NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

అగ్రరాజ్యంలో విరబూసిన “కమలం”..! కమల హ్యారిస్ గెలుపు విశేషాలెన్నో..!!

మహిళాశక్తికి పరిమితులు లేవు. మహిళలు పీఠాలెక్కి ఏలడానికి అవరోధాలు లేవు..! మహిళలకు అవకాశాలు రావాలే గానీ.., తమ మేథస్సుతో విజయపతాక ఎగురవేస్తారు. అదే కమలా హారీస్ నిరూపించారు. అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నారు.., చరిత్రను లిఖించారు.., ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు..!! భారతి సంతతికి చెందిన ఆమె గురించి… మూలల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే..!!

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చరిత్రను తిరగ రాశారు. ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించారు. అగ్ర రాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగిన తొలి ఆసియన్-అమెరికన్ మహిళ కూడా ఆమెనే. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా మూడురోజుల పాటు కొనసాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఎన్నికవ్వగా.., ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Photo by Adam Schultz Biden for President Kamala harris

కమలా మూలాలు చూస్తే..!!

కమలా హ్యారిస్ మూలాలు తమిళనాడులో ఉన్నాయి. పూర్వీకులు బీసెంట్ నగర్ చెన్నై.., సముద్రం దగ్గర్లో ఉండేవారు. ఆమెది ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం. తాత పీవీ గోపాలన్. భారత రాయబారిగా పనిచేశారు. పలు దేశాల్లో విధులు నిర్వర్తించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్, 19 ఏళ్ల వయసులోనే (అంటే 1958లో) చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. 1964లో బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి, పీహెచ్‌డీ పట్టా తీసుకున్నారు. క్యాన్సర్‌ పరిశోధకురాలిగా ఉగ్యోగంలో స్థిరపడ్డారు. అక్కడే వెస్టిండీస్‌లో భాగమైన జమైకాకు చెందిన న‌ల్ల‌జాతీయుడు డొనాల్డ్‌ జె హారిస్‌ను వివాహం చేసుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌లో 1964 అక్టోబర్ 20వ తేదీన కమలా హ్యారిస్ జన్మించగా, ఆ దంపతులకు మరో సంతతి గా మాయ జన్మించారు. ఇమ్మిగ్రెంట్ పేరెంట్స్‌కు పుట్టిన అక్కచెల్లెలు చట్టప్రకారం అమెరికన్లు.

Kamala Harris Grand Parents

తల్లి నీడలోనే పెరిగారు..!!

కమల ఏడో ఏట ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. శ్యామల ఒంటిరిగానే కుమార్తెలు ఇద్దర్నీ పెంచి పెద్ద చేశారు. వారు సెలవుల్లో తండ్రివద్దకు వెళ్లినప్పుడు ఇరుగుపొరుగువారు నల్లజాతీయులుగానే చూశారు. తెల్లజాతి పిల్లలు ఆడుకోవడానికి రానీయ లేదు. దాంతో ‘‘మేము ఉంటున్న దేశం (అమెరికా) నన్ను, చెల్లెలు మాయాను నల్లజాతి బాలికలులాగానే చూస్తుందన్న విషయం మా అమ్మకు అర్థమయింది. అందుకే ఆత్మవిశ్వాసంతో గర్వించే నల్లజాతి మహిళలుగా మమ్మల్ని తీర్చిదిద్దాలని ఆమె నిర్ణయించుకొంది’’ అని తన ఆత్మకథ ‘ద ట్రూత్‌ వియ్‌ హోల్డ్‌’లో కమల రాసుకున్నారు. చదువుల్లో బాగా రాణించిన కమల వాషింగ్టన్‌లోని హొవార్డ్‌ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. కాలిఫోర్నియోలోని హేస్టింగ్స్‌ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడ బ్లాక్‌ లా స్ట్టూడెంట్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1990లో కాలిఫోర్నియాలో టాప్ ప్రాసిక్యూట‌ర్‌గా ఆమె ఉన్న‌త స్థానాన్ని అందుకున్నారు.

Kamala Harris Mother And Sister

ఇదే కమల జీవితంలో మలుపు..!!

భార‌తీయ సంత‌తిరాలు కమల హర్రీస్ వ‌య‌సు 55 ఏళ్లు. 2002లో శాన్‌ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికవడం కమల జీవితాన్ని మలుపుతిప్పింది. ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి ఆమే కావడం విశేషం. ఇక్కడ తన ప్రతిభను చూపారు. కాలుష్యాల నివారణకు 2005లో ప్రత్యేకంగా ‘పర్యావరణ నేరాల విభాగా’న్ని ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల నేరాలపై కఠినంగా వ్యవహరించారు. ట్రాన్స్‌జెండర్లు వేధింపులకు గురవుతుండడంతో వారికి రక్షణ కల్పించేందుకు ‘హేట్‌ క్రైం’ విభాగాన్ని కూడా నెలకొల్పారు. ఉరిశిక్షలు బదులు జీవితాంతం జైలులో ఉండేలా శిక్షలు విధిస్తే మంచిదన్నది ఆమె అభిమతం. ఈ విషయంలో ఒత్తిడి వచ్చినా ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు. పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించడం ఆమె హయాంలోనే చోటు చేసుకుంది. సరయిన కారణం లేకుండా 50 రోజుల పాటు గైర్హాజరయినందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు… విభిన్నమైన సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షలు వేశారు. 2011లో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళ, మొదటి ఆఫ్రికన్‌-అమెరికన్‌ కూడా ఆమెనే. 2014లో మరోసారి ఈ పదవిని నిర్వహించారు.

నాలుగేళ్ళ కిందట నుండి చురుగ్గా..!!

2016లో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున సెనేట్‌కు ఎన్నికయి జాతీయ రాజకీయల్లోకి వచ్చారు. కాలిఫోర్నియా అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఎన్నికైన తొలి మ‌హిళ‌గా, తొలి ఆఫ్రికా అమెరికా సంత‌తి మ‌హిళ‌గా కూడా క‌మ‌లా హారిస్‌కు గుర్తింపు వ‌చ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రానికి రెండుసార్లు ఆమె అటార్నీ జ‌న‌ర‌ల్‌గా చేశారు. డెమోక్ర‌టిక్ పార్టీలో రేజింగ్ స్టార్‌గా కీర్తిని గాంచారు. ఈ నేప‌థ్యంలో ఆమె 2017లో కాలిఫోర్నియా జూనియ‌ర్ సేనేట‌ర్‌గా పోటీ చేశారు. అయితే ఆ చాంబ‌ర్‌లో ఎన్నికైన రెండ‌వ న‌ల్ల‌జాతి మ‌హిళ‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది ఆరంభంలో డొమెక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి అర్హత కోసం.. ఓక్లాండ్‌లో సుమారు 20 వేల మందితో ప్రదర్శన చేసినప్పటికీ… పలు కారణాలతో ఆమె అర్హత సాధించలేదు. ప్ర‌గ‌తిశీల‌ న్యాయ‌వాదిగా ఆమె ఎవరి మీదైతే పోరాడారో అదే బైడెన్, కమల్ హారీస్ ను ఉపాధ్య‌క్ష ప‌ద‌వి అభ్య‌ర్తిగా ఎంపిక చేశారు. ఒక‌వేళ ఈ ఎన్నిక‌ల్లో ఉపాధ్య‌క్షురాలిగా క‌మ‌లా హారిస్ గెలిచారు కాబట్టి 2024లో అమెరికా అధ్య‌క్ష పోటీకి భార‌త సంత‌తీయురాలు పోటీలో నిలిచే అవ‌కాశాలు ఉంటాయి.

Kamala Harris Childhood Photos

భారతీయుల పాత్ర ముఖ్యం సుమీ..!!

ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీని గెలిపించి అమెరికన్లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడారని కమలా హారీస్ అన్నారు. అమెరికాకు ఇది సరికొత్త రోజు అని ఆమె పేర్కొన్నారు. తమ గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో కొన్నాళ్లుగా బాధలు చూశామన్న ఆమె.. అమెరికా కొత్త అధ్యాయానికి నాంది పలుకుతామని చెప్పారు. సరికొత్త అమెరికాను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఇక కమలా హారీస్ వంటి భారతీయ మూలాలున్న మహిళను ఎన్నుకునే దశకు అమెరికన్లు చేరారంటే అందులో భారతీయుల పాత్ర కాదనలేనిది. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవి కోసం ఎంపిక చేయడంలో డెమొక్రాట్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది స్పష్టమైంది. అమెరికా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో స్థిరపడిన ప్రవాస భారతీయలను ఆకట్టుకోవడంలో భాగంగా. కమలా హ్యారిస్ పేరును ఖరారు చేశారు. ఆ వ్యూహం ఫలించింది. అమెరికా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న ఆమె ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju