకం కావాలి అని అడగడం అనేది జగన్ మార్క్ రాజకీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు…!

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju