NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

Jangareddygudem Deaths: సారా కాటు.. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ – విషాద గాధ..! బాధితులు ఏమన్నారంటే..!?

Jangareddygudem Deaths: Fact Ground Report by Victims

Jangareddygudem Deaths: పశ్చిమ గోదావారి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల వరుసగా దాదాపు 25 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. మొదట రెండురోజుల వ్యవధిలో 16 మంది.. ఆ తర్వాత మరో రెండు రోజుల్లో మరో 9 మంది.. మొత్తం 25 మందికిపైగా మృతి చెందారు.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై అటు అసెంబ్లీలో, ఇటు బయట ఆందోళన చేస్తోంది. కల్తీ సారా మరణాలపై ఉభయ సభల్లో చర్చ జరగాలని టీడీపీ పట్టుబడుతూ ఆందోళన చేస్తోంది. అయితే ఇవన్నీ సహజమరణాలేననీ, టీడీపీ కావాలనే శవరాజకీయాలు చేస్తోందని అధికార పక్షం పేర్కొంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్లు చెబుతున్నది వాస్తవమా.. అధికార పక్షం చెబుతున్నది కరెక్టా అనే విషయాలను తెలుసుకుని ప్రజలకు అందించేందుకు “న్యూస్ ఆర్బిట్” టీమ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడి అందిస్తున్న కథనం ఇదీ.

Jangareddygudem Deaths: Fact Ground Report  by Victims
Jangareddygudem Deaths Fact Ground Report by Victims

Jangareddygudem Deaths: ఒక్కొక్కరిదీ ఒక్కో కథ..!

* మడిచర్ల అప్పారావు. ఈయన వయసు 51 సంవత్సరాలు. ఇతను జంగారెడ్డిగూడెంలోని గాంధీ బొమ్మ వీధిలో ఉంటారు. చేపల మార్కెట్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి చాలా కాలం నుండి మద్యం సేవించే అలవాటు ఉండేది. అయితే మద్యం రేట్లు పెరిగిపోవడంతో తక్కువ ధరకు లభించే సారాను సేవిస్తున్నాడు. పని ఉన్నా లేకపోయినా రోజు నాటు సారా తాగుతూ ఉండేవాడు. ఈ నెల 10వ తేదీన సారా తాగిన తరువాత అతనికి వాంతులు అయ్యాయ. కల్లు తేలేశాడు, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈనెల 9న మంగళవారం ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తీసుకువెళ్లగా 9.45 గంటలకే ఆయన చనిపోయాడు. చనిపోవడానికి ముందు ఆయనకు అప్పుడప్పుడు జ్వరం, జలుబు లాంటి వచ్చాయే కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేవు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవు అని అప్పారావు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. “మా నాన్న తాగిన నాటుసారాలో ఆ రోజు ఏదో కల్తీ జరిగి ఉంటుంది. రోజూ సారా తాగుతారు. ఎప్పుడూ ఏమి కాలేదు. ఆరోజు ఏదో కలిసి ఉంటుంది.. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు” అని అప్పారావు కుమార్తె రాజేశ్వరి, భార్య కూడా చెప్తున్నారు..!

Jangareddygudem Deaths: Fact Ground Report  by Victims
Jangareddygudem Deaths Fact Ground Report by Victims

* బండారు శ్రీనివాస్, ఇతని వయసు కేవలం 49 సంవత్సరాలు. తాపీపనికి వెళ్తుంటాడు.. పని ఉన్నా, లేకపోయినా నాటుసారా మాత్రం తాగడం నిత్యం అలవాటు.. ఈ నెల 10న కూడా సాయంత్రం బాగా తాగి ఇంటికి వచ్చాడని. రాత్రి బాగా తేడా చేసి.. వాంతులు అయ్యాయని.. అంతలోనే ఆసుపత్రికి తీసుకెళ్ళేసరికి మరణించాడని ఆయన భార్య లక్ష్మి చెప్తున్నారు.. “చాలా చురుకుగా ఉంటారు. ఏ నాడూ ఆరోగ్య సమస్యలు రాలేదు.. నాటు సారా తాగడం వల్లనే నూటికి నూరు శాతం మృతి చెందారు. వైద్యులు కూడా సారా తేడా చేసింది అని మాతో చెప్పారు. మేము ప్రభుత్వ అధికారులకు ఆ విషయమే చెప్పాము” అని అతని భార్య, కుమారుడు, కోడలు చెబుతున్నారు.

Jangareddygudem Deaths: Fact Ground Report  by Victims
Jangareddygudem Deaths Fact Ground Report by Victims

* వెంపల అనిల్ కుమార్, ఇతని వయసు కేవలం 37 సంవత్సరాలు..! ఎటువంటి అనారోగ్యం లేదు. జంగారెడ్డిగూడెంలో ఉప్పలిమెట్ట ప్రాంతంలో నివాసం ఉంటే అనిల్ కుమార్ బైక్ మెకానిక్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనిల్ కుమార్ తండ్రి, ఇద్దరు సోదరులు కూడా బైక్ మెకానిక్ లుగానే పని చేస్తున్నారు. అనిల్ కుమార్ కు చాలా కాలంగా మద్యం అలవాటు ఉండేది. అయితే మద్యం రేట్లు పెరిగిన తరువాత ఆరు నెలల కిందట నుండి నాటు సారాకు అలవాటు పడ్డాడు. అలా నాటు సారాకు బానిస అయ్యాడు. రోజు మాదిరిగానే ఈ నెల 11వ తేదీ నాటు సారా తాగాడు. మరుసటి రోజు తెల్లవారుఝామున లేచి కళ్లు తిరుగుతూ, వాంతులు చేసుకున్నాడు.. కుటుంబ సభ్యులు గుర్తించే సరికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలా జంగారెడ్డిగూడెంలో దాదాపు 25 మందికిపైగా చనిపోయారు. వాళ్ల మృతితో ఆ కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. అందరూ ఇదే తరహా కారణాలు, లక్షణాలు చెప్తున్నారు. మరణించిన అందరూ ముందు రోజు నాటుసారా తాగిన వారేనని ఆ కుటుంబ సభ్యులే వెల్లడిస్తున్నారు..! కానీ ప్రభుత్వం ఇవి సహజ మరణాలుగా తేల్చేయడంతో ఎటువంటి పరిహారం అందే పరిస్థితి లేదు. టీడీపీ మాత్రం బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారాన్ని అందించాయి. ఆ కుటుంబాలు అధారాన్ని కోల్పోయి ఆర్తనాధాలు చేస్తున్నాయి. కుటుంబ పోషణ ఎలా అని ఆవేదన చెందుతున్నాయి..!

author avatar
Srinivas Manem

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju