NewsOrbit
Featured బిగ్ స్టోరీ

రాజధాని కేసుల్లో మొన్న సీజే..ఇప్పుడు నారీమన్..!! ఇద్దరు జడ్జీల నాట్ బిఫోర్ మీ..!!

వేరే బెంచ్ కు పంపాలన్న జస్టిస్ నారీమన్..విచారణ వాయిదా

మొన్న చీఫ్ జస్టిస్…ఇప్పుడు ఈ జస్టిస్…

మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ చట్టం రద్దు పైన ప్రభుత్వం చేసిన చట్టాల పైన ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇవ్వటంతో దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తుండటంతో..ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును నాట్ బిఫోర్ మీ అంటూ మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ కేసు ఈరోజు జస్టిస్ నారీమన్ బెంచ్ మీదకు వచ్చింది. అయితే, ప్రభుత్వ అప్పీల్ కు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి పిటీషన్ దాఖలు చేసింది. రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి హాజరయ్యారు. దీంతో..నారీమన్ ఈ కేసును మరో బెంచ్ కు వాయిదా వేయాలంటూ నాట్ భిపోర్ మీ అంటూ కేసును వాయిదా వేసారు. ఒకే కేసులో సుప్రీంలో వరుసగా రెండో సారి ఈ విధంగా జరగటం అరుదైన విషయంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో..ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ పైన మరో బెంచ్ వద్ద విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వం చేసిన చట్టాల పైన ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.

justice Nariman opts out of bench and asks to entrust  to another bench in capital case
justice Rohinton Fali Nariman

ఏపీ ప్రభుత్వం రాజధాని బిల్లులకు గవర్నర ఆమోదంతో చట్టాలుగా మారుస్తూ గజెట్ విడుదల చేసింది. దీని పైన రైతులు హైకోర్టులో ఈ చట్టాల అమలు నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ తొలుత ఈ నెల 14వ తేదీ వరకు ఆ చట్టాలు అమలు కాకుండా స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఆ పిటీషన్ కు సమాధానంగా కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసాయి. కాగా, తిరిగి 14న ఈ పిటీషన్ తో పాటుగా రాజధాని అంశం పైన దాఖలైన పిటీషన్ల పైన విచారణ చేసిన హైకోర్టు ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో ను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సమయంలో సుప్రీంలో రెండు సార్లు ప్రభుత్వ పిటీషన్ విచారణకు వచ్చే సమయంలో మొన్న ప్రధాన న్యాయమూర్తి..ఇప్పుడు జస్టిస్ నారీమన్ నాట్ బి ఫోర్ మీ అంటూ తప్పుకోగా..ఇప్పుడు ఈ కేసు మరో బెంచ్ కు బదిలీ అవ్వాల్సి ఉంది. ఆ తరువాతే విచారణ జరగనుంది.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju