NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

భజన కాదు బుర్ర పెట్టు : తిరుపతి లో జనసేన బలమెంత??

 

 

ప్రతిదానికి ఆవేశంతో ఊగిపోయి… చిన్న దానికి పెద్ద దానికి సోషల్ మీడియా లైవ్ పెట్టి తమ ఆగ్రహాన్ని పదిమందికి పంచేసుకుంటే… చిన్న విషయానికి పెద్ద విషయానికి ఎక్కువగా స్పందించి… రాజకీయ శత్రువులు కవ్వించే కవ్వింపులకు లొంగిపోయినంతకాలం జనసేన పార్టీ కార్యకర్తలకు నిలకడ… పార్టీ మనుగడ సీరియస్ గాడిన పడవు… ఈ మాట చాలా మందికి రుచించకపోవచ్చు… జనసైనికులు దీన్ని చదివితే విరుచుకుపడ్డ వచ్చు. కానీ ఇది సత్యం ఇది నిజం.


తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తు లో భాగంగా తిరుపతిలో జనసేన అభ్యర్థి నే రంగంలోకి దింపాలని జనసైనికులు గట్టిగా కోరుతున్నారు. ఇదేమీ తప్పుకాదు… యాక్టివ్ పాలిటిక్స్ లో పార్టీ ఉండాలని వారి కోరిక. అందులోనూ బీజేపీతో పొత్తు లో ఎప్పటికి గ్రేటర్ మున్సిపల్ ఎలక్షన్లలో పక్కకు తప్పుకున్న జనసేన పార్టీ ఇప్పుడు తిరుపతిని బిజెపికి వదిలితే అది సరికాదని, జన సైనిక వాదన. దీనిపై వాదిస్తే సరిపోదు… లైవ్ పెట్టేస్తే అయిపోదు… రాజకీయం అంటే ఎన్నికలు అంటే దానికి ప్రణాళిక, కొన్ని పద్ధతులు ఉంటాయి అనేది జనసైనికులు తెలుసుకోవాలి. ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే చిన్న విషయం కాదని, దానికి ఓ పక్క ప్రణాళిక రాజకీయానికి ఎంతో అవసరం అనేది ఆవేశపరులు గా కనిపిస్తున్న జనసైనికులు అందరూ గుర్తించాలి. అసలు తిరుపతిలో జనసేన బలం ఎంత?? ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు రాబట్టగలదు?? తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అసలు పార్టీకి క్యాడర్ ఉందా?? అసలు జనసేన తరఫున పోటీకి దిగే అభ్యర్థి ఎవరు?? అభ్యర్థి కనక ఉంటే అతని ఆర్థిక బలం ఎంత?? వెంట వచ్చే కార్యకర్తల ఎంతమంది?? లోక్ సభ సీట్లు గెలుచుకోవడం చిన్న విషయమా?? అందులోనూ ఉప ఎన్నికల వేళ… కరోనా తో మృతి చెందిన ఎంపీ కు ఉండే సానుభూతి ని ఎలా అధిగమిస్తారు?? అనే కోటి ప్రశ్నలు ఉన్నాయి. కేవలం జనసేన పోటీ చేసి బీజేపీ మద్దతు ఇస్తే అక్కడ అభ్యర్థి గెలిచేస్తారు అనుకోవడం మూర్ఖత్వం.
** తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి ఉన్న ప్లస్ లు జనసేన కు ఉన్న మైనస్ ఒకసారి పరిశీలిస్తే…
** కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అభ్యర్థి ఎక్కడ నిలబడితే అతడు డైరెక్ట్గా కేంద్రంతో మాట్లాడుకుని నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేస్తాడని చెప్పడానికి వీలు ఉంటుంది. అలాగే జాతీయ నాయకత్వం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
** బిజెపి సోషల్ మీడియా విభాగం దేశ స్థాయిలో పనిచేస్తోంది. దుబ్బాక దగ్గర నుంచి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల వరకు బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ఎన్నికలను హైప్ చేసి, తనకు అనుకూలంగా ఫలితాలు మలచ గలదు.


** బిజెపి తరఫున పోటీ చేసే వ్యక్తికి కేంద్ర నాయకత్వం ఆర్థిక వనరులు సమకూర్చ గలదు. అలాగే బిజెపి తరఫున మాజీ ఐఏఎస్ అధికారి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
** ఏడు నియోజకవర్గాల్లో ను బిజెపి క్యాడర్ ఉంది. వీరిని తగినంతగా ఉత్సాహ పరచడానికి కేంద్ర నాయకత్వం సిద్ధంగా ఉంది. తగిన వనరులు సమకూర్చేందుకు ఆంధ్రాలో ఎలాగైనా పాగా వేసేందుకు ఇది అనువైన మార్గంగా బిజెపి కేంద్ర నాయకత్వం భావిస్తోంది.
** తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కనుక ఉంటే జాతీయ నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇటు స్టార్ మేనియా.. అటు రాజకీయ మానియా కలుస్తుంది. అలాగే తిరుపతి బాలాజీ సన్నిధిలో లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడం బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది.
** సామాజిక వర్గాల వారీగా తిరుపతి లోక్సభ ఎన్నికలను చూస్తే ఎస్సీ వర్గానికి చెందిన ఓటర్లు అధికం. దాని తర్వాత కాపులు ఉంటారు. కాపులను పవన్కళ్యాణ్ ప్రభావితం చేయగలిగితే మిగతా రాజకీయ చక్రం బిజెపి తిప్పగలదు.

పవన్ ఒక్కడే??

తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కనుక నిలబడితే పవన్ ఒక్కడే, అతడి గ్లామర్ చరిత్ర ఆధారంగా ఓట్లు రాబట్టాల్సి ఉంటుంది. మరో మార్గం లేదు.
** తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు అంతంత మాత్రంగానే ఉన్నారు. పూర్తిగా లోక్ సభ నియోజకవర్గం పై ప్రభావం చూపే నాయకులే లేరు. ఉన్న వారు ఆర్థికంగా అంత బలమైన వారు కారు. అందులోనూ ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి అంత సాహసం చేసే పరిస్థితి లేదు.
** ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ జనసేన పార్టీకి నిర్మాణపరంగా పటిష్టమైన యంత్రాంగం లేదు. అక్కడక్కడా కొంతమంది కుర్రకారు పార్టీ జెండాలు మోసే ఎందుకు ముందుకు వచ్చినా, పవన్ కళ్యాణ్ ను చూసి మళ్ళీ వారు కూడా వెనక్కి వెళ్ళి పోయే అవకాశమే ఉంది.
** ఎన్నికల పోలింగ్ రోజు బూత్ లో కూర్చునేందుకు జనసేన పార్టీకి తగినంత కేడర్ గానీ తగినంత కార్యకర్తలు గానీ లేరు. మరి అలాంటప్పుడు ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా చేయగలదు??
పవన్ ను నమ్ముకుని అతనే ఊపిరిగా, దేవుడిగా భావించే జనసైనికులు అమితామైన ఉత్సాహం ఊపులో ఉన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కోణంలో తిరుపతి ఉప ఎన్నికలు, బావోద్వేగ కోణంలో పార్టీ అని ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కోపం కనిపిస్తుందే తప్ప రాజకీయ చదరంగం లో ఎప్పుడు ఎలా పావులు కదపాలి ఒక అడుగు వెనక్కి వేస్తే తప్పు లేదు అనేది వారు గుర్తించాలి… గుర్తెరగాలి… అప్పుడే ఆ పార్టీ సీరియస్ రాజకీయాల వైపు దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది.

author avatar
Special Bureau

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju