NewsOrbit
బిగ్ స్టోరీ

ఓపెన్ చేసి తీరాల్సిందే – కే‌సి‌ఆర్ పీక మీద కూర్చున్నారు వారంతా!

ఆర్థికంగా సంపన్నమైన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే లాక్ డౌన్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఇష్టం వచ్చినన్ని రోజులు పొడిగించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఎలాగోలాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు కానీ ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ఆయన చాలా గట్టిగానే ఉన్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం మరొక రెండు వారాలు లాక్ పొడిగిస్తున్నట్లు చెప్పిన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన సడలింపుల కింద మద్యపానాన్ని విక్రయించడం మొదలుపెట్టొచ్చు అని తెలియజేసిన సంగతి తెలిసిందే.

నిన్నటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క షాపు కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. కానీ కొన్ని పత్రికలు మాత్రం పాలకుడి అభిప్రాయానికి భిన్నంగా మద్యం షాపులు తెరవాలి అన్నది ప్రజల అభిప్రాయం అన్న ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

సదరు పత్రిక వాదన ఏమిటంటే మద్యం షాపులు తెరిచేందుకు ఏపీ, మహారాష్ట్ర మరియు కర్నాటక ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చారని అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షల వల్ల మద్యం ఇక్కడ పొంగిపొర్లే అవకాశం ఉందట. అదే కనుక జరిగితే రాష్ట్రంలో జనం జేబులు గుల్ల అయిపోవడం ఖాయమని…. అధిక రేట్లకు ఇక్కడ విక్రయిస్తారు అని వారు భవిష్యత్తును చెప్పేశారు. అదే కాకుండా దీని వల్ల కల్తీ మద్యం ప్రవేశించి ప్రజల ప్రాణాలకు ముప్పు తేవచ్చు అని మరియు గుడుంబా బట్టీలు కూడా అప్పుడే మొదలైపోయాయని కళ్ళకు కట్టినట్లుగా వార్తల్లో ప్రచురించారు. ఇటువంటి వార్తలతో ప్రజల్లో కొద్దిగా అసహనాన్ని రగిల్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారి అజెండా ఏమో.

అంతేకాకుండా ఆమధ్య లిక్కర్ షాపులపై ఒక ప్రశ్న అడిగిన పాపానికి ఒక జర్నలిస్ట్ పై కేసీఆర్ విరుచుకుపడిన తీరు మనకి తెలిసిందే. ఇక పక్క రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ తమ రాష్ట్రంలోని పత్రికలే ప్రభుత్వ మద్యం పై తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నట్టు వార్తలు రాస్తూ ఉంటే సీఎం గారు మాత్రం ఏం చేస్తారు. ఈరోజు సాయంత్రం ఒక అత్యవసర మీటింగ్ కు ఆదేశించి గ్రీన్, ఆరెంజ్ మరియు రెడ్ జోన్ లలో మద్యం విక్రయాల విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. చివరికి అతి త్వరలోనే తెలంగాణలో కూడా మద్యం విక్రయాలు మొదలైపోతాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంత మంది గొంతు మీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తే ఎంత సీఎం అయినా ఏం చేస్తాడు లే…!

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju

Leave a Comment