ప్రత్యర్థుల అతిపెద్ద ట్రాప్ లో పడ్డ జగన్..! అదీ ఒకరిద్దరి వల్లే….

రాజకీయాల్లో దూకుడు మాత్రమే ఆయుధంగా చేసుకుని సక్సెస్ సాధించిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి జాబితాలో ముందు వరుసలో జగన్మోహన్రెడ్డి ఉంటారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత దూకుడే మంత్రంగా జగన్ ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు.

 

Andhra Pradesh High Court orders CBI probe into YS Jagan Mohan Reddy's  uncle's murder

జగన్ కు అలవాటే…!

మనం చెప్పుకుంటున్న ఈ దూకుడులో కూడా సంయమనం, ఆలోచన ఉంటే ప్రత్యర్థి పక్షానికి పైచేయి సాధించేందుకు అవకాశం ఉండదు. ఈ ఫార్ములాను ప్రతి పార్టీ దాదాపు అనుసరిస్తూనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ ప్రత్యర్థుల ట్రాప్ లో చిక్కుకున్నారు. అయితే ఎప్పుడూ సంయమనం తప్పలేదు కాబట్టి ఆయన ప్రతిసారి గట్టెక్కారు. కానీ ఇప్పుడు అసలువిషయానికి వస్తే వైసిపి కథ వేరే లాగా తయారయ్యేలా ఉంది.

వీళ్ళు తోపులెహే…

వివరాల్లోకి వెళితే వైసీపీలో కొంతమంది నేతలు ప్రత్యర్థుల బాణాలకు చిక్కుకున్నారు. మిగిలిన నేతలు కూడా అధికారం చేతిలో ఉంది కాబట్టి తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి తానేటి వనిత, అంజద్ భాషా, ఆళ్ళ నాని వంటి వారు అపోజీషన్ కి అవకాశం ఇవ్వకుండా తన పని తాను చేసుకుపోతున్నారు ఇకపోతే ధర్మాన, కన్నబాబు, సీనియర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుచరిత వంటివారు ప్రత్యర్థుల చేతిలో పడకుండా కౌంటర్లు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పార్టీకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోగా ప్రత్యర్థులు తిరిగి మట్టికరుస్తున్నారు.

వీరి వల్లే ఈ స్థితి?

అయితే ఒకరిద్దరు మంత్రులు ప్రత్యర్థి పార్టీ ఉచ్చులో చిక్కుకోవడం వైసీపీలో ఆనవాయితీగా వస్తోంది. వీరిలో మంత్రి కొడాలి నాని ముందు వరుసలో ఉంటున్నారు. బొత్స సత్య నారాయణ, నారాయణ స్వామి వంటి వారు తర్వాత వరుస లో ఉంటున్నారు. రాజధాని అమరావతి విషయం నుండి తాజాగా దేవాలయాలపై దాడులు విషయం వరకు నుండి న్యాయస్థానాలు దగ్గర తగిలైన దెబ్బల పై చేసిన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో ఎంతో వివాదాస్పదమయ్యాయి. వైసీపీకి అడుగడుగునా నష్టం చేకూర్చేలానే ఉన్నాయి. అయితే వారు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయకపోయినాఅవతలి వారు రెచ్చగొట్టడంతో ఒక రకంగా సంయమనం కోల్పోయారు.

ఈ రకంగా రాజకీయం కొనసాగిస్తే జగన్ ఎక్కువ కాలం అధికారంలో చేతుల్లో ఉంచుకోవడం కష్టమనే వార్తలు అభిప్రాయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.