NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Junior NTR: టీడీపీ బెంగ తీర్చేసిన జూ. ఎన్టీఆర్..! 24 గంటల ఉత్కంఠకు అలా తెర..!

Junior NTR: Saved TDP.. And Saved Self by One Decision

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ నిఘా పెట్టింది.. టీడీపీలో ఉన్న నారా అనుకూల వర్గాలు అతన్ని పూర్తిగా నమ్మడం లేదు.. నందమూరి అనుకూల వర్గాలు నమ్మినా పూర్తిగా బయటపడడం లేదు.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ కొన్ని రోజులుగా ఆచితూచి వ్యవహరిస్తోంది. అవసరమైతే సొంత సోషల్ మీడియాల్లో అతన్ని ఆడుకోడానికి ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు.. ఈ రోజు ఒకరకంగా 24 గంటల ఉత్కంఠకు తెరపడింది. ఒకరకంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు.. టీడీపీ బెంగ, భయం పోగొట్టేసారు..

Read It… ; YS Jagan: సినిమా టికెట్లు గొడవ అంతా ఉత్తుదే..! ఈ రోజు భేటీ క్లైమాక్స్ – ఆ ప్లాన్ ఫెయిల్..!?

Junior NTR: Saved TDP.. And Saved Self by One Decision
Junior NTR Saved TDP And Saved Self by One Decision

Junior NTR: 24 గంటలుగా నిఘా.. చివరికి..!

సీఎం జగన్ నుండి టాలీవుడ్ పెద్దలకు పిలుపు వచ్చింది.. నిన్న (బుధవారం) సీఎం ఆఫీస్ నుండి చిరంజీవికి ఫోన్ వెళ్ళింది.. టాలీవుడ్ నుండి పది మంది వరకు పెద్దలు వచ్చి సీఎం గారిని కలవాలనేది దాని సారాంశం. మంత్రి పేర్ని నాని కూడా చిరుతో మాట్లాడారు.. ఒక్కడే కాకుండా ఇతర హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఒక పది మంది వరకు రావచ్చేనేది మంత్రి చెప్పిన మాట.. అందుకే చిరంజీవితో సహా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్ వంటి హీరోలతో పాటూ కొరటాల శివ, రాజమౌళి, డీవీవీ దానయ్య కూడా వెళ్తారని ప్రచారం జరిగింది.. ఇది మొదలు టీడీపీలో బెంగ మొదలయింది. “జూనియర్ ఎన్టీఆర్ ఏంటి..? సీఎం జగన్ ని కలవడానికి వెళ్లడం ఏంటి..!? వెళ్తే తాత తీసేస్తాం. ఏ మాత్రం వదలాబొమ్.. సినిమా కోసం పార్టీ విధానాలు తాకట్టు పెడతారా..!? సినిమా కోసం పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తారా..!? బాలయ్యలా ఉండలేరా..? అంటూ టీడీపీలోనే లోలోపల చర్చ జరిగింది.. మరోవైపు జూనియర్ కూడా ఈ అంశంలో చాలా ఆలోచించారు. ఇలా 24 గంటలుగా టీడీపీ వాళ్లేమో ఎన్టీఆర్ పై నిఘా ఉంచారు. ఎన్టీఆర్ తీవ్ర ఆలోచనలో పడ్డారు.. మొత్తానికి జూనియర్ ఈరోజు రాలేదు. సీఎం తో భేటీకి ఆయన, వెంకటేష్ చివరి నిమిషంలో ఆగిపోయారు. ఇద్దరివీ పొలిటికల్ కారణాలే.. దీంతో ఆయన సొంత పార్టీ నుండి ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. లేకపోతే ఇప్పటికే ఆయనకు టీడీపీ సోషల్ మీడియా ఒక ఆట ఆదుకునేది..!

Junior NTR: Saved TDP.. And Saved Self by One Decision
Junior NTR Saved TDP And Saved Self by One Decision

ఎన్టీఆర్ అప్పుడు కూడా అలా..! అందుకేనేమో..?

జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులుగా టీడీపీ అనుకూల వర్గాలు.., ఆ సొంత సోషల్ మీడియా.. ఆ అనుకూల మీడియా నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది నవంబరులో అసెంబ్లీలో నారా భువనేశ్వరి గురించి అసభ్య చర్చ జరగడం.. చంద్రబాబు దాన్ని బయటకు తీసుకొచ్చి.. మీడియా ముందు కన్నీరు కార్చడం.. దాన్ని టీడీపీ వాళ్ళు కసితీరా వాడుకొడవడం.. అటు నందమూరి కుటుంబం కూడా వైసీపీకి తమదైన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు టీడీపీలో ఎవ్వరికీ నచ్చలేదు. జూనియర్ ఎన్టీఆర్ వీడియో విడుదల చేసినప్పటికీ.. అందులో వల్లభనేని వంశీని, కొడాలి నానిని ఏమి అనలేదు కాబట్టి.. దాన్ని టీడీపీ వాళ్ళు లైట్ తీసుకున్నారు.., పైగా ఎన్టీఆర్ ని టార్గెట్ చేసారు. అందుకే అప్పటి నుండి ఎన్టీఆర్ అప్రమత్తమయ్యారు. వైసీపీ విషయంలో, ముఖ్యంగా ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త పడుతున్నారు. ఈరోజు ఎన్టీఆర్ మాత్రం సీఎం జగన్ ని కలిసి ఉంటె టీడీపీ పెద్ద రచ్చ చేసేది.., ఎన్టీఆర్ నే దారుణంగా ట్రోల్ చేసేది.. మరోవైపు ఎన్టీఆర్ జగన్ తో జత కడుతున్న పుకారు నిజమేనేమో అనే భయం, బెంగ పెట్టుకునేది..! అందుకే ఎన్టీఆర్ ఆ బెంగ తీర్చేసారు.. 24 గంటల ఉత్కంఠకు తెర దించేశారు. తానూ సేఫ్ అయ్యారు.., టీడీపీని సేఫ్ చేసారు..!

author avatar
Srinivas Manem

Related posts

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!