మద్యం ప్రియులకు శుభవార్త..! ఇక అవి కూడా తెరుచుకున్నాయి….

కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా బార్లు, పబ్లులు, క్లబ్లు వంటి ఎన్నో ప్రదేశాలు మూతపడ్డాయి. అన్ లాక్ లో భాగంగా ఇవి తెరుచునేందుకు చివరి వరుసలో నిలిచాయి.

 

అలాగే కొన్ని రాష్ట్రాల్లో పర్మిషన్లు వచ్చినప్పటికీ కేసుల తీవ్రతను బట్టి వాటిపై నిషేధం విధిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా కరోనా వైరస్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే వీటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో మూతపడ్డ ప్రతి ఒక్క బారు పబ్బు, క్లబ్బు తెరచుకునేందుకు అనుమతిలిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు పాటిస్తూ వాటిని నడుపుకోవచ్చని ప్రకటించింది.

అలాగే అక్కడ పనిచేసే సిబ్బందికి మాస్క్లు, గ్లౌజులు తప్పనిసరి అని సూచించింది. రోజుకు రెండు సార్లు అయినా ఆ ప్రదేశాలను శుభ్రం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు కూడా తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం అన్ని ప్రదేశాల్లో క్యూ పద్ధతులు పాటించేలా చర్యలు తీసుకోవాలని అనేక మార్గనిర్దేశకాలను జారీ చేసింది.

ఈ షాపుల్లో పనిచేసే సిబ్బంది అందరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని స్పష్టం చేసింది. రోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చేయాలని క్లీన్  హేయాలని కస్టమర్ కూర్చునే ముందు కుర్చీలు, టేబుల్లని క్లీన్ చేయాలని అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం అనే అంశాన్ని మరవకూడదు అని సూచించింది.

తాగే ప్రదేశంలో తగినంత వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనివైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్ లో పై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే మ్యూజిక్ ఈవెంట్స్, డాన్స్ షోల పై కూడా నిషేధం కొనసాగుతుందని తెలియజేసింది.