NewsOrbit
బిగ్ స్టోరీ

దేశ ప్రజల ‘లవ్’ ని  గెలుచుకున్న అగర్వాల్…

ఈ కరోనా క్లిష్ట కాలంలో దేశం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రోజు సమాచారం ఆ రోజున అందిస్తున్న అధికారి ఒకతను మనందరికీ బాగా సుపరిచితుడు. రోజూ వార్తల్లో కనిపించి అతని మొఖం ఇప్పుడు దేశ ప్రజల్లో చాలామందికి ధైర్యం. అఖిల భారత సర్వీసు అధికారులు అయితే అతను అత్యంత కీలక వ్యక్తి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారాల నోట్లో కూడా ఆ పేరు ఎప్పుడూ నానుతూ ఉంటుంది. అతనే మన లవ్ అగర్వాల్. కరోనా నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారిపోయిన ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోం.ది అంతర్జాతీయంగా కూడా వెలుగులోకి వచ్చిన అతను కరోనా సమాచారం పాత్రికేయులకు వివరిస్తూ టీవీ ఛానళ్లలో కనిపిస్తూ ఉంటారు.

ప్రజలంతా విపరీతమైన ఆందోళన మరియు అసహనంతో ఉన్నప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఎంతో ధైర్యంగా కనపడుతూ ఉంటారు. ఎంతటి ఆందోళనకర సమాచారాన్ని అయినా చాలా ప్రశాంతంగా వెల్లడించే ఆయన విలేకరుల సమావేశంలో ఓపికగా సమాధానాలు ఇస్తూ అతని మాటలతో, చేతలతో, హావభావాలతో ఈ గడ్డు పరిస్థితిని దేశం అధిగమించగలదు అని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రజల్లో ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. ఇక కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను జన్నాలో ధైర్యం నింపేలా సమృద్ధిగా వివరిస్తూ ఉంటారు. అలాగే పర్సనల్ గా అంతర్జాతీయ దేశాల విధానాలను విశ్లేషిస్తూ ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో కేంద్రానికి విలువైన సూచనలు, సలహాలు అందజేస్తూ ఉంటారు. అంతిమంగా తన బాధ్యతల నిర్వహణలో సంపూర్ణ చిత్తశుద్ధి కనపరుస్తూ అటు ప్రభుత్వంతో పాటు ఇటు దేశ ప్రజల ప్రశంసలు కూడా పొందుతున్నారు.

ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తలలో నాలుకలా వ్యవహరిస్తున్న లవ్ అగర్వాల్ రాత్రి 12 గంటల వరకు తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో తలమునకలవుతున్నారు. స్వయంగా వైద్యుడైన డాక్టర్ హర్షవర్ధన్ ఆరోగ్య శాఖకు సంబంధించి లవ్ అగర్వాల్ పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోతున్నారు అంటే ఇతని మేధాసంపత్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది యువతికి ఇతను ఆదర్శం. సమస్య పరిష్కారం అయ్యేవరకూ విశ్రాంతి లేదని అగర్వాల్ స్వయంగా వ్యాఖ్యానించడం అతని నిబద్ధతకు నిదర్శనం అని చెప్పాలి.

ఇక లవ్ అగర్వాల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులకు మరియు యంత్రాంగానికి ఎంతో పరిచయస్తుడు. ఉత్తరప్రదేశ్ లో పుట్టిన అగర్వాల్ ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత సివిల్స్ పై దృష్టి సారించిన ఈయన ఒక ఇంజనీర్ గా కన్నా ప్రభుత్వ ఉన్నతాధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చని భావించడం చాలా గొప్ప విషయం.1996లో ఐఏఎస్ అధికారి ఎంపికైన అతనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కేటాయించారు. కృష్ణా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన లవ్.. భద్రాచలం అసిస్టెంట్ కలెక్టర్ గా… మెదక్, విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సేవలందించారు. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. 2016 లో కేంద్రాల కి డిప్యూటేషన్ పై వెళ్లారు.

ప్రతి ఐఏఎస్ అధికారి ఏ రాష్ట్ర క్యాడర్ అయినప్పటికి విధిగా కొంతకాలం కేంద్రంలో పనిచేయాలి. దీనినే డిప్యుటేషన్ అని వ్యవహరిస్తారు. ఇందులో భాగంగానే 2016 లో లవ్ అగర్వాల్ కేంద్రానికి వెళ్ళారు. 2021 వరకు కేంద్రంలో ఉండి తిరిగి ఏపీకి వస్తారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శిగా లవ్ అగర్వాల్ సేవలు ప్రశంసనీయమని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment