Kodali Nani: CM Jagan Replacing Nani with..!?
Andhra Pradesh నిజమే కొడాలి నాని Kodali Nani చెప్పినట్టు “పేకాటలో పట్టుబడితే ఉరి శిక్ష వేయరు. పేకాటలో పట్టుబడితే జైలుశిక్ష వేయరు. పేకాటలో పెట్టుబడి ఎంతో కొంత ఫైన్ కట్టేసి వచ్చేయొచ్చు..!” మంత్రి కొడాలి నోటి నుండి జాలువారిన ఈ మాటలు యదార్ధాలే. ఈ మాటలకు తలదించుకోవాల్సింది కఠిన చట్టాలు చేయలేని ప్రభుత్వమే..! కానీ ఒక మంత్రి.. జగన్ YS Jagan Mohan Reddy కి అత్యంత సన్నిహితుడు అని చెప్తుంటారు… ఓ సామాజికవర్గానికి Kamma Caste ఆ పార్టీలో ప్రతినిధి అని కూడా అంటుంటారు.., ఆ సామాజికవర్గం మొత్తం ఆ పార్టీలో అతనితో నడుస్తుంది అని అంతర్గతంగా చర్చిస్తుంటారు.. మరి ఈ మంత్రి గారి పేకాట డెన్ పై పోలీసులు దాడి అంటే ఇది కచ్చితంగా సంచలనమే కదా..! ఆ సామాజికవర్గానికి గుబులే కదా..! ఇప్పుడు అదే చర్చ మొదలయింది..! “మా ప్రతినిధి.. పార్టీలో మా వాయిస్ అయిన మంత్రికి ఇలా ఎందుకు జరిగింది..?” అనేది ఒక లోతైన చర్చ..!
అందరికీ తెలిసిన సున్నితమైన వాస్తవం చెప్పుకోవాలి అంటే… రాష్ట్రంలో రెడ్డిలకు వైసీపీ YSR Congress Party.., కమ్మ వాళ్ళకి టీడీపీ Telugu Desam Party సొంత ఇళ్ళు వంటివి. రెడ్డి సామాజికవర్గంలో 75 శాతం జగన్ కి జై కొడుతుంటే.. కమ్మ సామాజికవర్గంలో 67 నుండి 70 శాతం చంద్రబాబు వెంట ఉన్నట్టే అనుకోవచ్చు. రాష్ట్రం మొత్తం ఓటింగ్ లో రెడ్డిలు వాటా ఆరున్నర నుండి ఏడు శాతం ఉంటారు. అంటే రఫ్ గా 27 లక్షల మంది ఓటర్లు ఉండవచ్చు..! మొత్తం ఓటర్లలో కమ్మ వాళ్ళ వాటా అయిదున్నర శాతం ఉండవచ్చు.. అంటే సుమారుగా 22 లక్షలు ఉండవచ్చు అని ఒక అంచనా. ఇవి కూడా పశ్చిమగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తారు ఉంటె.., కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. కాపులు 16 శాతం వరకు ఉంటారు.. అంటే దాదాపుగా వీరి ఓట్లు 65 లక్షలకు పైబడి ఉన్నట్టే. ఇక ఈ సామజిక లెక్క పక్కన పెట్టి.., సామజిక భజనలు, తతంగాలు చూసుకుంటే..!!
వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేలు సంఖ్య తక్కువే. చేతి వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. కానీ కాస్త మొదటి నుండి పై స్థాయిలో ఉన్న వారు మాత్రం తలశిల రఘురాం, కిలారు రోశయ్య, లావు శ్రీకృష్ణ దేవరాయలు, కొడాలి నాని మాత్రమే. వీరిలో రఘురాం సైలెంట్ అయ్యారు. కిలారు రోశయ్య ఓడిపోయి సైలెంట్ అయ్యారు. లావు శ్రీకృష్ణ తన పనిలో తాను ఉన్నారు. ఇక కొడాలి నాని మాత్రమే మంత్రిగా పైస్థాయిలో మిగిలారు. ఆయన ఆధ్వర్యంలో వల్లభనేని వంశి, కరణం బలరాం లాంటి కమ్మ సామజిక వర్గ నేతలు జగన్ కి జై కొట్టారు. మనం ముందు నుంచి చెప్పుకున్నట్టు వైసీపీలో కమ్మ వాళ్ళకి అంత స్థానం లేదు. కమ్మ ఓట్లలో 70 శాతం వరకు టీడీపీకే వెళ్తాయి. కానీ ఎలాగైనా టీడీపీని పతనం చేయాలి అనుకుంటున్న జగన్ కి కమ్మ ఓట్లు(నాయకులు) అవసరమే. కమ్మ ఓటింగ్ ని, బలమైన నాయకత్వాన్ని టీడీపీకి దూరం చేస్తేనే తన లక్ష్యం నెరవేరుతుంది. కానీ అది అంత సులువు కాదు. సో.., కమ్మ సామజిక వర్గ ఓట్లు టీడీపీ నుండి ఎక్కడికి పోవు. కాకపోతే ఆ నాయకులే అధికారం గొడుగు కోసం పార్టీలు మారుతుంటారు. కానీ సామాజికవర్గం అభిమానం, పెద్దల మాటలు కాదనుకుని ఎన్నాళ్ళు వైసీపీలో ఉంటారు..? ఉండగలరు అనేది అనుమానమే. ఇటువంటి తరుణంలో కొడాలి నాని అడ్డాలో ఆయనని ఇరికించే ప్రయత్నం జరగడంతో ఒక్కసారిగా వీరిలో గుబులు మొదలయింది..!! తమ వర్గం నాయకుడిపై ఇలా జరిగింది అంటే మాకు ఈ పార్టీలో విలువ ఇంతేనా..? మమ్మల్ని కొంత అదుపులో పెట్టడానికి ఇలా చేశారా..? రాష్ట్రంలోని చాల జిల్లాల్లో పేకాట అద్దాలు నడుస్తున్నా వదిలేసి గుడివాడపై మాత్రమే ఎందుకు కన్ను వేసినట్టు..? అనే చర్చ మొదలయింది..!!
రెడ్డి, కమ్మ నాయకులు తమ సొంత ఇళ్ల లాంటి పార్టీలు వదిలి బయటకు రారు. వచ్చినా అది ఆ నాయకుడితో వ్యక్తిగత వైరమే కారణం (తాత్కాలికం) అయి ఉండవచ్చు. సో.., వైసీపీ ఎంత చేసినా కమ్మ సామజిక వర్గంలో వచ్చేది అయిదు, ఆరు లక్షలు కంటే ఎక్కువ ఉండవు. ఈ ఓట్లు కోసం.., కొడాలి నాని లాంటి నేతలు ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం జగన్ కి లేదు. వైసీపీలో కొడాలి నాని అట్రాక్షన్ అవుతూ చీటికీ మాటికీ చంద్రబాబుని, టీడీపీని తిడుతున్నారు. అనవసర పదాలు, అసందర్భ వ్యాఖ్యలు కూడా వాడుతున్నారు. ఆయన మాటల్లో చంద్రబాబుపై అతి కోపం.., జగన్ పై అతి భజన కనిపిస్తుంటాయి. సో.. ఈ అతి అంతరార్ధం జగన్ కి బాగా తెలుసు. అందుకే ఈ అతి కట్ చేయడానికి ఒక ప్రణాళిక, పధ్ధతి ప్రకారం పేకాటపై పోలీస్ ఆపరేషన్ జరిగి ఉండవచ్చు..! మొత్తానికి ఇది ఒక సామజిక హెచ్చరికగా అనుకుంటే వాళ్ళ భుజాలు తడుముకున్నట్టే..!!
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…