NewsOrbit
బిగ్ స్టోరీ

సెల్ఫ్ గోల్ వేసుకున్న నిమ్మగడ్డ… పవర్ మొత్తం జగన్ చేతిలోకి! 

ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం  మరో కొత్త మలుపు తీసుకుంది.

హైకోర్టు తీర్పు యొక్క హైలెట్స్ ను టీవీలు బ్రేకింగ్ న్యూస్ గా వేయగానే నిమ్మగడ్డ లో అత్యుత్సాహం కట్టలు తెంచుకుంది. కోర్టు తీర్పులకు సంబంధించి మామూలుగా టీవీల్లో పూర్తిగా చూపించరు. వారికి కావలసిన బ్రేకింగ్ పాయింట్స్ జనాలను ఆకర్షించేందుకు వేసుకొని అసలైన విషయాన్ని వివరించరు. అంతేకాకుండా అందరికన్నా ముందుగా తామే ఈ న్యూస్ జనాలకు చేరవేయాలని ప్రతి రిపోర్టర్ ఉన్న విషయాన్ని తమకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుని చెప్పేస్తుంటారు.

సరే అసలు ఈ గొడవంతా ఎందుకు అంటే…. అసలు జడ్జి తన తీర్పులో ఏమి చెప్పారు అన్న విషయం కాపీ బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని బ్రేకింగ్ న్యూస్ రూపంలో వచ్చిన వెంటనే నిమ్మగడ్డ హుటాహుటిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి కి ఫోన్ చేసి హైదరాబాద్ లోని తన నివాసానికి వాహనాలను పంపమన్నారు.

ఇంకా అక్కడితో ఆగాడా…? కోర్టు తీర్పు ప్రకారం తానే కమిషనర్ గా వస్తున్నట్లు జిల్లాలో అన్నింటికీ సర్కులర్ పంపమని ఆదేశించి పనిలో పనిగా తాను బాధ్యతలోకి దిగి పోయినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు. అంతేకాకుండా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమని ఆదేశించి…. అతనికి కొద్ది వ్యవధి కూడా ఇచ్చే అవకాశం లేదని హూంకరించాడు. ఇక ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనకరాజు వెంటనే తప్పుకోవాలని హుకుం జారీ చేసిన ఆయన పైన తతంగం అంతా పూర్తి చేసేసరికి సాయంత్రం అయింది. ఈ లోపల సాయంత్రం హైకోర్టు నుండి తీర్పు కాపీ వచ్చింది. అడ్వకేట్ జనరల్ శ్రీరాం దానిని మీడియా వారి ముందు పెట్టిన తర్వాత కానీ నిమ్మగడ్డకు అసలు విషయం బోధపడలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెబుతూ అవసరమైన ఏర్పాట్లు చేయమని కోర్టు చెప్పింది కానీ అందుకు ప్రభుత్వానికి ఎటువంటి గడువు విధించలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయమై హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో మళ్లీ కౌంటర్ పిటీషన్ వేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. కోర్టు వారు ఎటువంటి గడువు ఇవ్వలేదు కాబట్టి మిన్నగడ్డను పదవిలో నియమించేందుకు రెండు నెలల వ్యవధి ప్రభుత్వానికి ఇంకా ఉందని జస్ట్ శ్రీరామ్ వివరించారు.

హై కోర్పు తీర్పుపై తాము సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు చెప్పగానే నిమ్మగడ్డతో పాటు చంద్రబాబు అండ్ కో మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. హై కోర్టులో కేసు ఓడిపోతే సుప్రింకోర్టుకు వెళ్ళటం మామూలే కదా ? అంతెందుకు హైకోర్టులో  నిమ్మగడ్డే ఓడిపోయుంటే సుప్రింకోర్టుకు వెళ్ళేవాడు కాదా ? ఇంత చిన్న లాజిక్ కూడా మిస్సయిన నిమ్మగడ్డ ఇపుడు గోల ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మరో వైపు జగన్ మాత్రం నిమ్మగడ్డ చూపిన అత్యుత్సహంతో ఇప్పుడు పవర్ అంతా తన చేతుల్లో ఉందని గ్రహించి సుప్రీం కోర్టుకు మరింత ఉత్సాహంతో వెళుతున్నాడు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju