NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Jio TV : బానిసలుగా మార్చి.. బలి చేసి..! దేశానికి అంబానీ ఇస్తున్న మరో “డ్రగ్” సిద్ధం..!?

Jio TV : Ambanis anothe Drug getting ready

Jio TV : ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ 2013 నుండి వస్తుంది. కానీ యూట్యూబ్ లో 2016 నుండి పాపులర్ అయింది..!
ఈటీవీలో స్వరాభిషేకం 2014 లోనే ప్రారంభించారు. కానీ.. 2017 ఆరంభం నుండి యూట్యూబ్ ద్వారా అది ఫెమస్ అయింది.
2016 చివరి వరకు యూట్యూబ్ న్యూస్ చానెళ్లు పదో, పదిహేనో ఉంటాయి. కానీ.. 2017 నుండి వేళల్లో చానెళ్లు వచ్చేసాయి. అన్ని విభాగాల చానెళ్లు అలాగే పెరిగాయి.
2016 చివరి వరకు ఏపీలో స్మార్ట్ ఫోన్, నెట్ వినియోగదారులు 57 శాతం మాత్రమే. కానీ 2017 జూన్ నాటికి ఇది 86 శాతానికి చేరింది.

Jio TV : Ambanis anothe Drug getting ready
Jio TV Ambanis anothe Drug getting ready

Jio TV : పై లెక్కలు చూస్తుంటే 2016 రెండో వార్షికం నుండి 2017 మొదలు మధ్యలో ఏదో జరిగింది అనిపిస్తుంది కదా..!? అదే జియో. జియో ఫోన్, జియో సిమ్, జియో నెట్..! 2016 సెప్టెంబర్ లో వచ్చిన ఈ నెట్ సంచలనం దేశంలోని టెలికాం రంగాన్ని అతలాకుతలం చేసింది. మొదట ఏడాదిన్నర పాటూ వారి నెట్ కి, వేగానికి, ఫోన్ కి జనాలని ఎడిక్ట్ చేసేసి.. పోటీ దారులైన నెట్వర్క్ లపై దెబ్బ వేసింది. జియో దెబ్బకి ప్రభుత్వ రంగమైన బిఎసెనెల్ సహా.., వోడాఫోన్, ఐడియా వంటి టాప్ నెట్వర్క్ లు విలవిల్లాడగా.., అప్పటికే ఉన్న డొకోమో, యూనినార్, ఎయిర్సెల్ వంటివి మూసుకుపోయాయి. ఎయిర్టెల్ కొంచెం పోటీ దారుగా ఉంటున్నా.., తట్టుకోలేకపోతుంది. అలా అలా… 2018 వరకు జనాల్ని జియోకి ఎడిక్ట్ చేసిన తర్వాత… జియో చార్జీలు పెంచేశారు. అప్పటి వరకు మూడు నెలలకు రూ. 349 ఉంటె రీచార్జి అప్పటి నుండి రూ. 555 కి పెంచారు. అంటే మనిషిని నెట్ కి బానిసని చేసేసి… మనిషి మైండ్ ని బలహీనంగా మార్చేసింది జియో..!! సింపుల్ గా ఆలోచిస్తే… జియో సిమ్ వచ్చిన తర్వాతనే యూట్యూబ్, పేస్ బుక్ వీడియో.. వాడకం పెరిగింది. సో.., వాటికి వీటికి లింకు ఉంటుంది. అవన్నీ కార్పొరేట్ లింకులు… కాకపోతే సెల్లులో ఈ సిమ్ము, కాళ్ళ ముందు ఆ స్క్రీను మాత్రమే సగటు మనిషికి కావాల్సింది..!!

Jio TV : Ambanis anothe Drug getting ready
Jio TV Ambanis anothe Drug getting ready

Jio TV : ఇప్పుడు మరో ఇంజక్షన్.. సిద్ధమా..!?

జియో అప్పుడే అయిపోలేదు. దేశంలో చాలా వర్గాలను నెట్ బానిసలుగా మార్చేసిన జియో.. ఇప్పుడు స్మార్ట్ టీవీ బానిసలుగా మార్చేసే ప్రయత్నంలో ఉంది. అప్పుడు ఎలా అయితే జియో సిమ్ తీసుకువచ్చి ఫోన్లలో వేయించారో.. తక్కువ ధర అన్నారో… ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోయినా తమ జియో ఫోన్ అన్నారో…. ఇప్పుడు కూడా స్మార్ట్ డిజిటల్ టీవీని రంగంలోకి దించుతుంది. అంటే ఇంటికి జియో ఫైబర్ కనెక్షన్ ఉంటె… టీవీ, డిష్, టీవీలో నెట్, ఓటీటీలు, వైఫై అన్ని వచ్చేస్తాయి. సో… ఇంకా ఏమి అవసరం లేదు. ఇది కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఇప్పుడు సెటప్ బాక్సులు ఉన్న ధర కంటే చాలా తక్కువకే ఇచ్చేసి.. తన గుప్పిట్లో పెట్టుకుని.. బానిసలుగా మార్చేసి.. ఆ తర్వాత ధరలు పెంచేసి పెద్ద కార్పొరేట్ ప్లాన్ సిద్ధమైంది.

కేబుళ్లు సిద్ధం..! పోటీపోటీగా కాంట్రాక్టర్లు..!!

జియో నెట్ ఇంటింటికీ రావాలి అంటే ఊరూరా కేబుళ్లు ఉండాలిగా.. జియో అది కూడా చేస్తూనే ఉంది. ఇప్పటికే ఏడాదిన్నర నుండి ఏపీలోని చాలా చోట్లా కేబుళ్లు వేస్తున్నారు. దీని కోసం కాంట్రాక్టర్లు కూడా పోటాపోటీగా జియో గుత్తేదారులుగా మారారు. ఏపీలో కొందరు రాజకీయ సిఫార్సుల ద్వారా కూడా జియో కాంట్రాక్టర్లుగా మారారు. ఏపీ మొత్తం మీద 13 జిల్లాల్లో కలిపి 70 శాతం గ్రామాలకు జియో కేబుల్ విస్తరణ జరిగినట్టు తెలుస్తుంది. మరో మూడు నెలల్లో శతశాతం పూర్తి చేయనున్నారు.

(ఇక ఏపీలో ఇప్పటికే ఉన్న కేబుల్ కనెక్షన్ల పరిస్థితి ఏమిటి..? డిజిటల్ ప్రసారాల సంస్థలతో జియో ఎలా సంప్రదింపులు జరుపుతుంది..? ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం ఏంటి..? అనేది వచ్చే కథనంలో వివరంగా చూద్దాం..!)

author avatar
Srinivas Manem

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju