NewsOrbit
Featured బిగ్ స్టోరీ

వైసీపీ “కాపు”రంలో జనసేన చిచ్చు..! ఏపీలో కుల నిప్పు..! (న్యూస్ ఆర్బిట్ సంచలన కథనం)

ఈస్ట్, వెస్ట్ కాపుల మధ్య కుట్ర…
కాపు సంక్షేమ సేన వెనుక సేనాని ఎవరు?
మొత్తం వ్యవహారంలో ఆడిటర్ ఏవీ రత్నం రోలేంటి?
జోగయ్య సేన వెనుక దాసరి రాము…
మొత్తం యవ్వారంలో చంద్రబాబు పాత్రేంటి?

జూబ్లీహిల్స్ వేదికగా కాపు చీలిక కుట్ర

వామ్మో వీళ్లు మామూలోల్లు కాదండోయ్… రాజకీయం ఒళ్లంతా పాకేసింది. రాజకీయాలే జీవితమన్నట్టుగా వారు సాగిస్తున్న రణరంగంలో ఎన్నో ట్విస్టులు. మరెన్నో లెక్కలు. వారు చెప్పినట్టు వింటే ఒకే… లేదంటే బట్టలుప్పదీసేసుందుకు తన మన… వావి వరసలు అసలే చూడరు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ తీసుకునే నిర్ణయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేంద్రంగా సాగుతోందని సమాచారం. అది కూడా పొలిటికల్ కమ్ సినీ స్టార్ ఆశీస్సులతోనేన్న గుసగుసలు విన్పిస్తున్నాయ్. రాజకీయాలంటే… చీలికలేంటనేగా మీరు అనుకుంటున్నది అవునండీ… ఇప్పుడు ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశం విషయంలో పోరాటం ఎవరు చేస్తారు… అందుకు సారథ్యం ఎవరు వహిస్తారన్నదానిపై తెరపైకి కొత్త ప్రణాళికలు ఒకటి తర్వాత ఒకటి విడుదలైపోతున్నాయ్. కాపుల రిజర్వేషన్ల పోరాటం చేసేందుకు మేమంటే మేమున్నామంటూ రెండు వర్గాల మధ్య పోరాటం మొదలయ్యింది. త్వరలోనే అది బహిరంగ యుద్ధంగా కూడా మారే అవకాశం కూడా లేకపోలేదు.

mudrada, jogaiah photos
mudrada jogaiah photos

 

ముద్రగడకు జగన్‎పై సాఫ్ట్ కార్నరా?

వాస్తవానికి కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన పిలిస్తే కుటుంబాలు… కుటుంబాలు ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేవి. కనీసం కుటుంబం నుంచి ఒకరైనా ఉద్యమంలో పాల్గొనేవారు. అయితే ఆయన కొన్నాళ్ల నుంచి మౌనముద్ర వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ముద్రగడకు సాఫ్ట్ కార్నర్ ఉందన్న అభిప్రాయం ఉంది. వాస్తవానికి ముద్రగడ కాపు ఉద్యమం నుంచి తప్పుకోడానికి జగన్‎పై ఉన్న మెతకవైఖరా లేదంటే… పవన్ కల్యాణ్ కోటరీలోని ఆడిటర్ ఏవీ రత్నం వద్ద సహచరుడిగా ఉన్న దాసరి రాము చేసిన వ్యాఖ్యలే అన్న అనుమానాలు కాపు సమాజంలో ఉన్నాయ్. ఇటీవల టీడీపీకి అనుకూలంగా ఉన్న చానళ్లలో దాసరి రాము… ముద్రగడ పద్మనాభం ధోరణిపై తీవ్ర విమర్శలు చేయడం కారణంగా…  ఆయన కలత చెందాడని కాపు ఉద్యమ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా చంద్రబాబునాయుడు కనుసన్నల్లో జరుగుతోందని… మొత్తంగా కాపు జాతిని చీల్చాలన్న కుట్రలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భాగమయ్యారంటూ వారు విమర్శిస్తున్నారు.

 

mudragada, pawankalyan, chandrababu
mudragada pawankalyan chandrababu

చేగోండినే ఎందుకు రంగంలోకి దించారు…

అదే సమయంలో కాపు ఉద్యమం కోసం ముద్రగడ పట్టువీడి… మలి దశ ఉద్యమ పంథా నిర్దేశించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా ఆయన మాత్రం ససేమిరా అన్నారు. ఇలాంటి తరుణంలో ఆడిటర్ రత్నం తెరపైకి దాసరి రామును తీసుకొచ్చి… హరిరామజోగయ్యతో చర్చలు జరిపించారని… ముద్రగడను దెబ్బకొట్టేందుకు జోగ్యయే సరైన ఆయుధమన్న నిర్ణయానికి వచ్చారన్న అభిప్రాయం కూడా కాపు ఉద్యమ నేతల్లో ఉంది. అంటే తెరపైకి ఇక కాపు ఉద్యమం, కాపు పోరాటాలు ఏం చేసినా… వాటిలో ముద్రగడ కన్పించకూడదు… కేవలం జోగయ్య పేరు మాత్రమే విన్పించాలి. అవసరమైతే జనసేన మద్దతుతోనే తాను ఉద్యమబాట పట్టానన్నట్టుగా కూడా చెప్పించాలి. ఇది పెద్దల ఆలోచన. వాస్తవానికి జోగయ్య ముఖ్యమంత్రి పదవి తప్ప అన్నీ పదవులను నిర్వహించారు. ఏ బాధ్యతనైనా త్రికరణ శుద్ధిగా చేశారు. మాటాకారిగా పేరు సంపాదించారు. అంతేకాదు… మెగాస్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు తీసి సక్సెస్ ఫుల్ నిర్మాతగా నిలిచారు. ఎన్టీఆర్‎కి హరిరామజోగయ్య అత్యంత సన్నిహతంగా., విశ్వాస పాత్రుడిగా మెలిగారు. తాజాగా రాజకీయ కురువృద్ధుడు, సీనియర్ నాయకులు, 83 ఏళ్ల చేగొండి హరిరామజోగయ్య వెటరన్ పొలిటీషన్‎ను తెరపైకి తీసుకొచ్చిందో బ్యాచ్.

నాడు చిరంజీవి… ఇప్పుడు జోగయ్య
రెండు జిల్లాల్లోని కాపు జాతి నాయకులు… బయట జిల్లాల నుంచి వచ్చే కాపు నేతలను అంగీకరించరు. ఎందుకంటే అది తమ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని వారి భయం. అందుకే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా స్పందన పూర్తి స్థాయిలో లేదు. అయినప్పటికీ… చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా మెగల్తూరుకు చెందినవారు కావడంతో ఆయన నాయకత్వాన్ని కాపులు అంగీకరించారు. అందుకే 17 శాతం ఓటు బ్యాంక్ ను ప్రజారాజ్యం పార్టీ దక్కించుకోగలిగింది. రెండు జిల్లాల్లోని కాపు ఓటు బ్యాంకులో మెజార్టీ వాటా ప్రజారాజ్యం పార్టీ రాబట్టుకోగలిగింది. ఇంత జరిగినా… పాలకొల్లులో ఒక వైశ్య సామాజికవర్గానికి చెందిన మహిళ చేతిలో చిరంజీవి ఓడిపోవడాన్ని కాపులు ఎన్నటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సో నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి నాయకత్వం వహించినట్టుగా ఇప్పుడు చేగొండి హరిరామజోగయ్యతో ఉద్యమానికి నేతృత్వం వహించాలన్న ఉద్దేశం జనసేన సిద్ధాంతకర్తల్లో కన్పిస్తోంది. ఇందుకు రెండు జిల్లాల కాపు సమాజం ముక్కలవ్వాలన్నది వారి ఉద్దేశమని కూడా ప్రచారం జరుగుతోంది.

chiranjeevi, jogaiah
chiranjeevi jogaiah

కాపు సంక్షేమ సేన డిమాండ్లు

కాపు రిజర్వేషన్ కోసం కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేస్తానని… అందుకు నాయకత్వం వహిస్తానని జోగయ్య చెప్పారు. విద్య, ఉద్యోగాలలో కాపు జాతికి రిజర్వేషన్‌ సౌకర్యం కోసం ఉద్యమం చేపట్టేందుకు కాపు సంక్షేమ సేనను స్థాపిస్తున్నామన్నారు. బీసీలకు నష్టం కలగకుండా… కాపులను బీసీలుగా ప్రకటించడం లేదంటే… కేంద్రం ప్రకటించిన 10 శాతం ఈబీసీ కోటాలో జనాభా పద్ధతిని రిజర్వేషన్‌ కల్పించాలంటూ కొన్ని డిమాండ్లను జోగయ్య ముందుకు తీసుకొచ్చారు. అయితే కాపు సంక్షేమ సేన ఏ పార్టీకి చెందినది కాదని, కులం కోసం పెట్టందని చెప్పారు. మొత్తంగా కాపులకు చిన్న చిన్న తాయిలాలిచ్చి వదలించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని… జనాభా ప్రాతిపదికన కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాటబాట పడతామన్నారు.

 

chegondi hari rama jogaih
chegondi hari rama jogaih

కాపులను రెండుగా చీల్చే కుట్ర

ఈ కొత్త కాపు సంక్షేమ సేన వెనుక కాపు సమాజాన్ని విడగొట్టడమేనన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కాపు నాయకులు, కాపు యువత వైసీపీ వైపు ఆకర్షితులై ఉన్నారన్న అభిప్రాయం విన్పిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ పార్టీకి సానుకూలంగా కాపు యువత వ్యవహరించారన్న అభిప్రాయానికి వచ్చిన జనసేన కోర్ టీం ఇప్పుడు జిల్లాల వారీగా కాపులను విడగొట్టి… తమవైపు కొందరినైనా తిప్పుకోవాలన్న వ్యూహం మేరకే కాపు సంక్షేమ సేన ఏర్పాటు జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి కాపులు ప్రబలంగా ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నాయకత్వం ఎప్పుడూ తూర్పుగోదావరి జిల్లాలకే లభిస్తుంది. అయినా రెండు జిల్లాల కాపు సమాజం ఎప్పుడూ వాటిని పెద్దగా పట్టించుకోదు. రెండు జిల్లాలు ఒకటేనన్న భావన వారిలో కన్పిస్తుంది.

jogaiah, pawan kalyan, chandra babu, mudragada
jogaiah pawan kalyan chandra babu mudragada

కాపు సంక్షేమ సేన కేరాఫ్ జన సేన

ముద్రగడ పద్మనాభంపై పూర్తి స్థాయిలో బరుదజల్లిన జనసేన కోటరీ… జోగయ్య ప్రకటన వెనుక ఉందన్న విషయం అంత తేలిగ్గా బయటకు వచ్చేది కాదు. అయితే తప్పు చేసేవాడు ఎక్కడో ఏదో తప్పు చేస్తాడన్న చందంగా ఇది కూడా బయటకు వచ్చేసింది. అప్పటి వరకు చర్చలు జరిపిన వారి పేర్లను జోగ్యయ మీడియా సాక్షిగా ప్రకటించడంతో సేనకు ఫీజులు ఎగిరిపోయాయ్. వాస్తవానికి ఆడిటర్ రత్నం గానీ, దాసరి రాము గానీ… తమకు అప్పగించిన పనని సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే కుట్ర బహిర్గతమైందన్న అభిప్రాయం ఉంది. వాస్తవానికి ‘కాపు సంక్షేమ సేన’ అన్న పేరు కేవలం జనసేనలో భాగంగా మాత్రమేనంటూ విమర్శలు వస్తున్నాయ్. గతంలో ప్రజారాజ్యం పార్టీకి యువరాజ్యం, మహిళా రాజ్యం ఎలా విభాగాలున్నాయో ఇప్పుడు జనసేనకు, కాపు సేన తెరవెనుక ఉందన్న స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. అర్థం చేసుకోలేని వారికి, తెలియని వారికి మాత్రమే తెలియదు కానీ… అసలు స్కెచ్ ఎవరిది… ఎవరు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

author avatar
DEVELOPING STORY

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju