NewsOrbit
Featured బిగ్ స్టోరీ

బాబు బాజా.., ఏబీఎన్ ఆర్కే బాకా సమర్పించు “లోకగ్రంధం”..! తమ్ముళ్లూ సిద్ధంకండి..!

దటీజ్ లోకేశ్

వాల్మీకి… వ్యాసుడు… ఒక లోకేశుడు…! వాల్మీకి రామాయణం రాశారు. మహానుభావుడిగా మారారు…! వ్యాసుడు మహాభారతం రాశారు. మహానుభావుడిగా మారారు…! ఇప్పుడు లోకేశుడు “వ్యాసం” రాసారు. ఏబీఎన్ ఆర్కే వారు పబ్లిష్ చేసారు..!రామాయణ, మహాభారతాలు హిందువులకు పవిత్ర గ్రంథాలుగా మారినట్టే… లోకేశుడి వ్యాసాలు తమ్ముళ్లకు పవిత్రగంధంగా మారి “లోకగ్రంధం”గా చరిత్రలో నిలిచిపోతాయేమో..!? లోకేసుకి తర్ఫీదునిచ్చిన తెలుగు గురువు శ్రమ ఫలించిందేమో..? కొడుకు గొప్ప వ్యాసం చూసి చంద్రబాబు కల ఫలించిందేమో..? తన పత్రికలో వ్యాసం రాయించాలన్న రాధాకృష్ణ కోరిక నెరవేరిందేమో…! తెలుగు అందరూ రాస్తారు, మాట్లాడతారు..! లోకేశు రాస్తేనే, మాట్లాడితేనే మజా..! వ్యాసాలు అందరూ రాస్తారు. లోకేశు రాస్తేనే మజా..! అందుకే వ్యాసాలందు లోకేశు వ్యాసం వేరయా…!!

lokesh file photo
lokesh file photo

అప్పుడే గుర్తించిన చంద్రబాబు

ఎవరికైనా ఏవైనా లక్షణాలు సహజసిద్ధంగా వస్తాయ్.. కానీ కొందరికి మధ్యలో వస్తాయ్.. కొందరికి కాలం నేర్ప పాఠాలతో ఎంతో నేర్చుకుంటారు. మరికొందరికి వ్యవస్థలు పాఠాలు నేర్పుతాయ్… మరికొందరికి మనుషులే పాఠాలు నేర్చుకునేలా చేస్తారు. అయితే ఆయన మాత్రం పాఠాలు పైన చెప్పిన అన్ని రకాలుగా నేర్చుసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రికి తనయుడిగా, పార్టీ అధినేతకు ముద్దుల పట్టీగా ఉన్న ఆయన ఇప్పుడు ఈ రకంగా ఆ రకం అని లేకుండా అన్ని విధాలుగా… దున్నేస్తున్నారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇలా ఆ మీడియా ఈ మీడియా అన్న లెక్కలు వేసుకోకుండా ఒక రేంజ్‎లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆయన ఆలోచనల్లో పవర్ ఉందని తండ్రి ఎప్పుడో గుర్తించాడు. నగదు బదిలీ స్కీమ్ సృష్టి కర్తగా తనయుడు నిలిచాడంటూ కితాబిస్తాడు ఆ మమతల తండ్రి. ఇక ఆ తనయుడు సాగిస్తు్న్న అక్షర హోమం ఎలా సాగుతుందో తెలుసుకోడానికి మరి లోపలికి పదండి…

lokesh, chandra babu naidu
lokesh chandra babu naidu

మేకింగ్ ఆఫ్ లీడర్ లోకేశ్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు ఇటీవల ఓ పత్రికలో రాసిన వ్యాసం చూసిన తర్వాత ఆయన తెలుగు అంత గొప్పగా ఎలా రాయగలుగుతున్నాడన్న ఫీలింగ్ కలిగింది. టైటిల్ సాక్షిగా ఆయన ఆంధ్ర పవర్ చూపించారు. ఆ భాష చూసిన వారికి ఎవరికైనా ఔరా అని ముక్కున వేలేసుకుంటారు. తెలుగులో చినబాబు ఇంతటి పరాక్రమం ఎప్పుడు సాధించారా అని ఠక్కున కామ్ ఆయిపోతారు. తండ్రి వారసత్వంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేశ్.. తెలుగు ఉచ్ఛారణ విషయంలో సాగించిన పరిణామ క్రమం మనందరం అంత తేలిగ్గా మరచిపోలేం. ఆయనకు తెలుగు బోధించడానికి మరో పద్ధతిలో ఓ నిపుణుడ్ని నియమించి లక్షల్లో జీతాలు కూడా చెల్లించారని నాడు మీడియా వార్తలు కూడా వచ్చాయ్… అంత చేసినా… ఆయన మాట్లాడే తెలుగుపై చాలా మందికి చాలా అభ్యంతరాలున్నాయ్. తెలుగు సరిగా మాట్లాడలేకపోయేవారు. అయితేనేం ఆయన వార్నింగ్‎లు ఇచ్చేశారంటూ మీడియాలో పతాక స్థాయిలో న్యూస్ మాత్రం వచ్చేది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన గురి పెట్టారంటే ఆ మాటలు మనం మనం చెవులతో వినాల్సిందే. అది మీడియా సమావేశమైనా… లేక నేతలకు పరామర్శ అయినా… లోకేశ్ చేసే విమర్శల్లో వేడివాడి సమపాళ్లలో ఉంటుంది. అయితే అందుకు అధికార పక్షం కౌంటర్లు మామూలుగా ఉండవనుకోండి.

lokesh article
lokesh article

నెంబర్ 1 ఇక లోకేశానా?

కాకుంటే ఇక్కడ లోకేశ్ ఒక సూపర్ శక్తిగా రూపాంతరం చెందేందుకు సమయం ఆసన్నమైంది పెద్దాయన గుర్తించేశాడు. ఇక ఎందుకు ఆలస్యం అనుకున్నారో ఏమో గానీ పూర్తి స్థాయిలో రంగంలోకి దించేస్తున్నారు. పెద్దాయనకు వయసు కూడా మీదపడుతోంది. అసలే బయట పరిస్థితులు బాలేవు. బయటకు చొచ్చుకుని వెళ్లడం అంత వీజీ కూడా కాదు. వచ్చే ఎన్నికల నాటికి ప్రచారం చేయడం, ఎన్నికల వ్యూహాలు పన్నడం ఇవన్నీ కొంచెం కష్టమైన పనే… 2014లో తనయుడిని రంగంలోకి దించి ఔరా అన్పించిన నారా వారు ఇప్పుడు… లోకేశ్‎ను పూర్తి స్థాయిలో రంగంలోకి దించేందుకు డిసైడైపోయారు. పార్టీలో నెంబర్ 2 ఎవరూ… నెంబర్ 1 ఎవరు అన్న మీమాంశకు తెర దీసేలా చినబాబు జనంలోనూ, అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ దున్నేసేందుకు స్కెచ్ వేసేశారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యేక కథనాలు వండి వార్చుతున్నారు. చినబాబు, రాష్ట్రం కోసం, అమరావతి కోసం ఏం చేస్తారన్నదానిపై కథనాలు రకరకాలుగా వచ్చే్స్తున్నాయ్. ఇక లోకేశ్ సోషల్ మీడియా సైన్యం కూడా బాగానే పనిచేస్తోంది. 2019కి ముందు… వైసీపీని టార్గెట్ చేసిన లోకేశ్… ఇప్పుడు అదే సోషల్ యుద్ధంతో అధికార పక్షాన్ని కవ్విస్తున్నారు. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వంపైనా, సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా మాటల తూటాలు పేలుతున్నారు.

lokesh, jc diwakar reddy
lokesh jc diwakar reddy

తెలుగులో ఓ రేంజ్‎లో ఆర్టికల్

తాజాగా ఒక పత్రికలో లోకేశ్ రాసిన వ్యాసం నిజంగా నెటిజన్లను కంగుతినిపిస్తోంది. జగన్మోసావతారం అంటూ రాసిన ఆ కథనంలో వాడిన భాష మామూలుగా లేదు. తెలుగు సరిగా వచ్చినవారు కూడా రెండు సార్లు చదవాల్సిందే. ఆయన రేకెత్తిన అంశాలు కూడా చాలా లోతైనవే. అయితే చినబాబుకు సలహాలిస్తున్నదెవరో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అవి పూర్తి స్థాయిలో పరపక్వంగా లేవన్నది నూటికి నూరు శాతం నిజం. జగన్మోహన్ రెడ్డి స్థాయితో పోల్చుకునే వ్యక్తి ఒక వ్యాసం రాస్తే అది ఎలా ఉండాలి? ఒక స్పీచ్ ఇస్తే ఎలా ఉండాలి… అనవసరాలు ఎందుకు? డైరెక్ట్ ఎటాక్ ఉండాలి… ఆ వ్యాఖ్యలు జనంలోకి నేరుగా వెళ్లాలి… ఇలా ఇప్పటి వరకు లోకేష్ చేస్తున్న విమర్శలు వెళ్లాయా అంటే అనుమానమే… ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు వాటికి జనంలో ఉన్న రెస్పాన్స్ కూడా ముఖ్యమే కదా…

lokesh (file photo)
lokesh file photo

చిరంజీవి-బాలయ్య అభిమానుల యుద్ధం

ఇక్కడ లోకేశ్ కు వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్పాలి. చిన్నప్పుడు చిరంజీవి, బాలయ్య అభిమానులు నిత్యం ఘర్షణపడేవారు. చిరంజీవి కష్టపడి డ్యాన్స్ లు, ఫైట్లు చేసి పేరు తెచ్చుకుంటే బాలయ్య తండ్రి వారసత్వంగా సినిమాల్లో ఎదిగారు. అయితే ఇద్దరినీ కాంపరిజన్ చేస్తూ… అభిమానులు కొట్టుకుచచ్చేవారు. ఇప్పుడు లోకేశ్ బాబు కూడా… తాను జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం అని అనుకోవడం కాదు… ఓ వర్గం ప్రజలు లోకేశే అదుర్స్ అంటూ కమ్మగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్ట్స్ లోకేశే తమను ఏలాలన్న ఫీలింగ్‎కు కూడా వచ్చేశారు. చిరంజీవి, బాలయ్య కష్టపడి వారిని వారు ప్రూవ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎలాంటి పదవులు అనుభవించకుండానే జైలు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలతోనే గడిపారు. 341 రోజులపాటు 3648 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. ఉద్యమంలా సాగిన పాదయాత్రను ఒక మీడియా అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. పైపెచ్చు అందులో నెగిటివ్ అంశాలనకే ప్రాయారిటీ ఇచ్చేది. ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కారు సంక్షేమ ఒరవడి తనను రాజకీయంగా దెబ్బతీస్తుందన్న బెంగ జగన్మోహన్ రెడ్డిలో ఉండేది. అయినా తన హామీలనే జగన్ నమ్ముకున్నారు. జనం ఆదరించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ దక్కని అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు.

chiranjeevi, balakrishna file photo
chiranjeevi balakrishna file photo

గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినట్టేనా?

ఇప్పుడు లోకేశ్ కు ముందు చాలా సవాళ్లే ఉన్నాయ్.  ఇప్పుడు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది… బాగు చేయడం అంత తేలిక కాదు… తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకే మళ్లీ అధికారం సాధించుకోవడానికి పదేళ్ల కాలం పట్టింది. వయసు మీద పడినా పాదయాత్రలు కూడా చేయాల్సి వచ్చింది. మారాను మారనంటూ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు లోకేశ్ ను  పూర్తి స్థాయి నాయకుడిగా ఎలివేట్ చేసే బాధ్యతను ఆ మీడియా అందుకుంటోంది. ఆర్థిక వనురులు పుష్కలంగా ఉన్నాయ్. వ్యవస్థల ఆధీనం ఉంది. ఇలాంటి సిట్యూవేషన్లో లోకేశ్ పూర్తి స్థాయి నాయకుడి అవతారమెత్తడమంటే అది కత్తి మీద సామే… మొత్తంగా తెలుగులో ఆయన రాసిన ఆర్టికల్ ఈ కథనం రాయడానికి ఉసిగొల్పిందని మాత్రం మళ్లీ చెప్పాల్సి వస్తోంది.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju