లాజిక్ లేకుండా హైదరాబాద్ ప్రజలకి కేసీఆర్ వార్నింగ్…! పతనం తప్పదా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి వాగ్ధాటించడం మొదలుపెడితే విమర్శకులు సైతం అతని మాటలు అలా వింటూ ఉండిపోతారు. అంతా మంచి మాటకారి అయిన కెసిఆర్ ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు పెట్టిన ప్రెస్ మీట్ లో లాజిక్ మర్చిపోయి మాట్లాడారు…

 

కేసీఆర్ ప్రెస్ మీట్ ఎలా ఉన్నా హైలైట్…!

మామూలుగా కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే వాగ్దానాలు, విమర్శలు, పంచ్ లు, కౌంటర్లు, డైలాగ్ లకు కొదవ ఉండదు. ఇక ఎన్నికలకు ముందు మొదటి సారి ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ హైదరాబాద్ ప్రజలను వరాల జల్లుతో హోరెత్తించారు. తనదైన శైలిలో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నో ఆఫర్లను ఇచ్చేశారు. అయితే ఆ తర్వాత కేసీఆర్ జిహెచ్ఎంసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలతో ఇప్పుడు వార్తలకెక్కారు.

మమ్మల్ని కాదని ఏదీ జరగదు

కెసిఆర్ వివరణ ఏమిటంటే…. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కాకుండా మరే ఇతర పార్టీ గెలిచినప్పటికీ…. రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని మరో ఇతర పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగించే వీలు లేదని తేల్చి చెప్పేశారు. “అంటే బిజెపి కనుక విజయం సాధిస్తే టిఆర్ఎస్ వారికి ప్రజలకు మంచి చేయడంలో సహకరించదు అని కెసిఆర్ అంటున్నారా…?” అంటూ విమర్శకులు రెచ్చిపోయారు.

ఇదే బిజెపి అంటే ఏమి చేస్తారు సారూ….?

ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే ఇక్కడ కేసీఆర్ ఒక లాజిక్ మిస్ అయ్యారు అనే చెప్పాలి. ఇదే విధంగా బిజెపి వారు కూడా రాష్ట్రంలో తమ పార్టీ కాకుండా టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లభించదు అని అంటే కెసిఆర్ ఊరుకుంటారా? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గగ్గోలు పెడుతున్న ఆయన జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని…. జాతీయ పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఎటువంటి మేలు జరగదని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు..!