ఈ దెబ్బతో ఏపీ మందుబాబులకు పండగే..!  జగన్ సంచలన నిర్ణయం దేశంలోనే ఫస్ట్

మాల్ఈ పేరుని వినే ఉంటారు. మనకు కావాల్సిన వస్తువులు అన్నీ మనమే స్వయంగా వెళ్లి ఎంచుకుని ధర చూసుకుని బుట్టలో వేసుకుని నచ్చిన చోట తిరిగి ఇష్టమైనవి కొనుక్కొని కౌంటర్ల బిల్లు కట్టేసి వెళ్ళిపోయే ఏర్పాటు ఉంటే భారీ వ్యాపార సంస్థలను మాల్స్ గా పిలుస్తాము. ఇప్పటివరకు జీవీకే మాల్, డి మార్ట్, స్పెన్సర్ వంటి మాల్స్ మనకు తెలుసు. ఇవి ఎక్కువగా మహానగరాలు లోనే ఉంటాయి

 

First in the country .. Liquor Malls in AP: From the new policy 1

అదిగో లిక్కర్ మాల్స్

ఇప్పుడు అలాంటి మాల్స్ నే ఏపీ ప్రభుత్వం పాటు చేయనుంది. పెద్దపెద్ద భవనాలను అద్దెకు తీసుకుని అంగరంగ వైభవంగా సుందరీకరించి మాల్స్ వాతావరణం కల్పించబోతోంది. అయితే ఈ మాల్స్ దేనికోసం అంటే మద్యం కోసం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా లిక్కర్ మాల్స్ కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ లో మాల్స్ కు పెద్దపీట వేసింది. వచ్చే నెల రోజుల్లో ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కానీ ఏమీ కాదా..? 

దీంతో మద్యం ప్రియులు ఈ లిక్కర్ మాల్స్ లోపలికి వెళ్లి తమకు నచ్చిన బాటిల్ ను కొనుక్కొని హ్యాపీగా బిల్లు కట్టి వచ్చేయొచ్చు. కావాల్సిన బ్రాండ్ అడగడం…. రేట్లు తెలుసుకోవడం, క్యూ లో నిలబడి ఒకరిని ఒకరు తోసుకోవడం వంటివి ఉండవు. ఈ పాలసీ వచ్చే నెల 1 నుండి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ షాపులు ఏర్పాటు ద్వారా ప్రస్తుతం ఉన్న లిక్కర్ షాపులు పెరగవు అని ప్రభుత్వం స్పష్టం చేయడం విశేషం.

మద్యం నియంత్రణ ఎప్పుడు?

ఎన్నికల సమయంలో మద్యం నియంత్రణ విషయంలో ఇచ్చిన హామీ ప్రకారం గత ఏడాది 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించిన ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం కేవలం 13 శాతానికి పరిమితం అయినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఓపెన్ చేసిన మద్యం వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయంలో లో ఈ సంవత్సరం మందు షాపులు సంఖ్య 13 శాతానికి తగ్గించారు. వాస్తవానికి ప్రతియేడు ఇరవై శాతం తగ్గించి ఐదేళ్లలో పూర్తి చేస్తామని జగన్ ప్రకటించారు.

ఇక అలా కాకుండా ఇప్పుడు ఈ కొత్త లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరుతుందని అందరూ భావిస్తున్నారు.