NewsOrbit
బిగ్ స్టోరీ

థాకరే కి దారి దొరికినట్టే…!

ఓ పక్క రాష్ట్రాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి, మరో పక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా కొనసాగే విషయంలో తలనొప్పి ఎదుర్కొంటున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఊరట లభించింది.

ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు మే 27లోపు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో సీఎం ఉద్దవ్‌ పదవీ గండం నుంచి గట్టెక్కినట్లు అయింది. మహా వికాస్ అఘాడీ తరుఫున సీఎంగా ఉద్దవ్ బాధ్యతలు చేపట్టి ఈ నెల 27 నాటికి ఆరు నెలలు పూర్తి కావస్తోంది. అయితే ఆయన ఇంత వరకూ ఏ సభకూ ఎన్నిక కాలేదు. నవంబరు 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం.. పదవిని చేపట్టిన ఆరు నెలల్లోగా ఆయన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే అని భావిస్తున్న తరుణంలో కరోనా తీవ్రతరం కావడం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి 26న జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ద
ఉద్ధవ్‌ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని మహారాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసినా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ ను ఎన్ సి పి నేత, మంత్రి అజిత్ పవార్ స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినా అయన ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. దీనితో శివసేన సీనియర్ నేత గవర్నర్ తీరుపైన, పరోక్షంగా కేంద్రంలోని
బిజెపినీ విమర్శించారు. చివరకు స్వయంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ రంగంలోకి దిగి మొన్న గవర్నర్ ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌కు నిన్న గవర్నర్ లేఖ రాశారు. ఏప్రిల్ 24 నుంచి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయననీ, వీటి భర్తీపై నిర్ణయం తీసుకోవాలనీ ఆయన తన లేఖలో కోరారు.

మరో పక్క ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఉద్ధవ్ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పిఎంకు వివరించారు. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ రాజకీయ అస్థిరత అనేది సరైంది కాదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఉద్ధవ్ ప్రధాని మోదీని కోరారు. ఎమ్మెల్సీగా తనను గవర్నర్ నామినేట్ చేయకపోతే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ప్రధానికి ఉద్ధవ్ తెలిపారు. ఈ పరిణామాల క్రమంలో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో మహా సీఎం ఉద్ధవ్ ఎదుర్కొంటున్న ఒక తలనొప్పికి పరిష్కారం లభించినట్లు అయింది.

దేశంలోనే కరోనా బాధిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నది. కోవిడ్-19 కేసుల సంఖ్య 10 వేల మంది పైచిలుకు చేరుగా, 400 మందికి పైగా మృతి చెందారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju

Leave a Comment